మూల పేజి
సిద్ధము కావటము



అనువాదములు:

'العربية / al-ʿarabīyah
Bahasa Indonesia
বাংলা / Baṅla
Български език
Català
Cebuano / Sugboanon
中文 / Zhōngwén
Deutsch
English
Español
Euskara
Ewe
Filipino/Tagalog
Français
Galego
Ελληνικά / Elliniká
हिन्दी / hindī
Italiano
日本語 / Nihongo
Kiswahili
بهاس ملايو / Bahasa Melayu
Polszczyzna
Português
Română
Русский
सिन्धी / Sindhi
Af Soomaali
తెలుగు /Telugu
Tiếng Việt
Türkçe
اردو / Urdu
Èdè Yorùbá

                                        

మిగితా పేజీలు

విభాగాలు

స్థల పటము

ముఖ్య పదాలు

మాతో సంప్రదించండి

ఉపయోగపడు పత్రాలు

ఉపయోగపడు అనుసంధాలు

మీ లక్ష్య సమాజమును తెలుసు కొనండి

మీ కార్యములు వలన ఎవరు లాభము పొందుతారు?

రచన: ఫిల్ భర్ట్లె, పీ హెచ్ డీ

అనువాదకులు: సరస్వతి కాజ


శిక్షణ కరపత్రం

సాంఘిక పరిశోధకులు మరియు పరిశీలించి విశ్లేషించు వాళ్ళుగా ఉంటూ;  మంచి కుమ్మరికి బంకమన్ను యెక్క స్వభావము తెలియాలి

ఇంకొక సామెత మనము సమాజ అభివృద్దిలో వాడేది, "కుమ్మరికి తను వాడే బంకమన్ను గురించి తెలియాలి."  మీకు మీ సమాజమే మీ బంకమన్ను.  దానిని మీరు పోత బోసి, అభివృద్ది చేసి ఏదో ఒక విధముగా శక్తి వంతము చేయాలి.

అది చేయటానికి మీకు ఆ సమాజము గురించి బాగా తెలియాలి. (మరియు సమాజముల స్వభావము). మీరు సాధ్యమైనంత వరకు సమాజము యెక్క సాంఘిక వ్యవస్థాపన, ఆర్ధక వ్యవస్థ, భాషలు, పఠము (చిత్ర పఠము), చిక్కు సమస్యలు, రాజకీయాలు, మరియు జీవావరణ శాస్త్రము విషయాల గురించి వీలైనంత తెలుసు కొనవలయను.

మీ పరిశోధన కేవలము సంబంధము లేని వాస్తవమై విషయాల జాబితా సంపాదించటము కాకూడదు; మీరు వాటిని పరిశీలించి విశ్లేషించి సమాజ స్వభావము ఒక సాంఘిక పద్ధతిగా అర్ధము చేసుకొన వలెను. (సమాజము అంటే ఏమిటి ? మరియు సాంఘిక పరిశోధన) చూడండి .

అనేక విధములైన ఈ విషయాలకు మధ్య సంబంధము గురించి ఆలోచించండి.

మంచి ప్రారంభము చేయట ఒక పఠము తయారు చేయట. ప్రజలు ఎక్కడ నివసిస్తారు? సమాజములో ఏ వనరులు, సదుపాయములు ఉన్నవి?  (ఉదాహరణకు రహదారులు, బాటలు, నీటి సరఫరా, వైద్యశాల, బడి, ఆరోగ్య రక్షణము, బజారు మరియు ఇతర సామాజిక వనరులు మరియు సేవలు).

తరువాత మీరు సమాజ సభ్యులకు సమాజ స్థితి (వనరులు, అవసరాలు, అవకాశములు, సమస్యలు) అంచనా వేయిస్తునప్పుడు; మీరు వాళ్ళకు సమాజ చిత్ర పఠము తయారు చేయుటలో మార్గము చూపుతారు. అదే మీరు ఇప్పుడు మీ కోసము చేస్తే, తరువాత వాళ్ళతో కలిసి చేసే కార్యములో సహాయ పడుతుంది.

మీ నోట్సు దినచర్య పుస్తకములో వ్రాయండి. సమాజ వ్యవస్థ, ఆర్ధక వ్యవస్థ, భాష(లు), రాజకీయాలు, మానవత్వపు విలువలు, సాంప్రదాయములు మరియు వాటి పకృతి పరిసరములకు(జీవావరణ శాస్త్రము) సంబంధము గల విషయములను గమనించండి.

అనేక విధములైన ఈ విషయములు మధ్య ఎలాంటి సంబంధము కలదో పరిశీలించి విశ్లేషించటము కొనసాగించండి.

––»«––

© ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ భర్ట్లె
వెబ్ రూపకర్త లోర్డస్ సడా
––»«––
చివరగా మార్చబడిన తేది: 2011.12.18

 మూల పేజి
సిద్ధము కావటము