మొదటి పెజి
 మేధోమధనం




అనువాదములు:

'العربية / Al-ʿarabīyah
Bahasa Indonesia
Català
中文 / Zhōngwén
Deutsch
English
Español
Filipino/Tagalog
Français
Ελληνικά / Elliniká
हिन्दी / Hindī
Italiano
日本語 / Nihongo
Kiswahili
한국어 / Hangugeo
بهاس ملايو / Bahasa Melayu
Português
Română
Русский
Српски / Srpski
తెలుగు /Telugu
Tiếng Việt

                                        

మిగితా పాజీలు

విభాగాలు

స్థల పటములు

ముఖ్యమైన పదాలు

సంప్రదించ వలసిన చిరునామా

అవసరమైన పత్రాలు

అవసరమైన అనుసందానములు

విషయాలు:

విషయాలు:

విషయాలు:

మేధోమధనం;
విధానాలు మరియు ప్రక్రియ

రచన: ఫిల్ బార్ట్లే , పీ. హేచ్. డీ

అనువాదం రాజేంద్ర ప్రసాద్ పొట్ట పెంజర


మార్గదర్శకాలు

సమాజాన్ని శక్తివంతం చేసే ఒక టెక్నిక్ ( సాంకేతిక పద్దతి )

సమూహంలోని అందరు కలసి సమిష్టి నిర్ణయం తీసుకొనే దిశగా తోడ్పడెందుకు ఈ మార్గదర్శకాలు మీకు ఉపయోగపడతాయి. చిన్న సమాజ మీటింగులలో లేదా సమాజ ఆధార సంస్థల (CBO) కార్యవర్గ సమావేశాలలో లేదా ఒక ప్రభుత్వేతర సంస్థ (NGO) మేనేజర్ల మధ్య లేదా ప్రభుత్వ మంత్రిత్వ శాఖలలో లేదా ఏదేని ఒక ఐక్య రాజ్య సమితి (ఉన్) సంస్థల సమావేశాలలో ఎక్కడైనా ఈ టెక్నిక్ (సాంకేతిక పధ్ధతి) ని ఉపయోగించవచ్చు. 5 నుండి 200 మంది సభ్యుల మధ్య కూడా మేదోమధన కార్యక్రమం నిర్వహించ వచ్చును.

ఈ కార్యక్రమాన్ని నడిపించుటకు మీకు మంచి నాయకత్వ లక్షణాలు ఉండాలి, కాని అదే సమయంలో మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఏమిటంటే ఈ కార్యక్రమం యొక్క మూల సూత్రాలను మరియు విధి విధానములను ఖచ్చితంగా పాటించాలి (ఉదాహరణకు విమర్శలు, గుస గుసలు, మొదలైనవి ఉండకూడదు) . అక్కడ తీసుకున్న నిర్ణయాలు ఆ సమూహం లోని వారు కలసి తీసుకున్నట్లు ఉండాలి కాని మీరు బలవంతంగా వారి పై రుద్దినట్లు ఉండకూడదు. మీరు కేవలం ఒక సృజనాత్మకమైన సాముహిక నిర్నయీకరణ కు ఒక అనుసంధానకర్తగా మాత్రమే ఉండాలి.

మేధోమధనం కార్యక్రమం యొక్క లక్ష్యం :

మేదోమధన కార్యక్రమ ముఖ్య లక్ష్యం ఏమిటంటే, జట్టుగా ఒక సమస్యని నిర్వచించడం, అందరు కలసి ఒక ఐకమత్యమైన కార్యాచరణతో ఆ సమస్య యొక్క అత్యుత్తమ సమాధానాన్ని కనుగొనడం.

ఆవశ్యకతలు :

  1. పరిష్కరించుటకు ఒక సమస్య ;
  2. టీం (జట్టు) గా పనిచేయ గల సత్తా ఉన్న ఒక సమూహం. ఇది 5 నుంచి 10 మంది సభ్యులు కల ఒక చిన్న నిర్వహణా వర్గం లేదా కార్యాచరణ జట్టులా ఉండవచ్చు. అందులో శిక్షకులు, క్షేత్ర స్థాయి కార్యకర్తలు, కార్మిక సంఘాలు ఉండవచ్చు. ఆ స్థాయి నుంచి కొన్ని వందల మంది గ్రామస్తులు కలసి నిర్వహించే సమావేశం వరకు ఉండవచ్చును;
  3. ఒక పెద్ద నల్ల బల్ల ( బోర్డు ) , పెద్ద సైజు కాగితాలు లేదా అందరికి కనిపించే సైజు లో మరేదైనా మరియు వాటిపై రాయడానికి చాక్ పీసులు లేదా మార్కర్ పెన్నులు; మరియు
  4. సమన్వయకర్త (మీరు) . సమన్వ్వయకర్త ముఖ్య లక్ష్యం ఏమిటంటే మేధోమధనం లో పాల్గొనే వారి సలహాలను క్రోడీకరించడం. సమన్వయకర్త ఎట్టి పరిస్థితి లో కుడా తన సొంత అభిప్రాయాలను వారి పైన రుద్ద రాదు. కాని అదే సమయం లో ఆ సమావేశం యొక్క ఉద్దేశ్యాలని పక్క దారి పట్టనియకుండా చూసే నాయకత్వ లక్షణాలను సందర్భానుసారంగా ప్రదర్శించాలి;

