మొదటి పెజి
 PAR/PRA




అనువాదములు

'العربية / al-ʿarabīyah
Bahasa Indonesia
বাংলা / Baṅla
Català
中文 / Zhōngwén
Deutsch
English
Español
Filipino/Tagalog
Français
Ελληνικά / Elliniká
हिन्दी / hindī
Italiano
بهاس ملايو / Bahasa Melayu
Polszczyzna
Português
Română
Telugu
Tiếng Việt

                                        

మిగితా పాజీలు

విభాగాలు

స్థల పటములు

ముఖ్యమైన పదాలు

సంప్రదించ వలసిన చిరునామా

అవసరమైన పత్రాలు

అవసరమైన అనుసందానములు

సమాజమును శక్తివంతము చేయడానికి పాల్గొనుట అనే అంశము చాల ముఖ్యమైనది

రచన బెన్ ఫ్లెమింగ్

సంపాదకులు ఫిల్ భర్ట్లె, పీ హెచ్ డీ

అనువాదకులు: నిరుపమ ప్రతాప రెడ్డి


ఈ సమాజమును శక్తి వంతము చేయడం కోసం పాల్గొనడం ఒక్కటే సరిపోదు. దానికి సరియైన పరిస్థితులు కల్పించాలి. ఎప్పుడైతే ప్రజల ఆశయాలు మరియు వారి నైపుణ్యాలు గుర్తించేలా పరిస్తుతులను కలిపించ బడతాయో అప్పుడే అక్కడ సమాజము శక్తివంతముగా తయారవుతుంది. ఇది సాధించడానికి కొన్ని పద్ధతులు:

  • మనుషులను ఎప్పుడూ తక్కువ అంచనా వెయ్యవద్దు. ఏదైనా క్లిష్టమైన అంశము వచ్చినప్పుడు దానిని ఎదుర్కొనడానికి సరైన పని ముట్టులను వారికి ఇవ్వండి అంతేగాని ఆ కష్టం వారికి తెలియకుండా చెయ్యవద్దు.
  • పెద్ద అంశాలను అందరూ అర్ధం చేసుకునే విధంగా సులభముగా అర్ధం అయ్యేటంత చిన్న చిన్న అంశాలుగా విడగొట్టండి.
  • మొదలు పెట్టేటప్పుడు ప్రజలకు సంబంధించిన అంశాలు మరియు ఆందోళనలతోనే మొదలు పెట్టండి.
  • ఆరంభంలోనే మీ యొక్క ఉద్దేశ్యాలనుగాని లేదా ఆలోచనలను మరియు మీ పరిష్కారాలను వారి మీద రుద్దకండి.
  • ప్రజలకు ఉన్నటువంటి వివిధ ఎంపికలు ప్రజలు తెలుసుకునేలా వారికి సాయం చెయ్యండి మరియు ప్రతి ఎంపిక యెక్క మంచి చెడులను విశ్లేషించి చెప్పండి.
  • ఇందులో పాల్గొన్న వాళ్ళ విశ్వాసం పెరగటం కోసం మొదట్లోనే కొన్నివిజయాలు కలిగేలా చూడండి.
  • నైపుణ్యములు, నమ్మకుము మరియు అంకిత భావమును ఈ పద్ధతికి నిచ్చెన లాగా వాడుకోండి. ప్రజలకు ముందుకు సాగటంలో పాల్గొనే అంశాలను నిచ్చెనలోని మెట్ల వలె భాగించండి. వారిని ఆ నిచ్చెనని ఎక్కడానికి సహాయ పడండి
  • పాల్గొన్న వారికి వెంటనే లేక సూటిగా సమాజమును శక్తివంతము చెయ్యడం కోసం శిక్షణను ఇచ్చేయ్యకండి. అది అందరికి నచ్చదు. వారిని మెల్లగా ఈ ప్రక్రియలో భాగంగా వివిధ నైపుణ్యాలను నేర్చుకునేలా చెయ్యండి.
  • కుదిరితే కనుక వెనక్కి వెళ్ళలేనటువంటి పరిష్కారములను సూచించ వద్దు. చిన్న చిన్న ప్రయోగాలు ఏవైతే వెంటనే జరుగుతాయో, వెనక్కి వెళ్ళగలిగే వాటిని ఎంచుకుని వాటితో ప్రజలకు పునరావృతము అవగల నేర్చుకునే ప్రక్రియ రూపొందించండి.
  • సభ్యత్వ నమోదును ఎప్పటికప్పుడు కనిపెట్టుకుని ఉండి దానిని పెంపొందించుకోవడానికి కృషి చెయ్యండి. కొత్త కొత్త విషయాలపై ఆసక్తి వున్న సమూహాలు ఏర్పడినప్పుడు వారిని ఈ పధ్ధతిలోకి ఎలా కలపాలి అన్నదాని గురించి ఆలోచించండి.
  • ఈ పాల్గొనుట అను ప్రక్రియకు బయట జరుగునటువంటి ఇతర క్లిష్టమైన నిర్ణయ ప్రక్రియలు ఏవైతే ఫలితమును ప్రభావితము చేస్తున్నాయో వాటిని ప్రజలు అర్ధం చేసుకోవడానికి సహాయపడండి.
  • కొత్త కొత్త స్నేహాలను మరియు బంధాలను పెంపొందించండి
  • పధకము అర్ధవంతముగా మరియు ఏదైనా ఫలితము వచ్చే విదముగా వుండేటట్టు చూసుకోండి.
  • వివిధ అంశముల మీద ఏర్పడ్డ సముహముల యొక్క పనిని పూర్తి చేయగల సామర్ధ్యమును, సమాజము యొక్క బాధ్యతను, మరియు పని యొక్క ఆచరణను నియంత్రించడమును సరిగ్గా సమన్వయ పరచండి.
  • ఫలితమును విశ్లేషించుకోవడానికి తగునటువంటి అవకాశములను కలిగించండి
  • ప్రజలకు ఇది నచ్చే విధముగా చూసుకోండి («ది గైడ్ టు ఎఫ్ఫెక్టివ్ పార్టిసిపేషన్» రచన డేవిడ్ విల్కొక్ష్, అనే పుస్తకం నుండి )

