మొదటి పెజి
 పిఎఆర్/పిఆర్ఎ




అనువాదములు:

'العربية / al-ʿarabīyah
বাংলা / Baṅla
Català
中文 / Zhōngwén
Deutsch
English
Español
Filipino/Tagalog
Français
Ελληνικά / Elliniká
हिन्दी / hindī
Italiano
بهاس ملايو / Bahasa Melayu
Polszczyzna
Português
Română
తెలుగు /Telugu
Tiếng Việt

                                        

మిగితా పాజీలు

విభాగాలు

స్థల పటములు

ముఖ్యమైన పదాలు

సంప్రదించ వలసిన చిరునామా

అవసరమైన పత్రాలు

అవసరమైన అనుసందానములు

వెల నిశ్చయించుటలో పాల్గొనుట యొక్క పద్ధతులు

పిఏఆర్/పిఆర్ఏ పద్ధతులు మరియు మెళకువల యొక్క పునఃసమీక్ష

రచన ఫిల్ బార్ట్లే, పిహెచ్డి

అనువాదకులు పి. నిరుపమ ప్రతాప రెడ్డి


సమన్వయకర్తలు సంప్రదించి చదువుకోవడము కోసము

పిఏఆర్/పిఆర్ఏ పద్ధతులు మరియు మెళకువలు యొక్క పునఃసమీక్ష

పిఆర్ఏ (గ్రామములోని అందరూ కలిసి వెల నిశ్చయించుట) అన్న సంక్షిప్త నామము మొదట చూసినప్పుడు తప్పు దారి పట్టించే విధముగా ఉండవచ్చు, ఎందుకంటే దాంట్లో “గ్రామము” అన్న వాక్యము వున్నా కూడా ఈ పద్ధతిని నగర ప్రాంతాలలో మరియు గ్రామ ప్రాంతాలలోను వాడుకోవచ్చు మరియు దాంట్లో “వెల నిశ్చయించుట” అని మాత్రమే వున్నా కూడా దానిని వెల నిశ్చయించే స్థాయి నుంచి ప్రణాళికా మరియు ప్రాజెక్టు లక్ష్యము మరియు స్వరూపము యొక్క తయారీ స్థాయిలలో కూడా వాడుకోవచ్చు.

ఈ పధ్ధతి మొత్తములో ఎటువంటి మార్పూ లేకుండా తటస్థముగా ఉన్న అంశము ఏమిటీ అంటే “పాల్గొనుట”. దాని అర్ధము సంఘములోని సభ్యులు అందరూ (పల్లెటూరులు లేదా పట్టణ ప్రాంతాలలోని వారు) లేదా ఒక సంస్థలోని సభ్యులుగానీ పాల్గొనటం అని.

ఎవరైతే ఎక్కువగా ముందుకు వచ్చి మాటలాడరో వారి భావాలు అందరూ వినే విధముగా మీరు కృషి చేయాలి. ఒక సమన్వయకర్తగా మీరు ఆ పద్ధతికి కొంత ఆకారం మరియు కొంత ఉత్తేజం ఇవ్వాలి అంతేగాని ముఖ్య విషయం అన్నది మాత్రం సభ్యులు అందరూ కలిసి ఎంచుకున్నదిగానే వుండాలి. సమాచార సేకరణ మరియు దాని విశ్లేషణ అన్నవి ఈ కార్యక్రమములో పాల్గొనే సభ్యులు మీ యొక్క సహకారముతో చేయాలి. మీ సహకారం మాత్రమే వుండాలి అంతేగాని అంశములు అన్నీ మీ పూర్తి నియంత్రణలో జరగకూడదు.

వెల నిశ్చయించుటలో పాల్గొనుట ప్రక్రియలోని పద్ధతులు:

ఈ వెల నిశ్చయించుటలో పాల్గొనుట అను ప్రక్రియను నిర్వహించడానికి ఎన్నో రకాల పద్ధతులను అనుసరించవచ్చు. మీ పనిలో భాగముగా మీరే కొన్ని మీ స్వంత పద్ధతులను తయారు చేసుకుంటారు, వాటిని మారుస్తూ వాటిలోంచి కొన్నింటిని తీసుకుంటూ ముందుకు సాగుతూ వుంటారు.

