Tweet అనువాదములు:
'العربية / al-ʿarabīyah |
కార్య నిర్వహణ అధికారి నియామకం (CIC)సంఘాన్ని అమలుపరచు కమిటి యొక్క ఏర్పాటుఫిల్ బార్ట్లే, PhD చేఅనువదించినది రాజేష్ కాల్వశిక్షణ కరపత్రంసరైన చర్య కోసం సంఘాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి?సరైన చర్య కోసం సంఘాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి? స్వయం సహాయార్ధం సంఘాన్ని తయారు చేయుటకు ముందు కావాల్సింది సంఘ కార్య నిర్వహణ కమిటిని ఏర్పాటు చేయటం. ఆ కమిటి సభ్యులను సంఘం నియమించాలి మరియు సంఘ సభ్యులు కమిటి సభ్యులుగా నమ్మకస్తులను, బాధ్యతలను సక్రమంగా నిర్వహించ గలవారిని ఎలా ఎంచుకోవాలో నేర్చుకోవాలి. మీరు సంఘ సభ్యులకు ఆ ఎంపికలో తోడ్పాటు అందించాలే తప్ప మీరు ఎంపిక చేయకూడదు. కార్య నిర్వహణ అధికారి సంఘం మొత్తం చేత నియమించ బడాలి గానీ కొంత మందిచే కాకూడదు.(అందుకే ఐక్యత తో ఏర్పాటు అనేది ముఖ్యం. ఐక్యత తో ఏర్పాటు చూడండి. కార్య నిర్వహణ అధికారి సంఘం లో భాగమై ఉండాలి మరియు సంఘం కోసం బాధ్యతతో పని చేయాలి . సమన్వయకర్త గా మీరు దీన్ని కలిగి ఉన్న వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా సంఘ సభ్యులకు బాగా అర్ధమగునట్లు వివరించాలి. దిన్ని మీరు వివిధ చోట్ల ,వివిధ జన సమూహాలలో వివిధ సందర్భాలలో మరల మరల వివరించడం మంచిది. అలాగే ఈ దశలో మీరు నెలకొని ఉన్న అపోహలను దూరం చేయాలి. కోశాధికారి నియామకం కూడా అపోహలతోనే మొదలవుతుంది. చాలా మంది ముఖ్యంగా పల్లెలలో ఉండే సంఘ సభ్యులు నిరక్షరాస్యులు. అందు వలన మీరు సంఘంలో చదువుకున్న వారిని కోశాదికారి గా నియమించాలి అని అనుకుంటారు. ఆ కోశాదికారి స్కూల్ టీచరు కావచ్చు. ఐతే మా అనుభవం లో గమనించింది ఏంటి అంటే ఒక్కో సారి స్కూలు టీచరు వేరే జిల్లా నుండి ఉండొచ్చు.తక్కువ జీతం కలిగి సంఘంతో సంభంధం లేకుండా లేక సంఘంతో నమ్మకంగా ఉండక పోవడం, సంఘము వారికి అప్పగించిన వనరులను తీసుకౌని సంఘం నుంచి తప్పించుకొని తిరగటం మొదలగునవి. అసలు కోశాదికారి ఎందుకు చదవు కోవాలి. ఇది ఒక ఊహ . లెక్కలు వేయటానికి ఎవరైనా బాగా వ్రాయవలసిన లేక చదవవలసిన అవసరం లేదు. సంఘంలో బాగా పట్టున్న ఒక ముసలమ్మ లేదా ఒక అమ్మమ్మ లేదా నానమ్మ ని కోశాదికారి గా ఎంపిక చేస్తే బావుంటుంది. ఆవిడ నిరక్షరాస్యురాలైనా పర్వాలేదు. అందువలన ఆవిడ తన ఇంటి ప్రక్కనే ఉండే స్కూలు కెళ్ళే వాళ్ళను మరియు చుట్టాలను తీసుకు వచ్చి జమ ఖర్చుల వివరాలను పొందుపరుస్తుంది.ఆ వివరాలు పారదర్శకంగా ఉంటాయి ఎందుకంటే ప్రతి ఖర్చు వివరించబడి మరియు చర్చించబడుతుంది.కోశాదికారి పని అంటే డబ్బులను బాధ్యతతో సక్రమంగా వినియోగించాలే గాని ఊరికే జమ ఖర్చులను మాములుగా పుస్తకాలలో పొందుపరిచేలా ఉండకూడదు. మీ పని ఏంటి అంటే సంఘం మొత్తం కార్య నిర్వహణ అధికారి ని ఎంపిక చేసుకొనేలా తోడ్పాటు అందించటం. ఐక్యత తో ఏర్పాటు చూడండి .కార్య నిర్వహణ అధికారి ఎంపిక పారదర్శకంగా మరియు ప్రజాస్వామ్య పద్ధతి గా ఉండాలి. (ఈ రెండు ముఖ్య పాదాలను చూడండి: పారదర్శకం మరియు ప్రజాస్వామ్యం ). ఈ పద్ధతి సాంప్రదాయబద్దంగా సరైనది గా మరియు సంఘ సభ్యులకు ఆమోద యోగ్యంగా ఉండాలి.(అందుకే మీరు సంఘ గుణ గణాలు కావలసినవి నేర్చుకోవాలని మొదటి భాగంలో వివరించబడింది). ––»«––సంఘ కూడిక ; ఫ్రాదాన్యతలు స్థాపించటము. © ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ బార్ట్లే
––»«–– |
మొదటి పేజీకి |
ఏర్పాటు చెయ్యటం |