మొదటి పెజి
 పిఎఆర్/పిఆర్ఎ




అనువాదములు:

'العربية / al-ʿarabīyah
বাংলা / Baṅla
Català
Deutsch
English
Español
Filipino/Tagalog
Français
Ελληνικά / Elliniká
हिन्दी / hindī
Italiano
بهاس ملايو / Bahasa Melayu
Polszczyzna
Português
Română
తెలుగు /Telugu
Tiếng Việt

                                        

మిగితా పాజీలు

విభాగాలు

స్థల పటములు

ముఖ్యమైన పదాలు

సంప్రదించ వలసిన చిరునామా

అవసరమైన పత్రాలు

అవసరమైన అనుసందానములు

వెల నిశ్చయించుటలో పాల్గొనుట ప్రక్రియ మరియు పరిశోధన

ఒక సమాజమును తనవంక తాను చూసుకొనుటకు ఉత్తేజపరచడం మరియు దానికి మార్గ నిర్దేశం చేయడము

రచన ఫిల్ బార్ట్లే, పిహెచ్డీ

అనువాదకులు పి. నిరుపమ ప్రతాప రెడ్డి


ఈ విభాగములో ముఖ్య పత్రము

సంఘములోని ప్రజలను సంఘము యొక్క వెల నిశ్చయించే పద్ధతిలో పాల్గొనేలా చేయటానికి ఉత్తేజ పరచడానికి ఏమి చేయాలి?

వెల నిశ్చయించుటలో పాల్గొనటం:

సమన్వయకర్తగా మీ ముఖ్య కర్తవ్యం ఏమిటంటే సంఘములోని సభ్యులందరూ సరిగ్గా మరియు ఖచ్చితత్వంతోటి వారి సంఘము యొక్క వెల నిశ్చయిస్తున్నరా లేదా అన్నది చూసుకోవడం. మరియు వారు వారి సమస్యలను నమోదు చేసుకుంటున్నారా లేదా మరియు చేయవలసిన పనులలో ఏది ముందు చేయాలి మరియు ఏది తరువాత చేయాలి అని బేరీజు వేసుకుంటున్నారా అని చూసుకోవాలి.

ఒక పధ్ధతి ప్రకారం సంఘము యొక్క సాముహిక కృషితో గనక ఈ సంఘము యొక్క వెల నిశ్చయించే పని గనక చేపట్టకపోతే సంఘములోని ప్రతి ఒక్కరికి ఏది ముఖ్యము ఏది కాదు అనే అంశము మీద ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి మరియు ఎవరికి తోచిన ఆలోచనలు వారికి మరియు ఎవరి అసత్య నమ్మకాలు మరియు తప్పుడు ఊహలు వారికి వుంటాయి. దీని మూలాన ఐక్యత కొరవడుతుంది మరియు ఎవరి మీద వారే ఆధార పడేటందుకు మరియు బీదరికము తగ్గించడానికి ఉపయోగపడేటటువంటి పారదర్సకమైన మరియు ఉపయోగపడేటటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అడ్డంకులు ఏర్పడతాయి. అందువల్ల ఒక సమన్వయకర్తగా మీరు జనాలను పాల్గొనే విధముగా ఉత్తేజపరిచి మరియు వారు సమాజము యొక్క వెల నిశ్చయించడానికి కావలసిన నైపుణ్యాలు నేర్చుకునే విధముగా వారికి శిక్షణనివ్వాలి.

మీరు సమన్వయపరిచే ఛట్రములో తరువాతి దశకు చేరుకున్న తరువాత, అంటే ఒక సామజిక ప్రాజెక్టు కొరకు ప్రణాళిక తయారు చేసే దశ, మీరు ఏ సమస్యను ముందు పరిష్కరించాలి అన్నది నిర్ణయించుకోవలసి వుంటుంది. సంఘములోని సభ్యులందరూ కూడా ఎన్నుకోబడిన సమస్య అన్నింటి కంటే ముందు పరిష్కరించవలసిన సమస్య అని నమ్మాలి మరియు వారిలో ఏకాభిప్రాయము వుండాలి. ఐఖ్యత కుదర్చకపోయినా మరియు సంఘములోని అందరు కలిసి ఒక క్రమ పద్ధతిలో గనక నిర్ధారణ చేయకపోయినా, ఏది ముందర చేయాలి అన్న అంశము మీద ఏకాభిప్రాయము వుండడము అన్నది జరగదు. ఇలా అందరు కలిసి వెల నిశ్చయించే పని కనక చేపట్టకపోతే ఏది ముందు చేపట్టాలి అన్న దాని మీద ఏ సమూహము యొక్క అభిప్రాయాలు వారికి వుంటాయి.

