Tweet అనువాదములు:
'العربية / al-ʿarabīyah |
నేర్చుకున్న పాఠాలుమరియు కొనసాగింపు యొక్క సాధ్యాసాధ్యాల మీద అవగాహనరచయిత ఫిల్ బార్ట్లే, పీ హెచ్ డీఅనువాదకులు: తుంగ మెహెర్ ప్రసూనాశిక్షణా కరపత్రంప్రతి సమూహములో నిర్వాహకులు వస్తూ పోతూ ఉంటారు, వాళ్ళ మధ్య అనుసంధానము మరియు కొనసాగింపు ఉండాలి. ప్రతి ఒక్కరూ ఈ అంశము గురించి నేర్చుకున్నది అందరికీ అందుబాటులో వుండే విధముగా దానిని నమోదు చేసి భద్ర పరచాలి.మనం మనుషులుగా మనం సాధించిన విజయాల నుండి మరియు చేసిన తప్పులు/పోరపాటుల నుండి, నేర్చుకోవాలి. పొరపాటులు జరగడం, విఫలం చెందడం మరియు అనర్ధాలు జరగడం అన్నీ ఒకటే కాదు అని గుర్తుంచుకోవాలి. ఒక తప్పు చేసినంత మాత్రాన విఫలము చెందినట్టు కాదు; తప్పులు చేయడం మానవ సహజం. విఫలమైనంత మాత్రాన ఏదో అనర్ధం జరిగినట్టు కాదు; ఏదైనా సాధించడములో విఫలమైతే గనక, మీరు ఒక మనిషిగా విఫలమయినట్టు కాదు. అనర్ధము జరిగితే జీవతం అంతం అయినట్టు లేదా సమయం అంతం అయినట్టు కాదు. కింద పడినప్పుడు మనకి మనమే పైకి లేచి ముందుకు సాగుతూ ఉండాలి. రేపటి గురించి ఆలోచించకుండా, ఈ రోజునే జీవించాలి. ఒక వేళ మీరు మరుగు దొడ్డి నిర్మాణములో లేదా ఇతర లక్ష్యాలను పూర్తిచేయడములో సమూహాన్ని ఉపదేసించడంలో సఫలం ఐతే మీరు ఆ సమూహం స్వయం సంవృద్ధి సాధించడములో ఒక అడుగు ముందుకు వేసినట్టు. ఈ పని మృదువుగా లేదా పరిపూర్ణంగా అయివుండదు. మీరు ఒక వేళ అలా అనుకుంటే, మీరు మీ పట్ల నిజాయితీగా ఉండటంలేదు. ప్రక్రియని మరియు అందులో మీ పాత్రని విశ్లేషించండి. మీ తప్పులని అంగీకరించడములో ధైర్యంగా నిజాయితీగా ఉండండి. సమీకరణ చక్రం యొక్క విశ్లేషణ రాసుకోండి. పొరపాటులు మరియు విఫలం చెందిన వాటి పట్ల వాస్తవికంగా మరియు తటస్థంగా ఉండండి; దిగులుతో మిమ్మలని మీరే కప్పిపుచ్చుకోవడానికి వాటిని వంకగా వాడకండి. నేర్చుకోవలసిన పాఠాలుగా వాటిని ఉపయోగించుకోండి; ఇలా చేయడం వలన, ఒక పాట్యపుస్తకం లేదా ఇప్పుడు మీరు చదువుతున్న ఈ గ్రంథం నుండి నేర్చుకున్న దాని కన్నా కూడా చాలా వాస్తవికంగా లేదా మరింత ఉపయుక్తంగా ఉండే విధముగా నేర్చుకుంటారు. మీ పత్రికలను, మీ విశ్లేషణను, మీరు నేర్చుకున్న పాఠాలను మరింత శక్తివంతమయిన మరియు ప్రతిభావంతమయిన నిర్వాహకునిగా ఎదగడానికి ఉపయోగించుకోండి. మీరు అదే పనిని, సమూహంతో మరియు సమూహం కోసం చేయండి. ––»«––© ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ భర్ట్లె
––»«–– |
హొమ్ పేజి |
జోక్య ఉద్ధరణము |