మీరు మొదలు పెట్టడానికి ఇక్కడ కొన్ని పద్ధతులను సూచిస్తున్నాము. వాటిని మీ యొక్క వినియోగదారుల సమూహమును బట్టీ, ప్రాంతాన్ని బట్టీ, సమయాన్ని బట్టీ మరియు పాల్గొంటున్న వారి పరిస్థితులు మరియు వారి స్వభావాన్ని బట్టీ మీకు కావలసిన విధముగా మార్చుకోండి.

పటము తయారీ:

ప్రక్రియను మొదలు పెట్టడానికి పటము తయారీ అన్న అంశము ఎంచుకోవడము మీకూ మరియు సంఘమునకూ మంచిది. సంఘమును చూడటానికి ఒక సమూహముతో కలిసి ఆ పరిసరాలలో నడవండి మరియు ఆ సమూహముతో ఆ ప్రాంతము యొక్క పటము తయారు చేయించండి. ఆ పటములో సాంఘిక ఆస్తులు, సొంత మరియు కుటుంబానికి సంబంధించిన భవనాలు, ఆస్తులు మరియు అప్పులు అన్నింటిని పొందుపరచాలి. వారి కోసం మీరు పటమును గీసి పెట్టకండి.

ఒక పధ్ధతి ఏమిటంటే ఒకొక్కరిగా కానీ లేదా చిన్న చిన్న గుంపులుగా కానీ విడివిడిగా ఎవరి పటము వారు తయారు చేయడము, ఆ తరువాత ఒక సమూహముగా చేరి ఈ ప్రక్రియను చేపట్టడము, అంటే అన్ని చిన్న గుంపులు కలిసి ఒక పెద్ద పటము తయారు చేయడము (ఉదాహరణకి పత్రికలకు ఉపయోగించే కాగితముగానీ లేదా చార్టు పేపర్ గానీ ఉపయోగించి తయారు చేయడము).

శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి తయారు చేసిన పటముల కంటే కూడా ప్రజల ద్వారా తయారు చేయబడిన పటముల ద్వారానే మరింత విలువైన సమాచారమును పొందవచ్చు. ఆ పటములు ఆ పటమును తయారు చేసిన మనిషి యొక్క ఆలోచనలను ప్రతిబింబిస్తుంది మరియు వారు తయారు చేసిన పటముల ద్వారా ఆ ప్రాంత ప్రజలకు ఆ ప్రాంతములో వున్న వనరుల గురించి, భూమిని ఎలా వాడుతున్నారు మరియు ఎక్కడెక్కడ జనావాసాలు వున్నాయి అన్న సమాచారము గురించి లేదా గృహములు మరియు గృహములలో వున్న వారి పద్ధతులు మరియు ఇతర విషయాల గురించి తెలిసిన విలువైన సమాచారము లభ్యమవుతుంది.

దీని తరువాత చెప్ప బడినటువంటి పటములు మరియు నమూనాలలో, మీరు సంఘములోని సభ్యులను పటమును కర్రలతోటి నేల మీద గీతలు గీసి చూపమని ఉత్తేజితులను చేయవచ్చు. నేల మీద పటము గీయడము అన్నది ఒక గోడ మీద పేద్ద పటము గీయడములాగనే మీకూ మరియు పాల్గొన్న వారికీ ఈ గీసే ప్రక్రియని ఒక సాముహిక ప్రక్రియ కింద చేపట్టడానికి ఉపయోగపడుతుంది.

నమూనాలు:

ఒక వేళ సంఘములోని సభ్యులు గనక ఆ నేల మీద గీసిన పటమునకు కర్రలను మరియు రాళ్ళను కూడా జత చేసారు అంటే (అంటే ఉదాహరణకు ఏదైనా ప్రదేశాలను లేదా ఇతరత్రా అంశాలను కర్రలు లేదా రాళ్ళతో గుర్తుగా పటముమీద చూపితే) వారు ఒక చిన్న నమూనాను తయారు చేస్తున్నారు అని అర్ధము: 3డి పటము.

