వెల నిశ్చయించుటలో పాల్గొనే ప్రక్రియని ఇతరులకు వివరించే వారికి శిక్షణ
నైపుణ్యాల మీద శిక్షణ ఇవ్వడానికి కొన్ని ఉపయుక్తమైన పద్ధతులు
అనువాదకులు పి. నిరుపమ ప్రతాప రెడ్డి
శిక్షకులకు వివరణ
సమన్వయకర్తలకి
మరియు పనిని ఇతరులకు అర్ధం చేసేవారికి,
సంఘము యొక్క వెల నిశ్చయించే పనిలో
ప్రజలు పాల్గొనే విధముగా ఉత్తేజపరచడానికి
శిక్షణను ఎలా ఇవ్వాలి?
సంఘము
యొక్క అవసరాలు, సమస్యలు, ఏది ముందు
చేయాలి అన్న విషయాలు, మరియు అడ్డులు
అంచనా వేయటానికి సంఘములోని ప్రజలు
పాల్గొనే విధముగా ఉత్తేజితులు
చేయటానికి ఉన్న వివిధ పద్ధతులలలో
సమన్వయకర్తలకు శిక్షణ ఇచ్చే పని
గనక మీదైతే, మీరు లెక్కలోకి తీసుకోవడానికి
చాలా సూత్రాలు మరియు పద్ధతులు ఉన్నాయి.
పని చేస్తూ నేర్చుకోవడము; (A) శిక్షణా సమావేశములో:
మీరు
పిఏఆర్/పిఆర్ఏ యొక్క సూత్రాలు శిక్షణ
పొందువారికి తెలియచెప్పడానికి
కొన్ని బాగా తెలిసిన పద్ధతులను
వాడుకోవచ్చు. అవి ఏమిటంటే: భోధనా
ప్రసంగాలు, ప్రసంగాలు లేదా చిత్రాలతో
కూడిన ప్రదర్శనలు (చలన చిత్రాలు,
చిన్న చిన్న చిత్రాలు, ప్రొజెక్టర్
ద్వారా చూపించే చిత్రాలు), చర్చాగోష్టులు,
భేదాభిప్రాయాల మీద చర్చలు, మరియు
చిన్న చిన్న సమూహాల మధ్య వాదోపవాదాలు.
ఇక్కడ మేము ఇచ్చే సలహా ఏమిటంటే,
ఇలాంటి సాంప్రదాయ పద్ధతులను మామూలు
శిక్షణకు అనుబంధంగా ఇచ్చే శిక్షణలో
వాడుకోండి. ముఖ్యమైన శిక్షణ “పని
చేస్తూ నేర్చుకోవడం” అనే అంశము
మీద ఆధారపడి ఉండే విధముగా చూసుకోండి.
సమన్వయకర్తలగా
శిక్షణ తీసుకొనే వారు గనక వివిధ
సందర్భాలలో కొంత పనిలో నిమగ్నమయేటట్టు
మీరు దృష్టిపెడితే మీకు మంచి ఫలితము
వస్తుంది. ఆ సందర్భాలుగా ఏవి ఉండగలవు
అంటే: (1) పధ్ధతి ప్రకారం ఒక పాత్రని
నిర్వహించడం, (2) అనుకరించే కొన్ని
ఆటలు, మరియు (3) కొన్ని సాముహిక ప్రక్రియలు.
శిక్షణ
తీసుకొనేవారి సమూహము ఏ సంఘమును
లక్ష్యముగా పెట్టుకున్నామో దాని
పాత్రను పోషించవచ్చు, మరియు వారికి
సహకరించి వారిచే సంఘము యొక్క అవసరములు,
వనరులు, అడ్డులు మరియు ఏది ముందర
చేయాలి అన్న అంశాలను గుర్తించే
విధముగా చేయవచ్చును. రెండో అంశముగా
చెప్పిన విషయము ఏదో ఉత్తినే చేపట్టే
అభ్యాసము కాకూడదు, ఆ అభ్యాసము ఒక
పట్టిక/జాబితా తయారీకి తోడ్పడాలి
మరియు అది ముందర ముందర ఈ సమూహము
చేసే అభ్యాసాలకి మరియు కార్యక్రమాలకీ
తోడ్పడాలి. శిక్షణ తీసుకొనేవారు
వంతుల వారీగా ఒకరి తరువాత ఒకరు ఈ
ప్రక్రియలకు నాయకత్వము వహించవచ్చును.