మూల సూత్రాలు ;

  • ప్రతి సమావేశాన్ని సమన్వయ కర్త నాయకత్వం వహిస్తాడు;
  • సమావేశం లో పాల్గొన్న అభ్యర్ధుల సలహాలను కోరుతాడు;
  • ఎలాంటి విమర్శలను (ఎవరి సలహాల పైనా) అనుమతించడు ;
  • అన్ని సలహాలను బోర్డు పై రాస్తాడు (ఎంత వింతైన సలహాలైనా );

విధానం :

  1. సమస్యను నిర్వచించండి:
    • సమస్యలు ఎన్నో ఉండవచ్చును. వాటిలో అతి ముఖ్యమైన సమస్య ఏమిటి అని అడగండి;
    • ఒక సభ్యుడు చెప్పిన అభిప్రాయం లేదా సలహా పైన ఎవర్ని విమర్శ చేయకుండా చూడండి;
    • సభ్యులు చెప్పిన సలహాలన్నింటిని బోర్డు పైన రాయండి;
    • ఒకే విషయానికి సంబందించిన లేదా ఒకే రకమైన సమస్యలన్నింటిని ఒక పక్కన రాయండి. అలా వారు చెప్పిన సమస్యలన్నింటిని కొన్ని విభాగాలుగా విభజించండి; అప్పుడు
    • వాటిని ప్రాముఖ్యతా క్రమం లో వ్రాయండి (అన్నింటికన్నా ముఖ్యమైన వాటిని అన్నింటి కన్నా పైన రాయండి);
  2. గమ్యం ఉత్పాదించండి:
    • ఇప్పుడు సమస్య నిర్వచనాన్ని అవతలి కొస నుంచి చూడండి (అదే దాని సమాధానం లేదా పరిష్కారం అవుతుంది);
    • పైన నిర్వచించిన సమస్య యొక్క పరిష్కారమే మన గమ్యం (ప్రధాన గమ్యం);
    • సమస్య యొక్క పరిష్కారమే మన గమ్యం గా నిర్వచించండి;
    • మన గమ్యం ఏంటో బోర్డు పైన రాయండి; అప్పుడు
    • వాళ్ళు ఎంపిక చేసుకోన్నదే వారి గమ్యం అని వారికి ఒకసారి గుర్తు చేయండి;
  3. లక్ష్యాలను నిర్వచించండి :
    • గోల్ ( గమ్యం ) మరియు ఆబ్జెక్టివ్ ( లక్ష్యం ) ల మధ్య తేడా ను వివరించండి ;
      కొలవగల, ఖచ్చితమైన మరియు నిర్ణీత కాల వ్యవధి కలదే లక్ష్యం అని సమన్వయకర్తకు అవగాహన ఉండాల్సిన విషయం. (స్మార్ట్ (యస్. యమ్. ఎ. ఆర్. టీ.) చూడండి).
    • కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులను లక్ష్యాలను గురించి అడగండి;
    • వారు సూచించిన లక్ష్యాలనన్నింటినీ బోర్డుపై రాయండి;
    • ఎలాంటి విమర్శలను (ఎవరి సలహాల పైనా) అనుమతించరాదు;
    • ఒకే రకమైన లేదా ఒకదానికి ఒకటి సంబంధం ఉన్న లక్ష్యాలనన్నింటినీ ఒక వద్ద రాసి వర్గాలుగా విభజించండి;
    • వాటిని ప్రాముఖ్యతా క్రమం లో వ్రాయండి (అన్నింటికన్నా ముఖ్యమైన వాటిని అన్నింటి కన్నా పైన రాయండి);
    • వాళ్ళు ఎంపిక చేసుకోన్నదే వారి లక్ష్యం అని వారికి ఒకసారి గుర్తు చేయండి;
  4. ఇప్పుడు ఆ లక్ష్యాన్ని సాధించుటకు వారి వద్ద ఉన్న వనరులను మరియు వారికున్న అడ్డంకులను గుర్తించండి :
    • కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులను వనరులను, ప్రతిబందకాలను సూచించమని అడగండి;
    • వారు సూచించిన వనరులను, ప్రతిబందకాలను బోర్డుపై రాయండి;
    • ఎలాంటి విమర్శలను ( ఎవరి సలహాల పైనా ) అనుమతించరాదు;
    • వారు సూచించిన వనరులను బోర్డుపై రాయండి;
    • వాటిని ప్రాధాన్యతా క్రమం లో బోర్డు పై (అతి ముఖ్యమైనది అన్నింటికన్నా పైన) రాయండి;
    • వాళ్ళే (మీరు కాదు) ఆ జాబితా తయారు చేసారని వారికి గుర్తు చేయండి;
    • వారు సూచించిన ప్రతిబందకాలను వర్గాలుగా విభజించండి;
    • వాటిని ప్రాధాన్యతా క్రమం లో బోర్డు పై (అతి ముఖ్యమైనది అన్నింటికన్నా పైన) రాయండి;
    • వాళ్ళే ఆ జాబితా తయారు చేసారని వారికి గుర్తు చేయండి;
  5. వ్యూహాన్ని గుర్తించండి:
    • సభ్యులను వ్యూహాలను గురించి సలహాలు అడగండి;
    • వారు సూచించిన వ్యుహాలనన్నింటినీ బోర్డుపై రాయండి;
    • ఎలాంటి విమర్శలను (ఎవరి సలహాల పైనా) అనుమతించరాదు;
    • ఒకే రకమైన లేదా ఒకదానికి ఒకటి సంబంధం ఉన్న వ్యుహాలనన్నింటినీ ఒక వద్ద రాసి వర్గాలుగా విభజించండి;
    • వాటిని ప్రాధాన్యతా క్రమం లో బోర్డు పై (అతి ముఖ్యమైనది అన్నింటికన్నా పైన) రాయండి;
    • వాళ్ళే ఆ జాబితా తయారు చేసారని వారికి గుర్తు చేయండి;
    • ఆ జాబితా లో అన్నింటికన్నా పైన ఉన్న వ్యూహాన్ని ఎంపిక చేసుకోండి;
  6. జట్టుగా వారు తీసుకున్న నిర్ణయాలనన్నింటినీ బోర్డుపైన క్రోడీకరించండి:
    • సమస్య ;
    • గోల్ (గమ్యం);
    • లక్ష్యాలు;
    • వనరులు;
    • ప్రతిబంధకాలు; మరుయు
    • వ్యూహము;
    వారంతా కలసి ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకున్నారని వారికి తెలపండి. ఎవరైనా ఒకరు పైన వివరించిన ప్రతి తరగతి లో ఏ నిర్ణయం తిసుకోబడిందో రాయగలిగితే, అదే ఒక శాస్త్రీయమైన ప్రణాళికా ప్రతి. అందరూ కలసి ఒక జట్టుగా వారు ఆ ప్రణాళికా ప్రతి ని తయారు చేసుకున్నారని, అది పూర్తిగా వారి "సొంతం" అని వారికి చెప్పండి.