మీరు పటమునుగానీ నమూనానుగానీ అక్కడ పాల్గొన్న వారికి చేసి పెట్టొద్దు; వున్న వారందరినీ ఎంతోకొంత పాలుపంచుకోనేలా ఉత్తేజితులను చేయండి. వారిని గమనిస్తూ ఏవైనా కొన్ని వసతులు మిగతా వాటికంటే ముందే తయారు చేసారా, ఏవైనా కొన్ని మిగతా వాటికంటే పరిమాణములో పెద్దవిగా వున్నాయా అనే అంశాలను గుర్తుగా రాసుకోండి. దీని వలన మీకు పాల్గొన్న వారికి ఏ అంశము ముఖ్యమో మరింత బాగా అర్ధము అవుతుంది.

అన్నీ రాసిపెట్టుకోండి; అది మీకు ఆ సంఘము యొక్క సామాజిక స్థితిగతులను అర్ధము చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అక్కడ ప్రజలు గీసిన పటమును లేదా నమూనాను ఒక కాగితము మీద గీసి దానిని భద్రపరచండి. పటములు మరియు నమూనాలు మీరు భవిష్యత్తులో సంఘములోని పరిసరాలలో ఎక్కడ నడిచి చూడాలి లాంటి అంశాలకు దోహదపడుతుంది, దాని వల్ల మరింత ఎక్కువ సమాచారమును నమోదు చేసుకొనవచ్చు,

సంఘము యొక్క పట్టిక/జాబితాను తయారుచేయడము:

పట్టిక/జాబితా మరియు ప్రత్యేకించి దానిని తయారు చేసే ప్రక్రియ అన్నది వెల నిశ్చయించుటలో పాల్గొనుట అన్న ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన అంశము.

సాంఘిక పట్టిక/జాబితా తయారీ ప్రక్రియను కొన్ని సార్లు ఒక పాక్షిక పధ్ధతి కలిగిన ముఖా ముఖీ సమావేశం కింద అభివర్ణించవచ్చు. ఒక వేళ ఇది గనక పూర్తిగా పద్ధతిలేని ప్రక్రియ కింద వున్నట్టయితే ఒక దారి తెన్నూ లేని సంభాషణ కింద జరిగి ఎటువంటి ఫలితము రాదు. దీనికి భిన్నముగా, మేదోమధనం అన్న ప్రక్రియ ఎంతో పధ్ధతితో కూడుకున్నది (మేదోమధనం యొక్క ఉపయోగాలు దానికి వున్నాయి, ప్రత్యేకముగా ప్రస్తావించాలి అంటే సంఘమును శక్తివంతము చేయు ప్రాజెక్టుల యొక్క ప్రణాళిక రచించే దశలో దీని ఉపయోగము వుంటుంది). పటము తయారీ అన్నది ఈ రెండు పద్ధతులకు మధ్యలో వుంటుంది. మీరు ఆ చర్చను కొంత స్వేచ్చాయుత వాతావరణంలో జరగనివ్వాలి, ముఖ్యముగా సభ్యులను ఆ పట్టిక/జాబితా తయారీలో ఎవరి పాత్ర ఏమిటి అన్న అంశమును విశ్లేషించేటప్పుడు.

మీరు ఒక స్పష్టంగా నిర్వచించబడినటువంటి ప్రశ్నా పత్రముతో పని చేయరు, కాకపోతే మంచి పధ్ధతి ఏమిటంటే మీరు పూర్తి చేయాలనుకుంటున్న విషయముల గురించి ఒక సమగ్ర జాబితా తయారు చేసుకుని దానిని ఆసరాగా చేసుకుని పనిచేయడం. మీరు ఈ జాబితా తయారు చేసుకొనేటప్పుడు సంఘము యొక్క ఆస్తులను మరియు అప్పులను కూడా అందులో పొందుపరచే విధముగా జాగ్రత్తపడాలి. అందుబాటులో వున్న వసతులు గురించి, అవి ఎంత బాగా పనిచేస్తున్నాయి లేదా ఏవి పని చేయటములేదు అన్న విషయములతో కూడి నమోదు చేయాలి. వాటితో పాటు ప్రస్తుత మరియు భవిష్యత్తులో సాధ్యమైనటువంటి సంఘములోని వారి యొక్క శక్తులు మరియు అవకాశాలు మరియు, అపాయములు మరియు అడ్డుల గురించి నమోదు చేయాలి. ఒకటి గుర్తుంచుకోండి ఏమిటంటే ఇది ఒక వెల నిశ్చయించే ప్రక్రియ అని.