మీరు
పని చేస్తూ నేర్చుకోవడం అనే అంశమును
శిక్షణా శిబిరములో ఉన్న వాతావరణములో
(ఇది ఒక బాగా నియంత్రించబడినటువంటి
వాతావరణము) నేర్చుకోవడానికి మరియు
వాస్తవ పరిస్తితులలో ఉన్న వాతావరణములో
(ఇది ఒక తక్కువగా నియంత్రించబడే
వాతావరణము) నేర్చుకోవడానికి మధ్య
పోల్చి చూసుకుంటే దేనికుండే బలములు
మరియు లోపములు వాటివాటికి ఉంటాయి.
ఒక నియంత్రించబడినటువంటి వాతావరణములో
(ఇది అనుభవము లేని వారికి చాలా ఉపయుక్తమైనది)
మీకు ఒక సరైన పధ్ధతి వుంటుంది మరియు
ఇది సందేహములు వుండే శిష్యులకు
ఒక భద్రమైనటువంటి వాతావరణము. వాస్తవ
పరిస్థితులలో ఏమి జరగవచ్చును అనే
దానిపై తక్కువ నియంత్రణ వుంటుంది,
కాకపోతే అది ఇచ్చే అనుభవము వాస్తవమైనది
మరియు అది అభ్యాసము పొందే వారికి
ఒక మంచి అనుభవమును ఇస్తుంది.
పని చేస్తూ నేర్చుకోవడము; (B) వాస్తవ పరిస్థితులలో:
వాస్తవిక
స్థలములో అభ్యసము చేయడము తక్కువ
భద్రతతో కూడుకున్నది కానీ సమన్వయకర్తలుగా
అవటానికి శిక్షణ తీసుకుంటున్న
వారికి నేర్చుకోవడము కోసం తీవ్రమైన
పరిస్థితులను కల్పిస్తుంది. వాస్తవ
ప్రదేశాలలో శిక్షణ అన్నది రకరకాల
పరిమాణాలలోను మరియు రకరకాల ఆకారలలోను
వస్తుంది.
ఉదాహరణలు ఏమిటంటే:
- ఎక్కడైతే
శిక్షణ పొందువాడు ఒక బాగా అనుభవమున్న
సమన్వయకర్తకు సహకరిస్తాడో,
- ఎక్కడైతే
ఒక శిక్షణ పొందువాడు సంఘములో ఒక
చర్చా గోష్టి ఏర్పాటు చేసి దానిని
శిక్షకుడి పర్యవేక్షణలో (శిక్షకుడు
అవసరం అనుకునప్పుడు రంగములోకి
దిగడానికి సిద్ధముగా ఉండి) సమన్వయపరుస్తాడో,
- ఎక్కడైతే
ఒక శిక్షణ తీసుకునేవానికి మొత్తము
అన్నింటి భాద్యత అంతా అప్పగించేస్తారో
మరియు శిక్షకుడు ఉత్తినే కూర్చుని
ఇతను చేసే పనిని పైపైన పర్యవేక్షిస్తాడో.
ప్రతీ
సమావేశము తరువాత సంక్షిప్తముగా
దాని గురించి తెలుసుకునే సమావేశము
ఉంచడము ప్రతి కేసులోను ఎంతో ఉపయుక్తముగా
ఉంటుంది. శిక్షణ తీసుకునేవానికి
ఇది నేర్చుకోవడము కోసము ఎంతో ఉపయోగపడుతుంది.