ఈ పాల్గొనుట అను ప్రక్రియ గురించి పది సూత్రాలు

1. ఎంత వరకు పాల్గొనాలి

షెర్రీ అరణ్ స్టెయిన్ (1969) ఈ పాల్గొనుట అను ప్రక్రియను ఎనిమిది మెట్లు వున్న ఒక నిచ్చెనగా వర్ణించారు. సంక్షిప్తముగా అవి ఏమిటంటే: 1 మార్చటం మరియు 2 చికిత్స. పాల్గొనకపోవుట. మన లక్ష్యము ఏమిటంటే పాల్గొన్న వారికి చికిత్స చెయ్యటము లేదా వారికి తెలియనిది వారికి బోధించడము. దీనికి ప్రతిపాదించిన పధకము సరియైనది మరియు పాల్గొనుట అనే పని యొక్క ఉద్దేశ్యము ప్రజా సంబంధాలతో ప్రజల యొక్క విశ్వాసము గెలుచుకోవటము. 3 తెలియచేయటము. న్యాయముగా పాల్గోవటం అనే అంశమునకు ఇది ముఖ్యమైన మొదటి అడుగు. కాని సమాచారము ఒక దిక్కునకు వెళ్ళుట మీదే తరచుగా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. చేసిన పని యొక్క యోగ్యత మీద సమాచారము వెనకకి రాదు. 4 సంప్రదించుట. వైఖరి మీద సర్వేలు, మన చుట్టుప్రక్కల సమావేశాలు, మరియు ప్రజా విచారణలు. కాని దీనిని ప్రహసనముగా మాత్రం చెయ్యవద్దు. 5 శాంతింప చేయటం. ఇతర సభ్యుల అనుమతితో కొంత మంది బాగా పనికివచ్చే వారిని సమితిలోకి చేర్చుకోండి. 6 భాగస్వామ్యము. ప్రజలతోను మరియు అధికారము కలిగిన వారితోను సంప్రదించి అధికారమును తిరిగి సరిగ్గా పంచండి. ప్రణాళిక రచించడమును మరియు నిర్ణయము చేసే భాద్యతలు అందరూ పంచుకోండి. 7 అధికారము బదలాయించడం. సమితీలలో ప్రజలకు అధికముగా సంఖ్యా బలము వుండాలి మరియు వారికి నిర్ణయించగలిగే అధికారము వారికి బదలాయించబడి వుండాలి. ప్రజలకు అప్పుడు ఆ అంశము యొక్క విజయము మీద భాద్యత వుంటుంది. 8 ప్రజా నియంత్రణ. అట్టడుగు వర్గాల వారు ప్రణాళిక రచించడం, విధానము నిర్ణయించడం, మరియు ఒక పథకం నిర్వహించడం అనే అంశాలను వారే స్వయంగా నిర్వహించేలా చూడండి.