సంఘము యొక్క బలాలు మరియు బలహీనతలు నిశ్చయించగలిగేటటువంటి పట్టిక/జాబితా తయారీని లక్ష్యముగా పెట్టుకోండి. మీ పని పట్టిక/జాబితా తయారు చేయడము కాదు, సంఘములోని సభ్యులకు మార్గనిర్దేశము చేసి వారి చేత ఒక సాముహిక ప్రక్రియ కింద దానిని తయారు చేయించడము మీ పని.

ఒక విషయము మీద కేంద్రికరించబడిన చర్చా గోష్టి:

సంఘములోని సభ్యులకు ఒకొక్కరికి ఒక్కో విధమైన అనుభవాలు మరియు ఒక్కో విధమైన అభిప్రాయాలు వుండవచ్చు లేదా బయటి వ్యక్తులకుగానీ లేదా సంఘములోని ఇతరులకుగానీ తమకు తెలిసిన సమాచారమును పంచడము సున్నితమైన అంశము కావచ్చును. ఇలాంటి చోటనే ఒక విషయము మీద కేంద్రికరించబడిన చర్చా గోష్టి అన్నది ఉపయుక్తముగా వుంటుంది. ఇలాంటి చోట మీరు వంటరిగా పనిచేయకపోవడం మంచి పధ్ధతి, ఇద్దరు లేదా ముగ్గురు సమన్వయకర్తలు జట్టుగా దీనిని చేపట్టడం మంచిది, ఒకరు చర్చకు నాయకత్వం వహిస్తారు వేరొకరు జరిగిన దాన్ని నమోదు చేసుకుని భద్రపరుస్తారు.

చర్చకు స్వీకరించే అంశాలు సంఘము యొక్క పట్టీ/జాబితాలో వున్న అంశములకంటే తక్కువగా వుండాలి. మొదట వివిధ రకముల ఆసక్తులున్న సమూహములను విడివిడిగా సమావేసపరిచి వారు చేసిన పనులను జాగ్రత్తగా నమోదు చేసుకోండి, తరువాత ఆ సమూహాలన్నిటిని దగ్గర చేర్చి వారికి వున్న ఇతర ఆందోళనలను అందరితో పంచుకుని నివృత్తి చేసుకునే వీలును కల్పించండి. ఇక్కడ జాగ్రత్త పాటించడము ఎంతో ముఖ్యము. మీరు సంఘములోని వివిధ రకముల ఆసక్తులున్న సమూహములను గుర్తించాలి, అలాగే వారి మధ్య భేదాభిప్రాయాలు పెరుగుటకు మీరు కారకులు కాకూడదు – అంటే వారి మధ్య అగాధం పెరిగేలా చేయకూడదు.

ఈ శిక్షణా ప్రతిని చూడండి, ఐక్యతను ఏర్పాటు చేయడం.

మీరు అన్ని సమూహాలను ఒకేలా తయారు చేయడానికి కృషి చేయటంలేదు, కాకపోతే సామరస్య పూర్వక వాతావరణం పెంపొందించడానికి మరియు ఒకరినొకరు అర్ధం చేసుకొనే విధముగా మరియు ఒకరికొకరు పరస్పరం సహకరించుకునే విధముగా తయారు చేయడానికి కృషి చేస్తున్నారు. ప్రత్యేకమైన విషయముల మీద కేంద్రికరించబడిన చర్చాగోష్టులు మీకు వివిధ రకముల ఆసక్తులున్న సమూహములతో (ఏవైతే మొదట కలిసికట్టుగా పని చేయడానికి ఇష్టపడవో) విడివిడిగా పని చేయడానికి ఒక అవకాసం ఇస్తుంది; కానీ మీరు చివరికి అన్ని సమూహాలను దగ్గరకు తీసుకురావటానికి కృషి చేయాలి.

ఇష్టాఇష్టాలను ప్రాముఖ్యత ఆధారముగా నమోదు చేయడము:

మీరు వివిధ రకముల ఆసక్తులున్న సమూహములతో కూడిన ఒక సంఘములో పని చేస్తునప్పుడు, వివిధ సమూహముల యొక్క ఇష్టాఇష్టాల ప్రాముఖ్యతలను విడి విడిగా నమోదు చేసుకుని, అన్ని సమూహములను దగ్గర చేర్చిన తరువాత అన్ని అంశములను ఒకటిగా చూడవచ్చు.

