Tweet అనువాదములు:
'العربية / al-ʿarabīyah |
మీ లక్ష్య సమాజమును తెలుసు కొనండిమీ కార్యములు వలన ఎవరు లాభము పొందుతారు?రచన: ఫిల్ భర్ట్లె, పీ హెచ్ డీఅనువాదకులు: సరస్వతి కాజశిక్షణ కరపత్రంసాంఘిక పరిశోధకులు మరియు పరిశీలించి విశ్లేషించు వాళ్ళుగా ఉంటూ; మంచి కుమ్మరికి బంకమన్ను యెక్క స్వభావము తెలియాలిఇంకొక సామెత మనము సమాజ అభివృద్దిలో వాడేది, "కుమ్మరికి తను వాడే బంకమన్ను గురించి తెలియాలి." మీకు మీ సమాజమే మీ బంకమన్ను. దానిని మీరు పోత బోసి, అభివృద్ది చేసి ఏదో ఒక విధముగా శక్తి వంతము చేయాలి. అది చేయటానికి మీకు ఆ సమాజము గురించి బాగా తెలియాలి. (మరియు సమాజముల స్వభావము). మీరు సాధ్యమైనంత వరకు సమాజము యెక్క సాంఘిక వ్యవస్థాపన, ఆర్ధక వ్యవస్థ, భాషలు, పఠము (చిత్ర పఠము), చిక్కు సమస్యలు, రాజకీయాలు, మరియు జీవావరణ శాస్త్రము విషయాల గురించి వీలైనంత తెలుసు కొనవలయను. మీ పరిశోధన కేవలము సంబంధము లేని వాస్తవమై విషయాల జాబితా సంపాదించటము కాకూడదు; మీరు వాటిని పరిశీలించి విశ్లేషించి సమాజ స్వభావము ఒక సాంఘిక పద్ధతిగా అర్ధము చేసుకొన వలెను. (సమాజము అంటే ఏమిటి ? మరియు సాంఘిక పరిశోధన) చూడండి . అనేక విధములైన ఈ విషయాలకు మధ్య సంబంధము గురించి ఆలోచించండి. మంచి ప్రారంభము చేయట ఒక పఠము తయారు చేయట. ప్రజలు ఎక్కడ నివసిస్తారు? సమాజములో ఏ వనరులు, సదుపాయములు ఉన్నవి? (ఉదాహరణకు రహదారులు, బాటలు, నీటి సరఫరా, వైద్యశాల, బడి, ఆరోగ్య రక్షణము, బజారు మరియు ఇతర సామాజిక వనరులు మరియు సేవలు). తరువాత మీరు సమాజ సభ్యులకు సమాజ స్థితి (వనరులు, అవసరాలు, అవకాశములు, సమస్యలు) అంచనా వేయిస్తునప్పుడు; మీరు వాళ్ళకు సమాజ చిత్ర పఠము తయారు చేయుటలో మార్గము చూపుతారు. అదే మీరు ఇప్పుడు మీ కోసము చేస్తే, తరువాత వాళ్ళతో కలిసి చేసే కార్యములో సహాయ పడుతుంది. మీ నోట్సు దినచర్య పుస్తకములో వ్రాయండి. సమాజ వ్యవస్థ, ఆర్ధక వ్యవస్థ, భాష(లు), రాజకీయాలు, మానవత్వపు విలువలు, సాంప్రదాయములు మరియు వాటి పకృతి పరిసరములకు(జీవావరణ శాస్త్రము) సంబంధము గల విషయములను గమనించండి. అనేక విధములైన ఈ విషయములు మధ్య ఎలాంటి సంబంధము కలదో పరిశీలించి విశ్లేషించటము కొనసాగించండి. ––»«––© ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ భర్ట్లె
––»«–– |
మూల పేజి |
సిద్ధము కావటము |