చదువుకున్నవారు చదువురాని వారికి భిన్నముగా సమస్యలను చూస్తారు. మగవారు ఆడవారి కంటే భిన్నముగా చూస్తారు. భూమి కలిగినవారు అది లేనివారు మరియు అద్దెకు/కౌలుకు తీసుకున్నవారి కంటే భిన్నముగా ఆలోచిస్తారు.

ముందు ఏమి చేయాలి అన్న అంశము మీద వేరే వేరే వయసులకు చెందినవారు, భాషలకు చెందినవారు, మతాలకు చెందినవారు అంత తొందరగా ఒక ఏకాభిప్రాయానికి రారు, ఎందుకంటే వారందరూ ఈ విశ్వాన్ని వివిధ విధాలుగా చూస్తారు మరియు ఎవరి నమ్మకాలు వారికి వుంటాయి కనక.

పటము తయారుచేయటము:

ఈ వెల నిశ్చయించుట అను పద్ధతిని మొదలుపెట్టడానికి ఈ పటము తయారుచేయటము అన్న అంశముతో మొదలుపెట్టడము మంచిది.

పటము తయారు చేయడానికి ఒక రోజుగాని లేదా ఒక మధ్యానాన్నిగాని ఎంచుకోండి. సంఘములోని ఎంత మంది రాగలిగితే అంత మందిని రమ్మనండి. అందరు వచ్చిన తరువాత మీ గ్రామములోని ప్రదేశాలను లేదా మీ చుట్టు ప్రక్కల ప్రదేశాలను వారితో కలిపి సందర్శించండి. ఉత్తినే పైపైన చూసి వచ్చేయకుండా అన్ని భాగాలను బాగా చూడండి, ఏ విధంగా అంటే సభ్యులందరూ అన్నింటిని బాగా పరిశీలించగలిగే విధంగా చూడండి. మీరు ఆ ప్రదేశములో నడుస్తూ పరిసరాలను బాగా పరిశీలించండి వాటిని ఇతరులతో చర్చించండి మరియు వాటిని పటము మీద గుర్తుగా రాసుకోండి.

ఒక సమన్వయకర్తగా ఎక్కడైనా చర్చ సహజముగా కొనసాగకపోతేగనక అది కొనసాగే విధముగా చూసుకోవడము మీ ధర్మము. పటము కంటే కూడా ఈ పటము తయారు చేసే విధానము ఒక సాముహిక ప్రక్రియ కింద, అంటే ఏది పటము మీద ఉండాలి అనే దాని మీద చర్చించుకుంటూ, జరగడము ఎంతో ముఖ్యమైనది.

పటము మీద మీరు ముఖ్యమైన భవనములు, రోడ్లు మరియి ఇతర స్థిరాస్తులను (మరుగు దొడ్లు, నీటి పంపులు, గుళ్ళు, మైదానాలు, కుప్ప తొట్లు). వీటితో పాటు మీరు గమనించిన ఇతర ఆస్తులు ఏవైతే పాడుపడిపోయి పనిచేయని స్థితిలో ఉన్నాయో వాటిని కూడా లెక్కించాలి. పటము మీద వీటిని పెట్టే ప్రతిసారి అందరితో బాగా చర్చించండి. దీని మూలాన తరువాత వచ్చే వ్యతిరేకత మరియు ప్రతివాదనలు తగ్గుతాయి; మరియు ఇది చేసే పనిని పారదర్శకంగా ఉంచుతుంది.