ఒక సామూహిక ముఖా ముఖీ చర్చా గోష్టిని, ఇష్టాఇష్టాలను ప్రాముఖ్యత ఆధారముగా నమోదు చేయడము అన్న ప్రక్రియ ద్వారా ప్రారంభించడం ఒక మంచి పధ్ధతి మరియు ఇది చర్చకి ఒక దిశను నిర్దేశిస్తుంది.

సంపద స్థాయిలను నమోదు చేయడము:

(1) సంఘములోని సభ్యులు బీదరికాన్ని ఎలా నిర్వచిస్తారు అనే విషయము తెలుసుకోవడానికి, (2) సమాజములో అట్టడుగున వున్న వారు ఎవరు అని తెలుసుకోవడానికి మరియు (3) సమాజములో సంపద స్థాయిలను తెలుసుకోవడానికి ఇది ఒక ఉపయుక్తమైన పధ్ధతి.

ఒక మంచి పధ్ధతి ఏమిటంటే సంఘములో వున్న ప్రతీ కుటుంబం పేరు మీదా ఒక కార్డు తయారు చేయండి. సంఘములోని కొంత మంది సభ్యులను ఎంచుకోండి. వారిని ఆ కార్డులను వారి సంఘములోని సంపదల స్థాయిని బట్టి వివిధ వరసల్లో పేర్చమనండి మరియు ఎందుకు అలా పేర్చారో దానికి గల కారణాలను ఇవ్వమనండి. వారు సభ్యులను ఎలా వర్గీకరిస్తున్నారో, మరియు వారు ఎన్నుకున్న విభజనకి గల కారణాలు ఏమిటో మరియు సంఘములోని కుటుంబాలను వివిధ వర్గాలలో చేర్చడానికి గల కారణాలు ఏమిటో తెలుసుకుంటే ఆ సమాజము యొక్క సామాజిక మరియు ఆర్ధిక నిర్మాణము గురించి చాలా విషయాలు తెలుస్తాయి.

రుతు ప్రకారమైన మరియు చరిత్రపరమైన రేఖాచిత్రమును తయారు చేయుట:

కార్యక్షేత్రమును చాలా తక్కువ నిడివిలో దర్శించి వస్తే రుతు ప్రకారమైన మరియు చరిత్రకు సంబంధించిన మార్పులను మరియు సూచీలను గుర్తించకపోవడానికి ఆస్కారం ఎక్కువగా వుంటుంది.

మీరు వివిధ రకములైన రేఖాచిత్రలేఖన పద్ధతులను ఇక్కడ వాడి చూడవచ్చు. వాటి వలన మీరు ఈ క్రింది విషయాలను శోధించవచ్చు: వర్షపాతము, కూలీకి గిరాకీ, పోలం పనులకు సంబంధించిన వివిధ ప్రక్రియలు (చేపలు పట్టడం, వేటాడటం, పశువులను మేపడం), వంట చెరుకు లభ్యత, రోగాలు వచ్చే సమయాలు, ఉద్యోగము కోసము వలసపోవటము, ఆహార నిలువలు మరియు సమయముతో మార్పు చెందే ఇతర అంశాలు. మీరు రూపొందించే రేఖా చిత్రాలు ఏవైతే వుంటాయో వాటిని ప్రజలకు కలిగే మార్పులు మరియు వాటివలన కలిగే చిక్కులు లాంటి వాటి గురించి చర్చించడానికి ఉపయోగించవచ్చు.

సంస్థాగత పటము తయారీ:

ఒక సంఘము యొక్క సమన్వయకర్త సామాజిక శాస్త్రవేత్తలాగా, ఒక ప్రాక్టిసు వున్న సామాజిక శాస్త్రవేత్తలాగా, వుండాలని మీకు కొన్ని చోట్ల చెప్పి వుంటారు. ఒక సంఘములోని సామాజిక కూర్పును గురించి సమాచారము మరియు వివిధ సామాజిక సమూహముల యొక్క స్వభావాల గురించి సమాచారమును ఆ సంఘమును తక్కువ నిడివిలో దర్శించి రావడము వలన తెలియదు. సంఘములోని ధనికులు మరియు పేదవారి మధ్యా, కుటుంబ సంబంధాలు మరియు కలహాల మధ్యా, మరియు రాజకీయ సమూహాల మధ్యా వున్న క్లిష్టమైన సంబంధాలను కొన్ని వారాల వ్యవధిలో అర్ధము చేసుకోలేము. వెల నిశ్చయించుటలో పాల్గొను ప్రక్రియ తాలుకా పద్ధతులను ఇక్కడ వాడడం కొంత ఉపయుక్తముగా వుంటుంది.

