Tweet అనువాదములు:
'العربية / al-ʿarabīyah |
ఈ విధానమునకు అనుకూలముగా వాదించడంరచన ఫిల్ బార్ట్లే, పి హెచ్ డిఅనువాదకులు: నిరుపమ ప్రతాప రెడ్డికార్య నిర్వాహాధికారుల నోట్ససంఘము తనని తాను వెల కట్టుకోవడానికి సంఘములోని ప్రజలు అందరూ ఎందుకు పాల్గొనాలి అని వాదించడంఊహించబడినవి మరియు అజ్ఞానం: చాలా మంది భౌతికంగా నిర్మితమైన సంఘ నిర్మాణాలను చూడాలి అనుకుంటారు. మీ పని మీద ప్రభావము చూపించే వారిలో ముఖ్యముగా రాజకీయ నాయకులు, జర్నలిస్ట్లులు (పత్రికా విలేఖరులు), కార్య నిర్వాహాధికారులు మరియు ఇంజినీర్లు వుంటారు. ఒక కట్టడము (ఉదాహరణకు నీళ్ళ పంపు, మరుగు దొడ్డి, స్కూలు లేక బడీ, ఆసుపత్రి) లాంటిది కనపడుతుంది, ఏ ప్రయాసా లేకుండా ఒక ఫోటో తీయ్యవచ్చు (ఒక రాజకీయ నాయకుడి పక్కన) మరియు స్పష్టముగా వుంటుంది. దానిని చాల సులభముగా ఒక విజయము కింద చూపించవచ్చు. సమయము తీసుకుని సంఘములోని ప్రజలను దాని విలువను వెల కట్టడంలో పాల్గొనేలా చేయడం (దానితో పాటుగా పధకము తయారు చేయడములో, కార్యనిర్వహణ, లెక్కలు రాయడము, పర్యవేక్షణ చేయడము, సమాచారము క్రోడీకరించి తెలియచేయడము, మరమ్మత్తులు చేయడము, సంరక్షణ శిక్షణ లాంటి ఇతర సామర్థ్యం పెంపొందించే పనులు) అన్నవి అంతగా పైకి కనపడదు. ఇలా సామర్థ్యం పెంపొందించడాన్ని ఎలా ఫోటో తీస్తారు? ఒక సారి ఒక దానము చేసే సంస్థ నుంచి ఒక అధికారి మూడు రోజుల అధికారిక పర్యటన కోసం వచ్చే వారం వస్తున్నాడు అని తెలిసింది. అప్పుడు సంఘములో అందరూ కలిసి పాల్గొనే కార్యక్రమాలు లేవని ఒక దౌత్య లేక రాయబారి కార్యాలయం ప్రధాన కార్య నిర్వహణ అధికారి చాలా కోపం చేసుకున్నాడు. ప్రణాలిక పత్రములో రాసి పెట్టుకున్న లక్ష్యములు ఏమైనా సరే చివరికి అందరూ ఫలితాన్ని భౌతికంగా కట్టబడిన కట్టడాల ఆధారంగానే విజయాన్ని లెక్కిస్తారు అని ఈ పనిని చేపట్టే కార్యనిర్వహనాధికారులకు తెలుసు. కాని అందరూ ఇలా భౌతిక నిర్మాణాలానే విజయానికి ముఖ్యమైన కొలబద్దగా అనుకోరు. ఇలాంటి సామర్థ్యం పెంపొందించే పనులు కూడా సమాజానికి ఎంతో ఉపయోగకరం అని గుర్తించే కొంత మంది విశాల దృక్పదం కలిగిన వారు కూడా వుంటారు. సమయము తీసుకొని సంఘములోని వారిని పాల్గొనేలా చెయ్యడం యొక్క అవసరము మరియు దాని ఉపయోగము ఏమిటి అని వాదించడానికి మిమ్మల్ని పిలవవచ్చు. "మనము ఒక బావిని మరియు నీళ్ళ పుంపును ఇక్కడ నిర్మించి తరువాత దానిని బాగుచేసి నిర్వహించడానికి ఎవరు లేక పోవడంవల్ల అది మెల్లగా మరమ్మతు లేక శిథిలమౌతున్న స్థితికి చేరుకోవడం చూడడం ఉత్తమమా?" అని మీరు అడుగవచ్చు. ఎందుకు సమయము తీసుకోవాలి? సంఘములోని వారంతా కలిసి పాల్గొనటానికి (వెల కట్టడానికి, పనులను ఎంచు కోవడానికి, కార్య నిర్వహణకు, పర్యవేక్షించుటకు మరియు సామర్థ్యం పెంపొందించడానికి) సమయము తీసుకోవడం సంఘములోని ప్రజలకు ఈ సంస్థ/వస్తువు మన అందరిది అన్న సామాజిక యజమానత్వ భావము కలిగే దిశగా వారిని ఉత్తేజ పరుస్తుంది. దీని మూలాన వారి రక్షణను (ఉదాహరణకు రౌడీతనానికి మరియు దారి తప్పిపోయిన పశువుల గురించి వ్యతిరేకంగా), సంరక్షణ మరియు బాగు చేయడము వారి ఒక సామాజిక భాద్యతగా భావిస్తారు. దాని మూలాన సంఘములోని వారు ఒక సంస్థనిగాని/సామజిక వసతి లేక నిర్మాణాని సరిగ్గా ఉపయోగించడానికి ముందుకు వస్తారు మరియు దానికి అనుబంధంగా వున్న ఇతర శిక్షణలను (ఆరోగ్య సూత్రాలు మరియు అనుసరణలు మొదలైనవి) గ్రహిస్తారు భౌతిక నిర్మాణలని భద్రముగా కాపాడుకోవడానికి ప్రజలను ఉత్తేజ పరచడానికి, సమయము ఎక్కువ పట్టినా కూడా సంఘములోని ప్రజలు అందరూ పాల్గొనుట అను పధ్ధతి, బాగా ఉపయోగకరమైనది. ఉత్తనే ఒక కట్టడము తొందరగా నిర్మించేయ్యటము కంటే ఈ పధ్ధతి భవిష్యత్తులో మంచి ఫలితాలు తెస్తుంది. సమాచారమును రెండు సార్లు ఎందుకు సేకరించాలి? మీరు అనుకూలంగా వాదించవలసిన ఇంకో అంశం ఏంటంటే పటము తయారు చేసే సమయములో మరియు సామగ్రి జాబితా తయారు చేసే సమయములో ఎందుకు సమాచారము సేకరించాలి అన్న విషయము గురించి. ఈ విషయము అంటే ఇష్టం లేని కొంత మంది సంఘము తయారు చేసిన పటము మరియు సామగ్రి జాబితా యొక్క ఆవశ్యకత గురించి ప్రశ్నించ వచ్చు. ముఖ్యముగా సమగ్రమైన సర్వే/అభ్యాసము ఇది వరకే నిర్వహించి వుంటే గనక. సంఘములోని అందరు పాల్గొని సమాచారము సేకరించడము అన్నది ముఖ్యముగా సంఘము కొరకే అన్నది మీరు వివరించాలి. అది సంరక్షణ లేక ఉద్ధరణము మరియు భాద్యతని పెంచటం కోసం అని వివరించాలి. పథకము తాలూకు అంశాల వల్ల ఏదైనా సంస్థకి లేదా ప్రణాలికకి గాని జరిగే ప్రయోజనం మన ముఖ్య ఉద్దేశము కాదు. సాంఘిక ప్రక్రియల ద్వారా సేకరించిన సమాచారము సర్వే ఆధారముగా సేకరించిన సమాచారమును సరిచేసుకోవడానికి, దానిలో లేని అంశాలను తెలుపడానికి మరియు దానికి బలము చేకూర్చడానికి పనికి వస్తుంది. మీరు దీనికి అనుకూలముగా ఎలా వాదించాలి? ఏదైనా సాంఘిక నిర్మాణమును పురస్కరించుకుని జరుగుతున్న కార్యక్రమము ఏదైనా కూడా ఈ ముఖ్య అంశాలన్నీ వినడానికి ఆసక్తి చూపించే వారికి మీరు ఈ ముఖ్య అంశముల గురించి చెప్పగలిగిన ఒక ముఖ్య వేదిక అవుతుంది. అది ఒక "చెక్కులు పంచే కార్యక్రమము" అవ్వ వచ్చు ఎక్కడైతే పెద్ద దాతలను గౌరవిస్తారో, ఒక "శంకుస్థాపన" అవ్వ వచ్చు ఎక్కడైతే ఒక విఐపి (VIP) అధికారికముగా భవన నిర్మాణము మొదలు పెడతారో, లేదా ఒక "పూర్తి చేసిన దానికి జరిపే వేడుక" అవ్వ వచ్చు ఎక్కడైతే స్థానిక మరియు జాతీయ నాయకులు వచ్చి రిబ్బన్ కత్తిరించి, ఆ నిర్మాణము పూర్తి అయినట్టుగా తెలియచేస్తు మొదటి అధికారిక ఉపయోగము కోసం నిర్మాణ వాడుకను మొదలు పెడతారో. ఆ ముఖ్య కార్యక్రమము జరుగుతునప్పుడు మీరు ఈ నిర్మాణము ఉత్త నిర్మాణము మాత్రమే కాదు అని, ఇది సంఘము యొక్క సామర్థ్యం పెంపొందించడానికి ఉపయోగపడే వ్యవస్థ అని తెలుపుతూ కొన్ని ఒక పేజి కరపత్రాలు పంచండి. ఆ కరపత్రాలలో ఆ సంఘములోని ప్రజలు ఈ నిర్మాణము కోసం ఎలా వివిధ దశల్లో (వెలకట్టుటలో, ఏది ఎప్పుడు చెయ్యాలి అని నిర్ణయించడం, కార్యనిర్వహణలో శిక్షణ ఇవ్వటం, వ్యవస్తని నిర్వహించడాన్ని కని పెట్టుకుని వుండడం మరియు సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుపుతూ వుండడం) ఎలా పాల్గొన్నారో వివరముగా