Tweet అనువాదములు:
'العربية / al-ʿarabīyah |
పధక రూపకల్పన, యోచనలు, బయట వనరులుపధక రూపకల్పన మరియు దానికి కావలసిన వనరులను సమకూర్చుకొనుటఫిల్ బార్ట్లే పిహెచ్ డి, చేఅనువదించినది రాజేష్ కాల్వశిక్షణ కరపత్రికమీరు సంఘ పధక రూపకల్పన లో సంఘానికి సహాయం చేస్తునప్పుడు బయట వనరులు మరియు అంతర్గత వనరుల మధ్య ఒక సమతుల్యం పాటించాలి. సంఘం బయట వనరుల కోసం ప్రయత్నిస్తే సంఘం బయట వనరుల మీద ఆధారపడవలసి వస్తుంది. అదే అంతర్గత వనరుల మీద ఆధారపడితే సంఘం బలవంతమై స్వయం సమృద్ధి గా తయారు అవుతుంది.మీ పని ఏంటి అంటే సంఘం ఎవరి మీదా ఆధారపడకుండా పోరాడడం అని గుర్తించండి; సంఘం సభ్యులు సంఘం బాగు చేయుట కోరకు బయట సహాయం మీద ఆధారపడితే మీరు సంఘం స్వయం సమృద్ధి గా (సంఘం అంతర్గత వనరుల మీద ఆధారపడడం) తయారు అవడం యొక్క గొప్పతనాన్నివారికి తెలియజేయాలి. ఒక వేళ సంఘం భారీ పధకం ఎన్నుకొని మరియు అందుకు కావలసిన డబ్బు సమకూర్చుకో లేకపోతే మీరు వాళ్ళను వాస్తవంగా (బయట దాన ధర్మాల మీద ఆధారపడకుండ) ఉండేలా హెచ్చరించాలి. యోచన అంటే నిధుల కోసం సామర్ధ్యం కలిగిన దాతలకు సమర్పించు అభ్యర్ధన. మంచి యోచన పధక రూపకల్పన లా తయారు చేయబడి ఉంటుంది. మరియు దాతలు ఎందుకు దానం చేయాలో వివరించబడి ఉంటుంది. అదే పధక రూపకల్పన ప్రభుత్వం లో ఫై అధికారులకు సమర్పించటానికి, మరియు ప్రభుత్వ నిధులు పొందటానికి మూలంగా ఉండాలి. మీకు ఎంత చేయాలని ఉన్న మీరు సంఘం బదులు పని చేయ వద్దు. కార్య నిర్వహణా విభాగం స్వయంగా చేయటం ద్వారా నేర్చుకుంటారు. సంఘం లో నిరక్షరాస్యులు ఆ రూప కాల్పనలో భాగం అవ్వాలి. అదే పధక రూపకల్పన బయట నిధులు పొందటానికి యోచనగా ఉపయోగించవచ్చు. అయితే ఆ పధకం అమలు పరచటం ఫై సంఘం మొత్తం యొక్క ఆమోదం పొందాలి. ఆ విధంగా అది యోచన లాంటిది. ఒక వేళ అది జిల్లా అధికారుల అనుమతి పొందవలసి ఉంటే వారికి కూడా దాని కాపీ ని ఇవ్వడం మంచిది. పధక రూపకల్పన యొక్క సారం, మేధో మధనం ద్వారా, సిద్ధాంతపరంగా ముఖ్యమైన నాలుగు ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి. మనకు ఏమి కావాలి, మనకు ఏమి ఉన్నాయి, మనకు ఉన్న వాటిని ఉపయోగించి మనకు కావలసినవి సమకూర్చుకోవటం మరియు మనం చేసిన తర్వాత ఏమి జరుగుతుంది. సమన్వయకర్త గా మీ పని ఏంటి అంటే ఈ నాలుగు ప్రశ్నలకు వివరంగా కార్య నిర్వహణ విభాగం తో చర్చించాలి. వాటి జవాబులను ఒక నిర్దిష్ట మైన పత్రం ఒకటి కార్య నిర్వహణ విభాగం చేత తయారు చేయించాలి. మీరు వనరులను గురించి సంఘం తో చర్చించేటప్పుడు సంఘం దెగ్గర సరిపడ మూల ధనము, వనరులు లేవు అని కార్య నిర్వహణ విభాగం సభ్యుల నుంచి వినవలసి రావచ్చు. ఒకే ఒక్క బయట దాతల మీద ఆధారపడే నైజం ఉంటుంది. ఒకే ఒక్క ఆధారం మీద ఆధార పడితే పరాధీనత పెరుగుతుంది. దాని ద్వారా సంఘం బలం తగ్గి పోతుంది. కొంచెం శ్రమ ద్వారా సంఘ సభ్యులు తమకు కావలసిన వనరులను వివిధ మార్గాలలో సేకరించవచ్చు. వనరుల సేకరణ చూడండి సమన్వయకర్త తమకు కావలసిన వనరులను వాళ్ళే సమకోర్చు కోవాలి అని గద్దించకూడదు. అల కాకుండా మీరు అన్ని వనరులను పేర్కొని, సంఘ సభ్యులు వాటిలో ఏమి సమకూర్చు కోగలరో గుర్తంచమని అడగాలి.
సహాయము
పొందటానికి వివిధ మార్గాలు:
ఈ జాబితా సంపూర్ణ జాబితా కాదు. మేధో మధనం ద్వారా సంఘ సభ్యుల (కేవలం నాయకుల నుంచే కాదు) నుంచి సలహాలను తీసుకోండి. సంఘ పధకాల వనరుల సేకరణ కోసం మరిన్ని వివరాలకు నిధుల ను చూడండి. ––»«––సంఘ సహకారం; నిర్మాణం © ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ బార్ట్లే
––»«–– |
మొదటి పేజీకి |
ఏర్పాటు చెయ్యటం |