గ్రామము లేదా చుట్టు ప్రక్కల ప్రదేశములు తిరిగి పరిశీలించిన తరువాత అందరు కలిసి ఒక ప్రదేశములో కూర్చుని (ఉదాహరణకి ఒక సౌకర్యామైనటువంటి పాటశాల భవనము) పరిశీలించినవాటి గురించి చర్చించుకుని పటమును పూర్తి చేయాలి. ఈ ప్రక్రియ ముఖ్యమైనది ఎందుకంటే ఈ పధ్ధతి ద్వారా మీరు ఏదైతే పారదర్శకతని పెంపొందించాలి అనుకుంటున్నారో దానిని ఇది నిలబెడుతుంది. ఈ పారదర్శకత అన్నది మీరు ప్రతి సమస్యను చర్చించి దానిని పటము మీద రాసుకున్నప్పుడే మొదలయింది.

ఈ పటమును మీరు వెల నిశ్చయించే పధ్ధతి యొక్క మరుసటి అధ్యాయము, అంటే గ్రామము లేదా చుట్టుప్రక్కల ప్రాంతము యొక్క పట్టిక/జాబితా తయారీలో వాడుకోవచ్చు.

సంఘము యొక్క పట్టిక/జాబితా:

పటము తయారు చేసిన రోజుగాని, లేదా దాని తరువాత ఎంత త్వరగా అయితే అంత త్వరగా సంఘము యొక్క పట్టిక తయారీని చేపట్టాలి.ఈ జాబితా యొక్క తయారీ కూడా అందరు పాల్గొని చేపట్టే విధముగా చూసుకోవాలి, అంటే సంఘములోని అందరు కలిసి ఈ పట్టిక యొక్క తయారీని చేపట్టాలి. ఒక సమన్వయకర్తగా ఈ జాబితాను మీకు మీరే తయారుచేయెద్దు ఇది మొత్తం ప్రక్రియ యొక్క ఉద్దేశాన్ని నాశనం చేస్తుంది. ఒక సమన్వయకర్తగా మరియు ఒక శిక్షకునిగా మీ పాత్ర ఏమిటో దానికి కావలసిన పద్ధతులు మరియు నియమాలను ఒకసారి మళ్ళీ తరచి చూసుకోవడానికి ఈ క్రింది అంశమును సంప్రదించండి మేధోమధనం.

వాదులాటలు మరియు జరుగుతున్నదాని మీద అభిప్రాయ వ్యక్తీకరణ లాంటి వాటిని ప్రోత్సహించవద్దు; అందరి నుంచి సేఖరించిన సమాచారమును బోర్డు మీద రాయండి; ఆ జాబితాలోని అంశాలను కిందకి పైకి తరువాత అందరి తోడ్పాటుతోటి మార్చుకోవచ్చు. వ్యక్తుల యొక్క వ్యక్తిగత సహకారము మీద దృష్టి కేంద్రీకరించవద్దు, విరుద్ధమైన వాదనలను ఆహ్వానించండి (ప్రతి సలహాను బోర్డు మీద రాయండి), మరియు చివరిలో ఇది ఆ సమూహముచే తయారు చేయబడిన వస్తువు, అంతేగాని ఎవరో వ్యక్తుల యొక్క లేక కొన్ని శక్తుల కోసం తయారు చేయబడినది కాదు అన్న విషయమును నొక్కి చెప్పండి.

సంఘములోని వివిధ సమూహములు లేక శక్తులకు వివిధ ఆందోళనలు ఉంటాయి అన్న విషయము గుర్తుంచుకోండి. స్థానికంగా ఉన్న పంతులుగారికి కొత్త స్కూలు అత్యంత ముఖ్యమైనదిగా కనపడవచ్చు. మగవారికి ఎరువుల సరఫరా ముఖ్యమైనది కావొచ్చు మహిళలకు తాగునీటి సరఫరా అత్యంత ముఖ్యమైనది కావొచ్చు. స్థానికంగా ఉన్న పూజారికి కొత్త ప్రార్ధనా మందిరం యొక్క నిర్మాణం ముఖ్యమైనదిగా కనపడవచ్చు, వేరే వ్యక్తులు లేక సముహములకు ఇలాగే ఏది ముఖ్యము అన్నదాని మీద వివిధ ఆలోచనలు ఉండవచ్చు. అందుకే సంఘమునకు ఏది ముఖ్యము అన్నదాని కోసం సంఘములోని కొంతమంది నాయకులను మాత్రమే సంప్రదించడం మంచి పధ్ధతి కాదు. అందుకే సంఘములోని వారు ఎంత మంది వస్తే అంత మందిని కలిపి ఒక పారదర్శకమైన సాముహిక ప్రక్రియ కింద చేపట్టడం వలన సంఘము యొక్క అవసరాల గురించి ఖచ్చితమైన విశ్లేషణ వస్తుంది.

