Tweet అనువాదములు:
'العربية / al-ʿarabīyah |
ఉత్తేజ పరిచే చక్రముసమాజాన్ని శక్తివంతం చేసే ప్రక్రియబై ఫిల్ భర్ట్లె, పిహెచ్డిఅనువాదము శంకరతేజస్వి ఉప్పులూరిశిక్షణ కరపత్రముఒక క్రమములో మీరు తీసుకునే అడుగులే ఉత్తేజ పరచడంలో కల్పించుకోవడం అంటేసమాజాన్ని శక్తి పరచడానికి ఒక తర్కబద్దమైన మరియు క్రియాత్మకమైన సాంఘిక ప్రక్రియ ఉంది. ఆది కాలమానం మరియు చిన్ని వివరాలలో మారొచ్చు, కానీ నమూనా మౌళికంగానే ఉంటుంది. దాన్ని మొదలుపెట్టి మరియు దాన్ని పాటించడం మీ పాత్ర. ఉత్తేజ పరిచే చక్రము ఈ ప్రక్రియ కోసం ఉగాండ సామాజిక నిర్వహణ కార్యక్రమము నుండి తీసుకున్న ఒక ఉదాహరణ మాత్రమే. మీ పాత్ర సమాజాన్ని బట్టి, కాలాన్ని బట్టి, మీకు అందుబాటులో ఉన్న వనరుల బట్టి, మీ యజమానుడి విధానాల బట్టి లేదా ఇతర సందర్భాల బట్టి మారచ్చు. ఆవశ్యక ప్రక్రియ ఈ విధంగా ఉంటుంది: మొదట మీరు మీ పని చేయడానికి అనుమతి మరియు అధికార అనుజ్ఞానము తీసుకుంటారు. తరువాత సమస్యలు ఉన్నాయి అని సమాజాములో ఎరుగుదల పెంచడం మొదలు పెడుతారు. మీరు సమస్యలు పరిష్కరిస్తారని ప్రజలు ఊహించుకోకుండా మీరు హెచ్చరించాలి, సమాజము తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి సంభవ వనరులు తమ దగ్గరే ఉన్నాయి అని మీరు చూపాలి. వాళ్ళకి కావల్సింది కేవలం వాళ్ళ సంకల్పం మరియు మీరు వాళ్ళకి ఇవ్వగల కొంచం నిర్వాహణ నైపుణ్యము. సమాజ ఏకీకరణ, అంచనా మరియు ముఖ్యమైన ఆశయముపై అంగీకరించడంలో మీరు ఉపకరిస్తారు. ఒక కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేయడంలో లేదా ఉన్న దాన్ని పునరుద్ధరించడంలో సహాయపడుతారు. వాళ్ళు ఒక చర్య ప్రణాళిక మరియు పరియోజన రూపురేఖలు తయ్యారు చేయడంలో సహాయపడుతారు. వాళ్ళు, మీరు కాదు, దాన్ని నిర్వహిస్తుండగా పారదర్శకత, పరివీక్షణ మరియు నివీదిక ఉండేలా మీరు ఉత్సాహపరుస్తారు. దాని పూర్తి ఉత్సవముగా జరుపుకుని, ఫలితాలను నిర్ధారించేందుకు మీరు సహాయము చేయాలి. ఉత్తేజ పరిచే చక్రాన్ని మీరు ఈ వెబ్‌సైట్లో మరికొన్ని సార్లు ఎదుర్కొంటారు. రెండవ అంచనా ప్రక్రియని మళ్లీ ఆది నుంచి మొదలుపెడుతుంది. అందుకే మనము దీన్ని చక్రం అంటాము. రెండవసారి వాళ్ళు మరింత శక్తివంతులుగా, ఇంతక ముందుకన్నా ఎక్కువగా శ్వశక్తి మీద ఆధారపడే వాళ్ళుగా ఉంటారు, మరియు మీరు నెమ్మదిగా ఉపసంహరించుకుంటున్నప్పుడు ఆ చక్రాన్నినిలబెట్టడానికి స్థానిక ఉత్తేజ పరిచే నాయకులను మీరు గుర్తించచ్చు. తగిన రీతిలో మీరు చక్రాన్ని మళ్లీ అమలు చేయచ్చు. మీరు సమాజాన్ని చర్య తీసుకోవడానికి తయ్యారు చేసినప్పుడు, చక్రము ఉపక్రమించడానికి తయ్యారు చేస్తారు. ––»«––ఉత్తేజ పరిచే చక్రము: © ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ భర్ట్లె
––»«–– |
హొమ్ పేజి |
మొదలు పెట్టడం |