మొదటి పెజి
 PAR/PRA




అనువాదములు:

'العربية / al-ʿarabīyah
Bahasa Indonesia
বাংলা / Baṅla
Català
中文 / Zhōngwén
Deutsch
English
Español
Filipino/Tagalog
Français
Ελληνικά / Elliniká
हिन्दी / hindī
Italiano
بهاس ملايو / Bahasa Melayu
Polszczyzna
Português
Română
Telugu
Tiếng Việt

                                        

మిగితా పాజీలు

విభాగాలు

స్థల పటములు

ముఖ్యమైన పదాలు

సంప్రదించ వలసిన చిరునామా

అవసరమైన పత్రాలు

అవసరమైన అనుసందానములు

వెలకట్టుటలో పాల్గొనటం వలన కలిగే లాభాలు

రచన దోరీన్ బోయ్ద్

సంపాదకులు ఫిల్ భర్ట్లె, పీ హెచ్ డీ

అనువాదకులు: నిరుపమ ప్రతాప రెడ్డి


కొన్ని ఉపయోగాలు:

ఈ అభ్యాసము ప్రజలకు సంఘము గురించి తెలిసిన సంగతుల గురించి తనికీ చేస్తుంది లేదా తప్పుడు సమాచారమును మార్చడము మరియు ప్రస్తుత స్థితులకు ప్రయోగాధారం జోడించి చూపిస్తే ప్రజలు ఎలా దానిని స్వీకరిస్తారు అనే అంశాన్ని విశ్లేషిస్తుంది.

ప్రజలు తమకు తాముగా సంఘము మీద పధ్ధతి ప్రకారం చేసిన అంచనా/సర్వే తోటి పాల్గొనుట మరియు కార్యముల ఉద్ధరణమునకు ఎంతో ముఖ్యమైన ఉత్తేజ పరచటము అను ప్రక్రియ మొదలవుతుంది. ప్రజలు ఈ ప్రక్రియలో పాల్గొని అన్ని అంశాలను పరిశీలించడం మూలంగా వారు వున్న స్తితిగతుల మీద వారికి ఒక అవగాహన అన్నది ఏర్పడుతుంది. దీని మూలంగా వారు తమని తాము ఎలా అభివృద్ధి లోకి తెచ్చుకోవాలి అన్న అంశాలను నేర్చుకుంటారు. ఇలా నేర్చుకోవడం వల్ల తమకి అనుకూలముగా ఎలా వాదించుకొని మరియు అధికారములో వున్న వారితో చర్చించి తమ పరిస్తితులను ఎలా మెరుగు పరచుకోవాలి అని ప్రజలు అర్ధం చేసుకుంటారు. ఇలా చెయ్యడం మూలాన ప్రజలు ఎవరి గురించి వారు ఆలోచించడం మానేసి వారి సంఘం మొత్తం గురించి ఆలోచించడం మొదలు పెడతారు.

ఇతర విధానాలతో సంఘము యొక్క అవసరములు మరియు దానికి కావలసిన ఆస్తులు ఏమిటి అని తెలుసుకోవడానికి అదే అతి పెద్ద సమస్య (నా వరకైతే అది సమస్య గానే వుండేది). మనుషులు సహజముగా వ్యక్తిగతముగా ఆలోచించే స్వభావము కలిగి వుంటారు, అంటే వారి నిర్ణయాలు వారి సొంత ఆలోచనా విధానాల మీద ఆధారపడి వుంటాయి. అంటే అది పూర్తిగా తప్పు అని కాదు, కాని అది కొన్ని సార్లు పరిశీలించి కనుగొన్న విషయాలను వక్రీకరిస్తుంది, మరియు ప్రజలను కూడా వారి సొంత అవసరాలు తీరక పోయేటప్పటికి నిరాశకు లోను చేస్తుంది. దీని మూలముగా వారు ఈ కార్యక్రమము నుంచి తప్పుకునే అవకాశము వుంటుంది.

ఈ అభ్యాసము యొక్క నివేదిక/రిపోర్ట్ వలన ఒక దస్తావేజు వస్తుంది. దానిని జాతీయ పేదరికము అంచనాల వలె ఎక్కడైనా వాడుకోవచ్చు. అంటే సర్వే కనుగొన్న అంశాల ఆధారముగా సమాజములో వున్న పరిస్తితుల బట్టి ఒక కార్య పథకము మరియు బీదరికాన్ని నిర్మూలించడానికి యుక్తి రచించు కోవడానికి, పరిపాలన పరమైన మార్పులు ఎందుకు చేసుకోవాలి అని ఉదాహరించడానికి మరియు పైన నిర్ణయాలు తీసుకోబడే చోట ఎలా జోక్యం చేసుకొని ప్రజలు తమకు ప్రభావము చూపే అంశముల మీద తీసుకునే నిర్ణయాలలో పాలుపంచుకోవడం మరియు చివరగా అవసరమైన చోట జోక్యం చేసుకోవడానికి కావలసిన వనరులు ఎందుకు తరలించాలి అని నిర్ణయించడానికి ఉపయోగపడుతుంది.