ఖచ్చితత్వము కోసం ఆస్తులను మరియు సమస్యలను ఈ సంఘము యొక్క పట్టీలో చేర్చమని సలహా ఇవ్వండి. ఒక వేళ ఒక శుభ్రమైన మరియు బాగా ఉపయోగపడే మరుగు దొడ్డి ఒక మంచి ఆస్తి గనక అయితే దానిని పట్టీ/జాబితాలో పెట్టండి, అంటే ఉత్తి పాడయిన మరుగు దొడ్ల గురించి మాత్రమే కాకుండా బాగుండి మరియు ఉపయోగపడే వాటిని కూడా జాబితాలో ఉంచండి. పటమును సంప్రదించండి. దానిని ఒక గోడకు అతికించండి. పటము తయారు చేసే సమయములో కనుగొన్న ఆస్తులు మరియు అప్పుల గురించి అడగండి.

పేరులో ఏముంది?

మీరు ఈ సంఘము యొక్క వనరుల మరియు సమస్యల వెలనిశ్చయించే క్రముములో పిఆర్ఏ లేదా కొన్ని సార్లు పిఏఆర్ అన్న సంక్షిప్తనామాలనుచూసి ఉండవచ్చు. వీటికి వివిధ అర్ధములు మరియు నిర్వచనాలు ఉన్నాయి.

ఒకప్పుడు ఆర్ఆర్ఏ, రాపిడ్ రూరల్ ఎసేస్మేంట్ (గ్రామీణ ప్రాంతాల యొక్క వెలను వేగముగా నిశ్చయించుట) అనే పధ్ధతి ఉండేది. సంక్షిప్తముగా చెప్పాలి అంటే దీనిని ఎప్పుడు వాడేవారు అంటే ఒక సహాయము అందించే సంస్థ ఒక బాగా ఖరీదైనటువంటి పాశ్చాత్య నిపుణుడిని పిలిపించి, అతనిని ఒక విమానములో తెప్పింఛి, పని జరిగే వరకు ఒక ఖరీదైనటువంటి అయిదు నక్షత్రాల విడిదిలో ఉంచి అతని చేత అవసరములను నిశ్చయింపచేసి దానిని ఒక పత్రములో రాయించుకుని వారి సంస్థ చేసే పనులు జనాలకు న్యాయము చేస్తున్నాయి అని చెప్పుకొనేవి. ఆ నిపుణుడు మహా అయితే సంఘములోని కొంత మంది పెద్దలను సంప్రదించి తన చివరి నివేదిక తయారు చేసేవాడు.

ఈ ‘పై నుండి కిందకి’ అన్న ప్రక్రియకి వ్యతిరేకముగా ప్రస్పుటంగా తెలిసినది ఏమిటంటే (ముఖ్యముగా కార్యకర్తలకు) ఇలాంటి వెల నిశ్చయించే పధ్ధతి గనక అందరిని కలుపుకొని మరియు కొంత వేగము తగ్గించి గనక చేపట్టినట్టయితే మరింత ఖచ్చితత్వము కలిగి ఉంటాయి అని.