2. ప్రారంభించుట మరియు ప్రక్రియ

పాల్గొనటం అనేది వూరికే జరగదు, దానిని ప్రారంభించాలి. రాబోయే కాలంలో ఎవరో ఒకరు దానిని నిర్వహిస్తారు మరియు వారు కొంత మంది ఇతరులకు ఆ అంశము మీద కొంత వరకు నియంత్రించే అధికారము ఇస్తారు. ఈ పధ్ధతిని నాలుగు భాగాలుగా విభజిస్తారు: ప్రారంభించుట - సిద్ధముచేయుట - పాల్గొనుట - కొనసాగించుట.

3. నియంత్రణ

మొదలు పెట్టేవారు ఏమి చేయాలి మరియు ఎంత నియంత్రించాలి అని నిర్ణయించే బలమైన స్థానములో వుంటారు. ఈ నిర్ణయము నిచ్చెన మీద వుండే ఒక మెట్టు లాంటిది – లేక ఎంత పాల్గొనాలి అనే విషయము మీద ఒక దృక్పధము ఏర్పరుచు కోవడము లాంటిది.

4. అధికారము మరియు లక్ష్యము

పాల్గొనటం అనే అంశాన్ని అర్ధం చేస్తుకోవాలి అంటే అధికారము అనే అంశాన్ని అర్ధం చేసుకోవాలి: వివిధ సమూహాలకు కావలసిన దానిని దక్కించు కోగలిగే సామర్థ్యం. ఎవరి దెగ్గర డబ్బు మరియు సమాచారం వుంటుంది అనే దాని బట్టి అధికారం అన్నది ఆధారిపడి వుంటుంది. అది ప్రజల నమ్మకము మరియు వారి నైపుణ్యముల మీద కూడ ఆధారపడి వుంటుంది. చాలా సంస్థలు ప్రజలు పాల్గొనటానికి అయిష్టత చూపిస్తాయి ఎందుకంటే అవి నియంత్రణ కోల్పోతమేమో అని భయపడతాయి. కాని ఎన్నో సందర్భాలలో కలిసి పని చెయ్యటం వలన ప్రజలు వారు ఒక్కరే పని చెయ్యటం వలన సాధించే దానికంటే ఎక్కువ సాధించ గల్గుతారు. ఇవి పాల్గొనటం వలన కలిగే ప్రయోజనాలు.

5. ఈ పనిని సులభతరము చేయు వారి యొక్క పాత్ర

ఈ పనిని సులభతరము చేయు వారు చాలా వరకు ఆ పనిని నియంత్రిస్తూ వుంటారు. వారు ఎలప్పుడు వారి పాత్ర గురించి ఆలోచిస్తూ వుండటం ముఖ్యము.

6. పాత్రధారులు మరియు సమాజము

దీనిలో పాత్రధారి ఎవరు అనగా జరుగునటువంటి దాని వల్ల లాభమో నష్టమో భరించు వాడు. ఎవరు జరిగే పని వల్ల ప్రభావితులు అవుతారు? ఎవరైతే కావలసిన సమాచారము మీద, నైపుణ్యము మీద మరియు డబ్బు మీద, ఎవరు సహాయము చేయవచ్చు మరియు ఎవరు అడ్డగించ వచ్చు అన్నవిషయాల పై నియంత్రణ కలిగి వుంటారో వారు ప్రభావితులు. ప్రభావితుడు అయిన ప్రతి వాడికి సమానమైన భాగము వుండదు. నిచ్చెనను బట్టి ఎవరికి ఎక్కువ పలుకుబడి వుందో అంచనా వెయ్యండి.

ఏ పనిలో ఏ సంఘము పాల్గొంటుంది అన్నది పని మీద ఆధారపడి వుంటుంది ఎందుకంటే వివిధ రకాల ప్రజలు వివిధ రకాల పనులలో ఆసక్తి కలిగి వుంటారు.

7. భాగస్వామ్యము

ఇది వివిధ రకముల ఆసక్తి కలిగి ఉన్న వారు కావాలని ఒక పధ్ధతి ప్రకారము గాని లేదా పధ్ధతి ప్రకారము లేకుండా కానీ ఒక దగ్గరకి వచ్చి అందరికీ సంబంధించిన ఒక లక్ష్యము సాధించడానికి ఉపయోగకరమైన పధ్ధతి. భాగస్వాములు నైపున్యములు, ధనము లేదా ధైర్యములో సమమైన వారు అయ్యి వుండనక్కరలేదు. కాని వారందరికి ఒకరి మీద ఒకరికి నమ్మకము వుండాలి మరియు పని పట్ల కార్య దీక్షత కలిగి వుండాలి. నమ్మకము మరియు కార్య దీక్షత అన్నవి నిర్మించడానికి సమయము పడుతుంది.

