Tweet అనువాదములు:
'العربية / al-ʿarabīyah |
పటము మరియు సామగ్రి పట్టిక పట్టిక/జాబితాసంఘము యొక్క వెల నిశ్చయించడములో పాల్గొనటంరచన ఫిల్ బార్ట్లే, పిహెచ్డిఅనువాదకలు పి. నిరుపమ ప్రతాప రెడ్డిసంఘములోని సభ్యులకు అందించ వలసిన కరపత్రమువెల నిశ్చయించు ప్రక్రియలో పాల్గొను సంఘములోని సభ్యులకు పత్రముపటము మరియు సామగ్రి పట్టిక: మీరు మరియు మీ తోటి సంఘములోని ఇతర సభ్యులు సంఘమునకు కావలసిన విధముగా దానిని అభివృద్ధి చేసే ముందర ఒక సామగ్రి పట్టికను తయారు చేసుకోవడం ముఖ్యము, సంఘము యొక్క వనరులు మరియు అప్పులు తెలుసుకోవాలి మరియు సమాజము యొక్క అవసరములు తెలుసుకోవాలి. మొదట పనిగా మొదలు పెట్టడానికి పటము తయారి ఒక మంచి పని. దానికి అనుసంధానించబడిన తరువాత పని, సంఘము యొక్క ఒక సమగ్ర సామగ్రి జాబితా/పట్టిక తయారు చేయడము. సంఘములోని అందరు కలిసి పటము మరియు సామగ్రి పట్టిక తయారిలో పాల్గొనడం ముఖ్యము; ఆ ప్రాంతములోని నాయకులు మరియు అధికారులే కాకుండా, చదువుకున్న ప్రజలు మాత్రమే కాకుండా, మగవారు మాత్రమే కాకుండా, ఒక జాతి లేదా ఒక సామాజిక వర్గము లేదా ఒక మతములోని వారే కాకుండా అందరు పాల్గొనే విధముగా చూసుకోవాలి. మీ సంఘము యొక్క సమన్వయకర్త లేదా మీకు ఆ పని సులభముగా అర్ధం అయేటట్టు చేసేవారు మిమ్మల్ని చుట్టుప్రక్కల ప్రదేశాలు మరియు గ్రామములో త్రిప్పి మీరు ఒక పటము మరియు ఒక జాబితా తాయారు చేయటానికి ఒక సామజిక సమావేశం ఏర్పాటు చేయడానికి సహాయపడతారు. ఆ సమన్వయకర్త ఈ పనిని ఒక సామాజిక యత్నం కింద చేయటానికి మీ సహాయము ఎంతో ముఖ్యము. అయితే ఏమి చేయాలి? దీనిని విజయవంతము చేయడానికి ఏమి కావాలి? ఆ పటము తయారు చేసేటప్పుడు సమయానికి హాజరవ్వండి మరియు సంఘములోని ఇతర సభ్యులు హాజరు అయ్యేలా వారిని ఉత్తేజపరచండి. ఇతర సభ్యులతో కలిసి నడవండి. సంఘము యొక్క ఆస్తులను చూపించండి అంటే మరుగుదొడ్లు ఏవైతే శుభ్రముగా ఉన్నాయో మరియు వేటినైతే వాడుతున్నారో, మంచి నీటి పుంపులు ఎక్కడైతే స్వచ్చమైన మంచి నీరు వస్తుందో (నీరు పక్కలకు పోయి బురదమయంగా లేనివి), పాటశాలలు ఏవైతే శుభ్రముగా, పొడిగా, మంచి వెలుతురు వుండి మరియు బాగా ఉపయోగించబదుతున్నాయో, క్రీడా మైదానాలు ఏవైతే శుభ్రముగా మరియు ఆహ్లాదకరముగా ఉన్నాయో, మంచి రహదారులు వేటిలో అయితే భయానకమైన గుంటలులేవో, శుభ్రముగా ఉన్న బజారులు మరియు ఏవైతే ఆస్తులు మీరు చూపించగలతారో వాటిని చూపించండి. వీటితో పాటు ఇతర ఆస్తులను కూడా ఏవైతే శిదిలావస్తలో వున్నాయో, వేటినైతే బాగు చేయాలో, వేటినైతే విస్తరించాలో లేదా వేటినైతే మార్చాలో వాటిని చూపించండి మరియు అవి పటములో భద్రముగా పొందుపరచండి. ఈ అవధిలో మీ ముఖ్యమైన లక్ష్యము ఏమిటంటే పటము యొక్క ఖచ్చితత్వము మరియు పూర్తిగా వుందా లేదా అని చూసుకోవడము. మీ సంఘము యొక్క సామగ్రి పట్టిక/జాబితా తయారీలో కూడా మీరు పడవలసిన శ్రమ పైన చెప్పిన పద్ధతిలోనే వుంటుంది. సమావేశములో పాల్గొనండి మరియు సంఘములోని ఇతర సభ్యులు కూడా పాల్గొనేలా ఉత్తేజ పరచండి. సమన్వయకర్తలతో మరియు ఈ పనిని సులభతరము చేసే వారికి సహకరించండి. కావలసిన అవసరాలు మరియు వనరుల యొక్క జాబితా తయారు