మరియు సామాజిక శాస్త్రవేత్తలు తెలుసుకున్నది ఏమిటి అంటే సంఘములోని వారు గనక నిర్ణయాలు తీసుకునే విషయములో మొదటి నుంచి పాల్గోనట్టయితే చేపట్టిన పని యొక్క భాద్యతని స్వీకరిస్తారు మరియు దాని నిర్వహణ పట్ల శ్రద్ధ వహిస్తారు. మొత్తము సంఘము గనక ఈ ప్రక్రియలో పాల్గొంటే ఆ ప్రక్రియ కొంత మందిని మాత్రమే సంప్రదించే పధ్ధతి కంటే కూడా మరింత చట్ట బద్ధత కలిగినది అవుతుంది.

అందుకని దీని కోసం ఒక సంక్షిప్త నామం పిఆర్ఏ అని తయారు చేసారు. ఈ సంక్షిప్త నామం దాని పూర్తి నామం కంటే కూడా బాగా ఖచితత్వము కలిగి ఉండేది: పార్టిసిపేటోరి రూరల్ అప్ప్రైసల్ (గ్రామాల్లోని అందరు కలిసి వెల నిశ్చయించుట), పార్టిసిపేటోరి రీసర్చ్ అండ్ అసెస్మెంట్ (అందరు కలిసి వెల నిశ్చయించుట మరియు పరిశోధన). ఆ రెండు పూర్తి నామాల్లోను పోలిక ఏమిటంటే ప్రక్రియ అందరు పాల్గొనే విధముగా ఉండాలి అన్నది. కొంత మంది ఈ పిఏఆర్ యొక్క వివిధ నిర్వచనాలను చూసి దానిని వాడకుండా ఒక కొత్త సంక్షిప్త నామము తయారు చేసారు, అదే పిఏఆర్.

కాకపోతే దీనికి కూడా చాలా నిర్వచనాలు వచ్చినాయి, పార్టిసిపేటోరి యాక్షన్ రీసర్చ్ అన్న దానితో కలుపుకుని, కాని ఈ పిఆర్ఏ మరియు పిఏఆర్ రెండు కూడా నొక్కి చెప్పే విషయం ఏంటంటే అందరు పాల్గొనాలి అని మరియు పాల్గొనటం అంటే కొంత మంది పెద్దలు పాల్గొనటం మాత్రమే కాకుండా సంఘములోని అందరు పాల్గొనే విధముగా మరియు వెల నిశ్చయించే ప్రక్రియ సంఘములోని అన్ని అవసరాలను మరియు సామర్థ్యాలను స్పృశించే విధముగా ఉండాలి అని.

సమాచారము ఎవరి కోసం?

ఇలా కొంత మంది అనటం మీరు విని ఉండవచ్చు, ప్రత్యేకముగా సాంఘిక ప్రాజెక్టులలో లేని కార్యనిర్వాహణాధికారులు (ఉ.దా: ఇంజినీర్లు, కేంద్ర పాలకులు) ఈ సంఘము యొక్క వెల నిశ్చయించడం అనవసరం అని అనవచ్చు. “మా దగ్గర సామాజిక అంశముల మీద జరిగిన పరిశోధన ఉంది, మళ్ళీ అదే పనిని ఈ గ్రామ జాబితా ద్వారా తెలుసుకోవడము ఎందుకు?” అనేది వారు సాధారణంగా చూపే సాకు. మిమ్మల్ని పిలిచి ఈ జాబితా తయారీ అనే అంశము ఎందుకు ముఖ్యము అని ప్రశ్నించవచ్చు, ఒక వేళ మీరు గనక ఏదైనా ఒక అంశానికి సంబంధించిన ప్రాజెక్టులో (ఉ.దా నీటి పంపిణీ) పని చేస్తూ వుంటే గనక ఈ ప్రశ్న అడిగేటందుకు ఆస్కారం ఎక్కువ. కార్యనిర్వాహణాధికారులు భౌతికమైనటువంటి ఫలితాలు త్వరగా రావాలి అని తొందర పడుతూ ఉంటారు (నీటి పుంపు నిర్మాణము లాంటివి) మరి అందరూ పాల్గొని వెల నిశ్చయించే పని సమయమును ఎక్కువ తీసుకుంటుంది.