8. కార్య దీక్షత

కార్య దీక్షత అన్నది ఉదాసీనతకు రెండో వైపు: కార్య దీక్షత కలిగిన వారు ఏదో ఒకటి సాదించాలి అనుకుంటారు, ఉదాసీనులు అలా అనుకోరు. కాని కార్య దీక్షతకు కావలసింది ఏమిటి? ప్రజలకు “నువ్వు శ్రద్ధ చూపాలి” అని చెప్పడం కాని, వారిని సమావేశాలకు పిలవటం కాని, లేదా వారి మీద నిగనిగలాడే పత్రాలు కుమ్మరించడం కాని కాదు. ప్రజలకి ఏదైతే ఆశక్తి కలిగిస్తుందో మరియు ఏదైతే వారు సాధించ కలుగుతాము అనుకుంటారో దానికే వారు కట్టు బడి వుంటారు. వారికి ఇష్టం లేనిది వారికి అమ్మటానికి ప్రయత్నించడం మూలాన వుండే ఫలితం సూన్యం. ఒక వేళ ప్రజలు నీ ప్రతిపాదన పట్ల ఉదాసీన వైఖరి కలిగి వున్నారు అంటే అది బహుశా మీకు నచ్చినది వారికి నచ్చక పోవడం మొలాన కావొచ్చు లేదా నీకు అనిపించిన ఆందోళన వారికి ఆందోళనగా అనిపించి వుండక పోవచ్చు.

9. భావముల లేక ఉద్దేశము యొక్క యజమానత్వము

ప్రజలకు ఏ భావములో అయితే కొంత భాగము వుంటుందో లేదా ఏ భావము అయితే “అరె ఇది నేను అనుకున్నదేనే” అని అనిపిస్తుందో అలాంటి వాటికి కార్య దీక్షతతో పని చేస్తారు. ఆచరణలో దాని అర్ధం మేధో మధనము (అందరు కలిసి ఆలోచించు నటువంటి) సభలు జరపడము, ప్రజలకు కొన్ని భావముల యొక్క సాధ్యాల గురించి ఆలోచించడంలో సహాయ పడటం, మరియు ఇతరులతో మాట్లాడి ఏదైనా సమస్యకు చాల మందికి ఆమోద యోగ్యమైన పరిష్కారం కనుక్కోవడం. ఉదాసీనత అనేది ప్రజల యొక్క భావములు మరియు ఫలితము మీద బాగా ప్రభావము చూపే అంశము.

10. ధైర్యము మరియు సామర్థ్యము

భావములను ఆచరణలో పెట్టడానికి ప్రజల యొక్క నైపుణ్యములు మరియు ధైర్యము ముఖ్యము. చాలా మటుకు అందరు పాల్గొనే ప్రక్రియలు క్రొత్త ఆలోచనలను రేకెత్తిస్తుంది. ఎవరైనా ఒకరికి గాని లేదా చిన్న సమూహమునకు వెంటనే క్లీష్టమైన నిర్ణయములు తీసుకునే శక్తి లేదా పెద్ద పెద్ద ప్రణాళికలలో పాల్గొనే అంత శక్తి రావాలి అని అనుకోవడము అతిశయోక్తే అవుతుంది. వారికి మంచి శిక్షణ లేదా నేర్చుకునే అవకాశము గాని రావాలి. దానితో వారు ధైర్యము మరియు ఇతరుల పట్ల నమ్మకము ఏర్పరుచుకుంటారు.

“ది గైడ్ టు ఎఫ్ఫెక్టివ్ పార్టిసిపెషణ్” రచయిత డేవిడ్ విల్కొక్ష్, అనే పుస్తకము నుంచి తీసుకోబడినది: http://www.partnerships.org.uk/guide/index.htm

వెల కట్టుటలో పాల్గొనుట మరియు పరిశోధన సమన్వయకర్తలకు శిక్షణ పత్రమునకు తిరిగి వెళ్ళండి. సంఘము యజమానత్వము తెచ్చుకోవడము కూడా చూడండి


© ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ భర్ట్లె
వెబ్ రూపకర్త లోర్డస్ సడా
––»«––
చివరగా మార్చబడిన తేది: 2011.12.18

 హోం పేజి

 వెల నిశ్చయిన్చుటలో పాల్గొనుట