సమాజములోని వివిధ అంశాల మధ్య వున్న సంబంధాలలో సున్నితవంతం కాని విషయాలను అర్ధం చేసుకోవడానికి ఒక పధ్ధతి ఏమిటంటే కొంత మంది ప్రధాన సభ్యుల చేత ఒక వెన్ రేఖా చిత్రాన్ని రూపొందించడం. ఈ పధ్ధతి చాలా సులువైనది, కొన్ని వృత్తాలను పేర్చడం అన్నదే ఈ ప్రక్రియ, ప్రతి వృత్తం ఒక ప్రత్యేకమైన సమూహాన్ని గానీ లేదా ఒక సంస్థని గానీ, ఏవైతే క్రియాశీలకంగా పనిచేస్తున్నాయో వాటికి గుర్తుగా వుంటుంది. వృత్తం యొక్క పరిమాణము బట్టి సంఘములో ఆ సమూహము యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది – చిన్న వృత్తం అంటే తక్కువ ప్రాముఖ్యత కలిగిన సమూహము అని లెక్క. రెండు వృత్తాలు ఒకదాని మీద ఇంకొకటి ఎంతగా పడతాయో దాని బట్టి ఆ రెండు సమూహాలు ఎంతగా కలిసి పనిచేస్తున్నాయో (లేదా ఎంతగా కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నాయో) తెలుస్తుంది.

ఎప్పుడు ఈ పద్ధతులను వాడాలి అన్నది తెలుసుకోండి:

సంఘములోని అందరూ పాల్గొని వెల నిశ్చయించాల్సి వచ్చినప్పుడు ఈ పిఆర్ఏ/పిఏఆర్ పద్ధతులు అంచనాలు మరియు వెల నిశ్చయించుటకు ఎంతో ఉపయోగకరముగా ఉంటాయి. అంతేకానీ సంఘమును శక్తివంతముగా చేయు ప్రక్రియలోని అన్ని స్థాయిలకు ఇది అంతగా ఉపయోగపడకపోవచ్చు.

ఉదాహరణకు నైపుణ్యమును బదలాయించడము అన్నది మీ అవసరముగా గుర్తించినప్పుడు ఇది అంత మంచి పధ్ధతి కాదు. శిక్షణ (నైపుణ్యము బదలాయింపు కొరకు) అందరూ పాల్గొనే ప్రక్రియే కావొచ్చు, అంటే శిక్షణ తీసుకొనేవారు పని చేస్తూ నేర్చుకోవచ్చు, కానీ పిఆర్ఏ/పిఏఆర్ పద్ధతులను పాటించడము మూలంగానే కాదు.

సంఘములోని ప్రజలకు విషయాన్ని తెలుపడానికి మనము కొన్ని రూపకాల ద్వారాను, పిట్ట కథల ద్వారాను మరియు సామెతల ద్వారాను తెలియచేస్తాము. అలాంటి ఒక చిన్న ఇంగ్లీషు సామెత ఏమిటంటే “కోడి దగ్గరకెళ్ళి పాలను, ఆవు దగ్గరకెళ్ళి గుడ్డును అడగవద్దు.”..

మీరు పిఏఆర్/పిఆర్ఏ పద్ధతిని అడగవలసింది ఏమిటంటే కలిసిగట్టుగా అందరూ పాల్గొని వెల నిశ్చయించడము అంతేగానీ వేరొకటి కాదు.

––»«––

© ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ భర్ట్లె
వెబ్ రూపకర్త లోర్డస్ సడా
––»«––
చివరగా మార్చబడిన తేది: 2011.12.18

 హోం పేజి

 వెల నిశ్చయిన్చుటలో పాల్గొనుట