శిక్షణ
తీసుకునేవానికి అది ఈ విధముగా తోడ్పడుతుంది:
(1) ఆ ప్రక్రియలో భాగముగా ఏమి జరిగింది
అన్నది భద్రపరచి దానిలో ఏమి జరిగింది
అన్నది విశ్లేషించడానికి, (2) అనుభవమును
ఆధారము చేసుకుని ఆ ప్రక్రియలో ఉన్న
వివిధ భాగాలు ఏమిటి అని తెలుసుకోవడానికి,
(3) శిక్షణ తీసుకునే వాడు సూటిగా సవివిరమైన
ప్రశ్నలు అడిగి తెలుసుకోవడానికి,
మరియు (4) భవిష్యత్తులో చేయబోయే పనికి
కొన్ని పద్ధతులు మరియు సూత్రాలు
తయారు చేసుకోవడానికి.
అది
శిక్షకునికి ఒక వేదికను ఇస్తుంది
(1) తాను గమనించిన దాని మీద తన అభిప్రాయాలను
వ్యక్తపరచడానికి, (2) స్పష్టమైన సంఘటనల
ఆధారముగా సూచనలు చేయడానికి, మరియు
(3) శిక్షణ తీసుకునే వాడిని గమనించడము
మీదా, విశ్లేషించడము మీదా, రిపోర్ట్లు
మరియు రికార్డులు రాయడము మీదా మార్గనిర్దేశము
చేయడానికి.
రాసిన దానినుంచి (పుస్తకములు వగైరా వాటినుంచి) నేర్చుకోవడము:
వ్రాత
ప్రతులు ఒక శిక్షణ తీసుకునేవాడికి
వాస్తవ పరిస్తితుల మధ్య పని చేసి
నేర్చుకునే విధానం అంత బాగా లేదా
అంత త్వరగా నేర్చుకోవడానికి ఉపయోగపడదు.
కాకపోతే అది పునఃసమీక్షించుకోవడానికి
మరియు తిరిగి చూసుకోవడానికి ఉపయోగపడుతుంది.
అలాగే శిక్షణ తీసుకునే వ్యక్తి
శిక్షణ ద్వారా తెలుసుకున్న విషయాలను
ధృవీకరించడానికి అవి ఉపయోగపడతాయి.
శిక్షణ తీసుకునేవారు వ్రాత ప్రతులంటే
బాగా ఇష్టం ప్రదర్శిస్తారు మరియు
దానిలో రాసినదాన్ని బాగా అర్ధం
చేసుకోగలుగుతారు. అలాంటప్పుడు
వారు చదువుతున్న అంశమును ఇంతక ముందరే
వారు అనుభవించి వుంటే గనక వారికి
ఆ విషయం ఇంకా బాగా బోధపడుతుంది.
వివిధ
వ్రాత ప్రతులను (వివిధ రకములైన పనులవలే)
ఒక సమన్వయకర్తగా లేదా ప్రక్రియను
ఇతరులకు అర్ధము చేయు వ్యక్తిగా
తయారు కావటానికి శిక్షణ తీసుకునేవానికి
వివిధ స్థాయిలలో శిక్షణను ఇవ్వటానికి
వాడుకోవచ్చు. ప్రవేశ స్థాయిలో దానిని
సులభముగా అర్ధం అయే విధముగా తయారు
చేసి, బొమ్మలు గీసి శిక్షకుడు శిక్షణ
తీసుకునేవానికి నేరుగా ఇవ్వవచ్చు.
ఈ వెబ్ సైట్లో వున్న అన్ని కర పత్రాలు
మరియు ఇతర శిక్షణా సామగ్రి ఇలా నేరుగా
ఇవ్వగలిగిన సులభమైనటువంటి శిక్షణా
సామగ్రీ. దానిని సులభమైనటువంటి,
స్పష్టమైన, ఎటువంటి సందిగ్ధానికి
తావులేనటువంటి మరియు తికమక కలిగించనటువంటి
భాషలో (ఎక్కడ సబబు అనుకుంటే అక్కడ
ప్రాంతీయ మాండలికంలో) రాయాలి. ఇటువంటి
శిక్షణా ప్రతులకు బొమ్మలు వెల కట్టలేనటువంటి
అనుభందాలు వంటివి.
