Tweet అనువాదములు:
'العربية / al-ʿarabīyah |
ఐకమత్యము వ్యవస్థీకరించడంమొత్తం సమాజాన్ని ఒకటిగా చేయడంబై ఫిల్ భర్ట్లె పిహెచ్‌డి,అనువాదము శంకరతేజస్వి ఉప్పులూరిశిక్షణ కరపత్రము"సహజ" ఉనికిలో ఏ సమాజంలో ఐనా చాలా సాంఘిక భేదాలు ఉంటాయి.మీరు ఏర్పాటు చేసిన సమాజ సభలకు స్త్రీలు హాజరు అయ్యేలా చూడాలి అని ఇంతక ముందు మీరు చూశారు. ( సంప్రదాయావాది ఇస్లాం సమాజాలు మినహా) వికలాంగులు, యువత, వ్రుధ్ధులు, అతి పేద వాళ్ళు, వోటు హక్కు లేని వాళ్ళు, వర్గీకరించబడిన వాళ్ళు, బిడియస్తులు మరియు వెనుక బడిన వాళ్ళు కూడా. సమాజము యొక్క ఐకమత్యము వ్యవస్థీకరణ చేయడానికి ఉన్న మీ వ్యూహం లో ఇది ఒక భాగము. ఐకమత్యము వ్యవస్థీకరణ చూడండి. ప్రతి సమాజంలో అన్ని వైపులా లాగే శక్తులు ఉంటాయి. ఇవి జాతి, కులము, మతము, వర్గము, లింగము, వయస్సు, చదువు, భౌతిక మరియు బుద్ధి తాహతు, ఉద్యోగం, అర్థ, నేల అందుబాటు (యజమాని, కౌలుదారు, కబ్జాదరు, ఇతరత్రా) మరియు మనుషులని విభజించే ఇతర గుణాల మీద ఆధారపడి ఉంటాయి. సాంఘిక భేదము చూడండి. ఒక ఉత్తేజ పరిచే నాయకుడిగా మీరు నిస్పక్షాపాతిగా (ఒక మధ్యవర్తి లాగా), ఏ గుంపుకి మిత్రుడి లాగా కానీ అనుకూలంగా కానీ ఉండకపోవడం చాలా ముఖ్యము. అంటే మీరు ఆ సమాజాన్ని బాగా తెలుసుకుని ఉండాలి అని అర్ధము. మీరు కొంత మందితోనే ఎక్కువ సమయము గడిపితే, ఇతరులు మీరు పక్షాపాతి అని అనుకోవచ్చు. సమాజము లోని గుంపులలో కల విభేదాలను సభాముఖంగా తెలపడానికి భయపడకండి, కానీ వెంటనే మీరు ఏ గుంపు లేదా గుంపులతో అనుకూలంగా లేరు అని చూపాలి. మీరు సమాజాన్ని ఏకముఖంగా (అంతా ఒకటిగా) చేయాలనుకోవడం లేదు అని గుర్తుంచుకోండి, సమాజం యొక్క ఐకమత్యం అంటే గుంపులు అన్నీ సమాజం పట్ల విశ్వాసముతో ఉంటూ, సహనముతో కూడిన పరిస్తితుల మధ్య, కులము, మతము, జాతి, వర్గము, లింగము, వయస్సు లేదా భాషతో సంబంధము లేకుండా ప్రజలందరూ ఒకరినొకరు అర్ధం చేసుకుని మర్యాదతో మసలుకోవడం. సమాజానికి ముఖ్యమైన కష్టము మరియు ఆశయం గుర్తించే ముందు ఒక ఐక్యమైన సమాజము ఉండడం అవసరము. ––»«––సమాజము దోహదం: © ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ భర్ట్లె
––»«–– |
హొమ్ పేజి |
మొదలు పెట్టడం |