చెప్పండి. కొంచెం ఎక్కువ సమాచారముతో కూడిన పెద్ద పత్రములను, అంటే ఒక రెండు పేజిల ప్రెస్ నోట్ను పాత్రికేయులకు (టీవీ, రేడియో, పత్రికలు, సాంఘిక సమాచారము గురించి పనిచేసే ప్రభుత్వాధికారి) ఇవ్వ వచ్చును. ఎవరైనా ఒక పాత్రికేయుడు కొంచెం అర్ధం చేసుకునే మంచి స్వభావము కలిగినవాడు మరియు కొంత స్వతంత్రముగా పని చేసేవాడు అయితే అలాంటి వారితో కలిసి పత్రికా ప్రకటన తయారు చెయ్యండి. ఆ ప్రతిలో ఈ పాల్గొనుట అను ప్రక్రియ గురించి వివరించండి మరియు అది సమయము ఎక్కువ తీసుకున్నా కూడా చివరికి వచ్చే వుపయోగముల మూలన అది ఎందుకు మంచిది అని తెలియచేయండి. ఒక వేళ మీకు పాత్రికేయులతో కొంచెం ఎక్కువ సమయం దొరికితే (ఉదాహరణకు చాలా దూరమైనటువంటి ఒక సంఘమును కలవడానికి వెళ్తునప్పుడు కలిసి ప్రయాణం చేయడం) మీరు వారికి ఈ పద్ధతి గురంచి వివరించండి, మరియు ఎందుకు దీనికి ఎక్కువ సమయం పడుతుంది అని లోతుగా వివరించండి. మీ వాదనను మీరు గట్టిగా వినిపించడానికి ముందు మీరు ఈ పద్ధతిని బాగా అర్ధం చేసుకోవాలి మరియు మీరు ఈ పధ్ధతి వలన కలిగే ఉపయోగముల గురించి గట్టిగా నమ్మకము కలిగి వుండాలి. ఉత్తనే వాదించడానికి సిద్ధముగా వుండడం లేదా ఈ పాల్గొనుట అను ప్రక్రియ గురించి వివరించడానికి నేర్చుకుని వుండడం లాంటివి సరిపోవు. ఎన్నో విషయాలు బయటకి చెప్పబడవు అవి జనాలు లోపలే అనుకుంటారు అందుకని ఎంతో చురుకుగా మనం ఈ పనిని చర్య తీసుకొను పద్దతి చేపట్టాల్సిన అవసరం వుంటుంది. మీ పనికి ఎవరెవరి అభిప్రాయాలు ముఖ్యమో కనుక్కోండి (రాజకీయ నాయకులు, పై పదవుల్లో వున్న ప్రభుత్వోద్యోగులు, ఇంజినీర్లు మరియు విలేఖరులు). ముఖ్యముగా ఎవరైతే ఏమి తెలియకుండా మన పనికి ఎప్పుడు అడ్డుతగిలే వారి నుంచి దీని గురించి తెలుసుకుని మన స్నేహితులుగా మారతారో అలాంటి వ్యక్తుల కోసం చూడండి. అలాంటి వారికి మీ పత్రికా ప్రకటన మరియు కర పత్రాలు చేరేలా చూసుకోండి. మీకు అవకాశము దొరికినప్పుడల్లా దీని గురించి ప్రశ్నలు లేవనెత్తండి మరియు ఈ అంశమును అందరికి పరిచయం చేయండి. క్లుప్తముగా చెప్పాలి అంటే, ఇది చాలా చిన్న సమీకరణం: అందరు పాల్గొనాలి అన్న అంశము వలన మనము నిర్మించే పని నిదానముగా అవుతుంది కాని సంరక్షణ లేక ఉద్ధరణ పెంపొందించును అంటే దీర్ఘకాలము పనికివస్తుంది. మీరు ఇదంతా కూడా ఇంకా ఎక్కువ వివరముగా ఇప్పుడు సంఘములో జరుగుతున్న పనులతో ముడిపడినటువంటి అంశాలను ఉదహరిస్తూ ప్రజలకు వివరించవలసి వుంటుంది. మీ వాదనలను సరళ తరమైనటువంటి భాషలో రాయండి దాని మూలాన మీ ఆలోచనలు ఇతరులకు సులువుగా అర్ధం అవుతాయి. సంఘములోని సభ్యులను పాల్గొనేలా చెయ్యడాన్ని సులభతరము చేయడం అన్న పనికి ఇది కొన్ని రకాలుగా కొంచెం వ్యతిరేకంగా వుంటుంది; మీరు ఏమి ఫలితము ఆశిస్తున్నారో అది ముందర తెలుసుకోండి, తరువాత ఆ సమాచారము మీరు ఎంచుకున్న వారికి తెలియచేయండి. అది మీ ఇష్టము. ––»«––సంఘము నుండి ఉత్పాదకము కొరకు సమయము వెచ్చించుట: © ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ భర్ట్లె
––»«–– |
హోం పేజి |
వెల నిశ్చయిన్చుటలో పాల్గొనుట |