శిక్షణ
తీసుకుంటున్నవారిలో ఎవరికైతే కొంత
క్షేత్రములో అనుభవముందో వారికి
కొంత పెద్ద స్థాయిలో రాసినటువంటి
శిక్షణా ప్రతులను ఇవ్వాలి. అందులో
విషయము గురించి మరింత లోతుగా చర్చించవచ్చు.
అనుకున్నవాటికి భిన్నముగా జరిగే
విషయాలను మరియు సందిగ్ధములను అందులో
చూపవచ్చును (ఈ విషయాలు కొత్తగా వచ్చేవారిని
నిరుత్సాహ పరచవచ్చు).
అన్నిటికంటే ముఖ్యమైన విషయము ఏమిటంటే
ఈ మాధ్యమిక మరియు ఉన్నతస్థాయిలో
ఉన్న సామగ్రిని శిక్షణ తీసుకునేవానికి
ఉచితముగా ఇవ్వకూడదు (మీరు ఈ అంశమును
జీర్ణించుకున్నా లేకున్నా సరే).
సాధికారము సాధించు పద్ధతులలో లాగా
ఇక్కడ కూడా ఒక శిక్షణ తీసుకొనే
వ్యక్తి గనక దానిని సాధించడానికి
ప్రయాస మరియు కొంత త్యాగముతో గనక
ప్రయత్నిస్తే దానికి మరింత విలువను
ఇస్తాడు. శిక్షణ తీసుకునే వ్యక్తికి
మార్గనిర్దేశం చేయండి, ఆమెనుగాని
లేదా అతనినిగాని సరైన దారిలో నడిపించండి
మరియు శిక్షణ తీసుకునేవానిని అతని
పరిశోధన అతనినే చేసుకోమనండి.
పాఠాలు బోధిస్తూ నేర్చుకోవడము:
పని
చేస్తూ నేర్చుకోవడము అన్నది అన్నింటిలోకి
మంచి పధ్ధతి అయినా, ఇతరులకు నైపుణ్యాలు
నేర్పించడము వల్ల కూడా పై స్థాయిలో
నేర్చుకోవచ్చు. ఇతరులకు నేర్పించవలసిన
ఘడియ ఆసన్నమైనప్పుడు, శిక్షణ తీసుకునే
వారు ఉత్తుత్తినే వచ్చినవారు అయినా
కూడా (అంటే శిక్షణనిచ్చే వారంత అనుభవము
ఉన్నవారు) శిక్షకుడు అలాంటి పరిస్థితిలో
ఇతరులకు విషయము అర్ధము చేయడము కొరకు
తీవ్రమైన కృషి చేయడము వలన ఇంకా బాగా
అర్ధం చేసుకుంటాడు.
శిక్షణ
తీసుకునే వారిని “ఎలా చేయాలి” అన్న
కర పాత్రలను మరియు మార్గదర్శకాలను,
పూరించే విధముగా ఉత్తేజపరచండి
(శిక్షణా సామగ్రీ తయారీ కూడా ఇంకో
విధమైనటువంటి బోధనా పద్ధతే). వారిని
ఈ కర పత్రాలను ఒకరి మీద ఒకరు అభ్యాసము
చేయడము కోసము ఉపయోగించనివ్వండి.
ప్రతీ సమావేశము తరువాతా వారికి
ఆ నైపుణ్యాలు మరియు పద్ధతులు అర్ధము
అయ్యాయో లేదో కనుక్కోండి. వినే వారు
శిక్షకునిని అర్ధం చేసుకున్నారా
లేదా? ప్రతీ అంశమును మరియు అభ్యాసమును
మీ దగ్గర శిక్షణ తీసుకునే వారితో
చర్చించండి.