చేసుకోండి. సంఘములోని ఇతర సభ్యులతో విభేదించవద్దు మరియు వారితో గొడవ పడవద్దు. మీ అభిప్రాయాలు అందరూ వినేలా చూసుకోండి మరియు మీ కృషిని అందరూ గుర్తించి అవి భద్రముగా పత్రములో పొందు పరచబడేలా చూసుకోండి, మరియు సంఘములోని ఇతర సభ్యుల యొక్క అభిప్రాయాలు కూడా అందరూ విని వాటిని జాగ్రత్తగా పత్రములో పొందుపరిచే విధముగా చూసుకోండి. ముఖ్యముగా ఎవరైతే సభ్యులు వివిధ కారణాల మూలాన ఎక్కువగా మాట్లాడరో లేక ఎవరైతే వారి అభిప్రాయాలు గట్టిగా చెప్ప లేకపోతరో వారిని ఉత్తెజపరచండి. వారి అభిప్రాయాలు అందరూ వినేలా చూసుకోండి. మొత్తము సంఘము యొక్క గళము: “అభివృద్ధి సాధించడానికి సంఘమునకు కావలసినది ఏమిటి?” అని తెలుసుకోవడానికి ఇదే సరి అయిన సమయము. ఒక వ్యక్తిగా నీ అవసరములు ఏమిటి అని వొత్తిడి చేయడానికి ఇది సరి అయిన సమయము కాదు. అలాగే నీ స్నేహితుల మరియు నీ బంధువుల మరియు నీ సహోద్యోగుల అవసరముల గురించి వొత్తిడి చేసే సమయము కూడా కాదు. ఇది సమాజములోని అందరూ కలిసి సమాజ శ్రేయస్సు కొరకు పని చేసే సమయము. మీరు చదవగలిగిన వారైతే కనక (మీరు ఈ పత్రము చదువుతూ వుంటే గనక మీరు తప్పకుండా చదవగలిగిన వారే) మీరు సమాజము యొక్క అవసరములను చదువుకున్న సభ్యుల కళ్ళ ద్వారానే చూడవద్దు. చదవడము రాయడము రాని వారికి ఈ సమాజము ఎలా కనపడుతుందో మీరు ఊహించుకొండి. ఒక వేళ మీకు చదవడం గనక రాకపోతే (ఈ పత్రము మీకు ఎవరన్నా చదివి విన్పిస్తుంటే) అక్షరాస్యత అన్నది సమాజానికి ఎంతో ముఖ్యము అన్న సత్యమును గ్రహించండి. ఈ సందర్భాన్ని మీ మతమునకు సంబందించిన వారి కోసమో లేదా మీ భాష మాట్లాడే వారి కోసమో లేదా మీ కుటుంబం లేదా మీ తెగ కోసమో లేక మీ సామాజిక వర్గం కోసమో లేదా మీ తోటి పనివారికోసమో లేదా మీ స్నేహితుల కోసమో ఉపయోగించుకోవద్దు. దీనిని మొత్తం సమాజము యొక్క బాగు కోసం ఉపయోగించుకోండి. ఈ వెల నిశ్చయించుట అను పధ్ధతి ద్వారా ఆశించే ఫలితము: ఈ పటము మరియు సంఘము యొక్క సామగ్రి పట్టిక/జాబితా తయారు లాంటి పనులు పూర్తి అయిన తరువాత, వాటి ద్వారా రావలసిన ఫలితము ఏమిటి; ఏమి ఫలితము రావలసింది? పటము పూర్తిగా మరియు ఖచ్చితముగా వుండాలి, అందులో సంఘములో ఉన్న అన్నింటి (ఆస్తులు వగైరా) గురించి వుండాలి, వాటిలో ఉన్న మంచి మరియు చెడు అంశముల గురించి సూచించబడాలి. సామగ్రి పట్టిక/జాబితా పూర్తిగా మరియు ఖచ్చితత్వము కలిగి వుండాలి, అందులో సమాజము అభివృద్ధిలోకి రావడానికి అందుబాటులో ఉన్న అన్ని సదుపాయాల (ఆస్తులు వగైరా) గురించి, వనరులు మరియు అడ్డంకులు (ఉన్నవి మరియు రాగలవి), అన్ని అవసరములు మరియు అవకాశములు గురించి స్పష్టముగా వుండాలి. పటము మరియు సామగ్రి పట్టిక/జాబితా సమాజము యొక్క పూర్తి సహకారమును మరియు సంఘములోని అందరి సభ్యుల యొక్క అభిప్రాయాలను ప్రతిబింబిస్తుంది. అది కొందరు ఎన్నుకోబడినవారి లేదా కొన్ని వర్గాల లేక కొంతమంది బాగా గట్టిగా మాట్లాడ గలిగిన వారి అభిప్రాయాలూ మాత్రమే కాదు – అందరి సభ్యుల అభిప్రాయములు. ––»«––సంఘము యొక్క పటము తయారు చేయడము: © ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ భర్ట్లె
––»«–– |
హోం పేజి |
వెల నిశ్చయిన్చుటలో పాల్గొనుట |