ముగింపు (సారాంశం) :

ఇది చాలా సింపులే(సాధారణమైనది). కానీ అంత ఈజీ ( సులభం) కాదు. మీరు ఇందులోని వివిధ దశలను రోల్ ప్లేలు, గేం లు(ఆటలు) మరియు ఇతర టెక్నిక్ లు వాడి విజయవంతం చేయవచ్చును. రకరకాల శైలులలో దీన్ని ప్రయోగించి చూడండి.

సమన్వయకర్తగా మీ ఉజ్జ్వల భవిష్యత్తుకు నా శుభాకాంక్షలు!

––»«––

ఈ ఉదాహరణలో తీసుకున్న నిర్ణయాలు నిర్వహణా శాస్త్రం (మేనేజ్ మెంటు) యొక్క 4 కీలక ప్రశ్నలు పై ఆధారపడి ఉంటాయి. మనందరం కలసి మనం వాటి సమాధానాలను ప్రాజెక్టు సృజన .నుంచి రాబట్టాలి. లేదా మరొక ప్రత్యామ్నాయం గా స్వాట్ (swot) విశ్లేషణ (ఎక్కువ సభ్యులు గల సమావేశాలలో) ఉపయోగపడుతుంది.


మేధో మధన కార్యక్రమం:


మేధో మధన కార్యక్రమం

© ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ బార్ట్లే
వెబ్ డిజైన్ బై లౌర్దేస్ సదా
––»«––
చివరగా మార్చబడిన సమయం: 2011.12.16

 హోం పేజి

 మేధో మధనం