పాఠాలను
ఎలా బోధించాలి అన్న అంశమును, వివిధ
అంశముల మీద ఒక వివరమైన విశ్లేషణను
ప్రదర్శించడము మరియు బోధనా సామగ్రిని
తయారు చేయడము అన్న అంశాలతో కలిపి,
శిక్షణ తీసుకునే వారు వివిధ రకాలుగా
అభ్యసించవచ్చు. ఆ రెండిటిని కూడా
(మరియు ఇతర పద్ధతులను కూడా) నేర్చుకునే
విధముగా శిక్షణ తీసుకుంటున్న సమన్వయకర్తలను
మరియు పనిని ఇతరులకు సులభముగా అర్ధము
చేయడానికి కృషి చేసేవారిని ఉత్తేజపరచండి.
మీ దగ్గర శిక్షణ తీసుకుంటున్న వారిని
శిక్షణా సామగ్రి కింద వ్రాత ప్రతులను
అత్యంత సులభమైన పాఠాలను ఎలా బోధించాలి
అన్న అంశమును, వివిధ అంశముల మీద
ఒక వివరమైన విశ్లేషణను ప్రదర్శించడము
మరియు బోధనా సామగ్రిని తయారు చేయడము
అన్న అంశాలతో కలిపి, శిక్షణ తీసుకునే
వారు వివిధ రకాలుగా అభ్యసించవచ్చు.
ఆ రెండిటిని కూడా (మరియు ఇతర పద్ధతులను
కూడా) నేర్చుకునే విధముగా శిక్షణ
తీసుకుంటున్న సమన్వయకర్తలను మరియు
పనిని ఇతరులకు సులభముగా అర్ధము
చేయడానికి కృషి చేసేవారిని ఉత్తేజపరచండి.
మీ దగ్గర శిక్షణ తీసుకుంటున్న వారిని
శిక్షణా సామగ్రి కింద వ్రాత ప్రతులను
అత్యంత సులభమైన భాషలో మరియు అందరికి
అర్ధం అయే వ్యాకరణం వాడి అందరికి
అర్ధం అయేటటువంటి పదములు వాడి తయారు
చేయమనండి. మీ దగ్గర శిక్షణ తీసుకుంటున్న
వారిని ఎక్కడ కుదిరితే అక్కడ ప్రాంతీయ
భాషలలో శిక్షణా సామగ్రి తయారు చేసే
విధముగా ఉత్తేజ పరచండి. ఇంకా ఉత్సాహపరచడానికి
శిక్షణ తీసుకుంటున్న అతను తయారు
చేసిన వ్రాత ప్రతులను అచ్చేసి మరియు
దానికి కాపీ వేసి, మీ చుట్టు ప్రక్కల
ప్రాంతములో మరియు సమూహములో అందరికీ
త్రిప్పి చూపించండి మరియు వార్తా
ఉత్తరాలవలే ప్రచురించండి, కుదిరితే
ప్రాంతీయ వార్తా పత్రికలలోనూ, ఉద్యోగ
సంబంధమైన మాస పత్రికలలోనూ అచ్చేయించండి.
ఇలా చేయడము వలన శిక్షణ తీసుకుంటున్న
వారి కష్టాన్ని గుర్తించినవారు
అవుతారు, దాని వలన వారికి మరింత
ఉత్సాహము వస్తుంది.
నేర్చుకుంటూనే వుండండి:
మీ
దగ్గర శిక్షణ తీసుకుంటున్న వారికి
గుర్తు చేస్తూ ఉండండి, ఏమిటంటే,
ఈ వృత్తి గురించి నేర్చుకోవడానికి
మీరు మీ జీవితకాలాన్ని వెచ్చించాలి
అని. “నేర్చుకోవడము ఆపేసిన రోజున
మీరు చనిపోయిన వారితో సమానం.”
––»«––
సంఘములోని ప్రజలకు, పనిని సులభతరము చేసి నేర్పువారికి శిక్షణనిచ్చుట:
© ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ భర్ట్లె వెబ్ రూపకర్త లోర్డస్ సడా
––»«––చివరగా మార్చబడిన తేది: 2011.12.18
|