ఈ పటము తయారి మరియు జాబితా/పట్టిక తయారీ అనే పనుల ద్వారా, సంఘములోని అందరూ పాల్గొని, సేకరించిన సమాచారము ఇంతకు ముందర వేరే పద్ధతుల ద్వారా సేకరించిన సమాచారమునకు నఖలుగా ఉండవచ్చు లేదా కొత్త అంశాలను కూడా కలిగి ఉండవచ్చు. ఈ పధ్ధతి ద్వారా సేకరించిన సమాచారము ఏదో ఒక సంస్థ లేదా ప్రాజెక్టు, ప్రణాలికలు తయారు చేసుకోవడం కోసం అని అనుకోవడం చాలా తప్పు. ఈ వెల నిశ్చయించే పధ్ధతి యొక్క ముఖ్య ఉద్దేశ్యము మొత్తము సంఘములోని వారందరినీ నిర్ణయము తీసుకోవడములో పాలుపంచుకునేలా చేయడము కోసము. మరియు భవిష్యత్తులో నిర్మించబడే ఏవైనా ఆస్తుల యొక్క భాద్యత వారు తీసుకునే విధముగా వారిని ఉత్తేజ పరుచుట కోసము.

అలాగే ఈ సేఖరించిన సమాచారము ఇతర పద్ధతుల (కింది స్థాయిలో జరిగిన సమాచార సేకరణ, జనాభా లెక్కలు, మరియు ఇతర రిపోర్ట్లు) ద్వారా సేకరించిన సమాచారముకు బాగా తోడ్పడుతుంది దాని మూలముగా అక్కడ ఉన్న పరిస్తితి యొక్క వాస్తవ స్తితిగతుల గురింఛి ఒక ఖచ్చితమైన అవగాహన కలుగుతుంది. ఒక సమన్వయకర్తగా మీరు ఈ సమాచారమును మీ సంస్థకు గాని లేక మీ ప్రాజెక్టుకు గాని, జిల్లా లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ముఖ్యముగా ఎవరైతే పథకములు రచిస్తున్నారో, సాంఘికాభివ్రుద్ధి మరియు కార్యనిర్వహణలో ఉన్నారో వారికి ఇవ్వటం మూలముగా సమాజములో బీదరికము నిర్మూలించడానికి మరియు ఒక శక్తివంతమైన సమాజమును నెలకొల్పటానికి సహకరించిన వారు అవుతారు.

సమాజములోని సభ్యులకు శిక్షణనివ్వడం:

ఏవైతే సమాజాలలో బీదరికము ఎక్కువగా ఉంటుందో మరియు ఎక్కువగా అణగారిన ప్రజలు ఉంటారో అలాంటి సంఘములోని ప్రజలకు కలిసికట్టుగా పాల్గొని సంఘము కోసం నిర్ణయాలు తీసుకునే పద్ధతి సరిగా తెలిసి ఉండదు. ఎక్కువ మందికి ఈ పటము తయారీ మరియు జాబితా తయారీ పద్ధతులు కూడా సరిగ్గా తెలియవు, మరియు దానిలో ఎక్కువ మందికి చదవడం రాయడం కూడా తెలిసి ఉండదు. వారు కలిసికట్టుగా పాల్గొని సంఘమును శక్తి వంతముగా తయారు చేయడానికి కావలసిన సామర్థ్యాలు ఇవే. అలాంటప్పుడు, పధ్ధతి ప్రకారం ఇచ్చే శిక్షణ ఇక్కడ సమాధానము కాదు.

అలాంటప్పుడు ఒక సమన్వయకర్తగా మీరు సంఘములోని ప్రజలకు ఇవేంటో తెలియచెప్పడానికి మీకు మీరే వాటిని పాటించి చూపిస్తారు. అన్నిటికంటే ముఖ్యముగా మీరు వారిని పాల్గొనే విధముగా ఉత్తేజ పరచడం వలన వారి మీద వారికి నమ్మకం కలుగుతుంది మరియు వారిని సంఘము యొక్క అభివృద్ధిలో పాల్గొనే విధముగా ఉత్తేజ పరుస్తుంది.

ఈ పద్ధతిని పాటించడం వలన సంఘములోని సభ్యులు కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారు అని గుర్తుంచుకోండి మరియు చేసే పని పారదర్శకంగా ఉండే విధముగా చూసుకోండి. సంఘములోని సభ్యులకు ఈ వెల నిశ్చయించే పని చేపట్టడానికి కావలసిన నైపుణ్యాలు పెద్ద కష్టమైనవి ఏమీ కాదు. సాధారణంగా అయితే, సంఘములోని సభ్యులు ఈ పద్ధతిలో పాల్గొనటానికి ఆశక్తి చూపుతారు మరియు ఈ నైపుణ్యాలను పని చేస్తునప్పుడు సులువుగానే నేర్చుకుంటారు. మీ పని వారు నేర్చుకునే విధముగా సహకరించడము.

సంఘములోని సభ్యులు ఈ వెల నిశ్చయించుటలో పాల్గొనటం ద్వారా వచ్చే ఫలితము, పాల్గొనే ప్రక్రియకు బీజము వేసే అంశము కంటే కూడా ఎంతో ఎక్కువగా ఉంటుంది. వారు నిశ్చయించిన అంశముల యొక్క ఫలితములు ఒక ప్రామాణిక గీత లాగా లేదా అభివృద్ధిని కొలవడినికి ఉపయోగపడే సమచారములాగా మరియు దానిని సంఘమును కొలిచి దాని విలువ నిశ్చయించడానికి ఉపయోగపడే ఒక అంశములాగా ఉపయోగపడుతుంది.

ఇక్కడి నుంచి ఎక్కడికి?

సంఘములోని ప్రజలను సంఘము యొక్క వెల నిశ్చయించడానికి లేదా దానిని అంచనా వేయడానికి ఎలా ఉత్తేజ పరచాలి అన్నది ఈ పత్రిక చూపిస్తుంది. మీ పని ఆసాంతము సంఘములోని అందరూ పాల్గొనే విధముగా సంఘములోని వారిని ఉత్తేజ పరచాలి అంతేగాని కొంతమంది వ్యక్తులు లేదా కొన్ని శక్తులు మాత్రమే పాల్గొనే విధముగా చూసుకోకూడదు.

సాధారణంగా అన్ని శిక్షణా పద్ధతులలోను కూడా అందరూ పాల్గొనే విధముగా చూసుకునే పధ్ధతి, దేంట్లో అయితే శిక్షకుడు సమన్వయకర్తగా మాత్రమే ఉంటాడో అంతేగాని ఒక లెక్చరర్ గా ఉండదో అక్కడ అది, మంచిది. కానీ పిఏఆర్/పిఆర్ఏ పధ్ధతి అన్ని చోట్లా గుడ్డిగా వాడకూడదు.

ఎక్కడైతే కొన్ని ప్రత్యేకమైన నైపుణ్యాలు అవసరమో ముఖ్యముగా ఎక్కడైతే పాల్గొన్న వాళ్ళు అలాంటి నైపుణ్యాలను గుర్తించారో అలాంటి చోట్ల ఇతర పద్ధతులను అవలంబించడం మంచిది, ఉ.దా. ప్రదర్శించడం, చూపించడం, మరియు సంభాషించడం. ఇది చెప్పిన మీదట, అభ్యాసము పొందేవారిని పని చేస్తూ నేర్చుకునే విధముగా ప్రోత్సహించాలి.

కమల్ ఫుయాల్ గారిచే రాయబడిన వ్యాసమును చూడండి “పిఆర్ఏ ఎందుకు,” మరియు దోరీన్ బోయ్ద్ గారిచే రాయబడిన వ్యాసమును చూడండి “పిఏఆర్ పధ్ధతి యొక్క ఉపయోగాలు."

ఈ అంశము మీద మరింత చర్చ కోసము రాబర్ట్ చేంబెర్స్ గారిచే రాయబడిన ప్రతులను చూడండి.

––»«––

సంఘము యొక్క పటము తయారు చేయడము:


పటము తయారు చేయటము

© ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ భర్ట్లె
వెబ్ రూపకర్త లోర్డస్ సడా
––»«––
చివరగా మార్చబడిన తేది: 2011.12.18

 హోం పేజి

 వెల నిశ్చయిన్చుటలో పాల్గొనుట