ఇవీ నాకు కలిగిన కొన్ని ఆలోచనలు. ప్రపంచములో ఎన్నో చోట్ల నాకు కలిగిన అనుభవములు మరియు పిఎఆర్ పద్ధతిని మిగిలిన పద్ధతులతో పాటు ఉపయోగించడం అనే అనుభవం మీద అవి ఆధారపడినవి.

ఇది మాములుగా సంఘము యొక్క పటము (పటము గీయడం) అనే అభ్యాసమును అనుసరిస్తుంది. ఇది చాలా సందర్భాలలో తప్పుడు సమాచారమును లేదా అసలు ముఖ్యమైన మౌలిక సదుపాయాలు (ఉ.దా. మరుగు దొడ్లు మరియు గొట్టాలు, దుకాణాలు) ఎక్కడ వున్నాయి అంటే సరిహద్దులు లాంటి విషయాల సమాచారము తెలియక పోవడం వెలికి తీయడము, వంటి అంశాలను పరిశీలించే ప్రక్రియకు నాంది పలుకుతుంది. ఇది సహజముగా 'తప్పకుండా దొరుకుతుంది' అనే పరిస్తితికి తీసుకువెళ్తుంది మరియు అక్కడి నుంచి సంఘము గురించి సర్వే/అభ్యాసము అనే అంశమునకు తీసుకు వెళ్తుంది.

సంఘములోని సభ్యులు ఈ అభ్యాసము చేయడానికి నిరాకరించడము లేదా వారికి శిక్షణ ఇచ్చిన తరువాత వారు చేయలేక పోవడము వంటి సంఘటనలు నాకు ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఎదురు కాలేదు.

ఇంకా కొన్ని ఆలోచనలు:

ఈ పద్ధతిని సులభతరము చేసే వారికి (సమన్వయకర్తలకు) నొక్కి చెప్పేదేంటంటే, బీదరికములో బతుకుతున్నా సామాన్య ప్రజలలో కూడా అసామాన్యమైన ప్రతిభా పాటవాలు వుంటాయి అన్న విషయాన్ని మీరు గుర్తించాలి. వేరే విధముగా చెప్పాలి అంటే బీదరికము అన్నది వారి స్తితిగతులకు సంబందించినదే గాని వారి ఆలోచనలు, వారి ఆశయాలు మరియు వారి కలలకు, లేదా వారి ఆలోచనలను ఆచరణలో పెట్టే శక్తితో గాని, కలలను సాకారం చేసుకోవడం అనే అంశముతో గాని మరియు ఆశయాలను నిలబెట్టుకోవడంతో గాని సంబందించినది కాదు.

మీకు ప్రజల యొక్క సామర్ధ్యం మీద మరియు సులభము చేస్తున్న ప్రక్రియ మీద నమ్మకం వుంటే వారికి కూడా వుంటుంది.

చాలా మంది వ్రుత్తి పరంగా పని చేస్తున్నవారు సంఘములోని వారు ఏవైతే అంశాలు వారి జీవితాలను ప్రభావితం చేస్తాయో వాటి మీద నిర్ణయాలు వారే (ప్రజలు) తీసుకోవాలి అన్న సూత్రాన్ని అర్ధం చేసుకోరు. ముఖ్యముగా వారు ప్రజలకు ఆ నిర్ణయం తీసుకునే శక్తి సామర్థ్యాలు వున్నాయి అని నమ్మరు. వారు ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుంది అని భావిస్తారో ఆ అంశాలనే పోగుచేసి క్రోడీకరించి తామే పరిశిలించి చివరికి ప్రజలకు ఆలోచన చేసే శక్తి లేదని భావిస్తారు.

పైన చెప్పినవన్నీ ఈ పనిని సులభము చేయువారికి (సమన్వయకర్తలకు) వారు చేసే అన్ని పనులతోను దీనిని పోల్చి చూసుకుంటే ఈ పని పై పైన మెరుగులు దిద్దడం వంటిదే అనిపిస్తుంది, కాని ఇది పిఎఆర్ పద్ధతిలో చాలా ముఖ్యమైన అంశము. ఎందుకంటే 'పరిశీలన' అన్నది అందరు ఏదో బాగా శిక్షణ తీసుకుని ఎంతో నైపుణ్యము కలిగిన వారు మాత్రమే చేయవలసిన పని అని చదువురాని నిరక్షరాస్యులుకు అది చేతకాదు అని భావిస్తారు. అందుకనే ఈ నిరక్షరాస్యులు చాలా వరకు 'పరిశీలకులగా' కాకుండా 'పరిసీలించబడిన' వారిగా ఉండిపోతారు.

దోరీన్ బోయ్ద్, UNDP బార్బడోస్
––»«––

© ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ భర్ట్లె
వెబ్ రూపకర్త లోర్డస్ సడా
––»«––
చివరగా మార్చబడిన తేది: 2011.12.18

 హోం పేజి

 వెల నిశ్చయిన్చుటలో పాల్గొనుట