Tweet అనువాదములు:
বাংলা / Baṅla |
మీకు కావలిసిన నైపుణ్యములు తెలుసుకొనండిఎలా చేయాలి విషయములో మీరు ఏమి తెలుసు కోవాలి?రచన: ఫిల్ భర్ట్లె, పీ హెచ్ డీఅనువాదకులు: సరస్వతి కాజశిక్షణ కరపత్రంసమన్వయ పరిచటానికి కావలిసిన నైపుణ్యములుసమన్వయ పరిచటానికి కావలిసిన నైపుణ్యములు నేర్చు కొనుట మహా కష్టమైనవి కాదు, కాని మహా శక్తివంతమైన పరికరములు కావచ్చును. వాటిని దుర్వినియెగ పరచ వచ్చును. దీనిని తాళం కమ్మరి నైపుణ్యములతో పోల్చ వచ్చును. తాళం కమ్మరి ఎంతో అవసరమైన మరియ విలువైన సేవలు అందించును, కాని వాటిని దొంగతనము చేయుటకు, తప్పుగా పగుల కొట్టుటకు, తప్పుగా ప్రవేశించుటకు దుర్వినియెగ పరచ వచ్చును. మీరు సమన్వయ పరిచే నైపుణ్యములు నేర్చుకొనుచు, సమాజమును దెబ్బ తీసి మీ స్వలాభమునకు కాకుండ సమాజమునకు మేలు చేయటాని వాడండి. మీ లక్ష్య సమూహము, మెత్తము సమాజము కావున, మీకు అన్నిటి కన్న కావలిసిన నైపుణ్యములలో ముఖ్యమైనది మాట్లాడే సామర్థ్యమునకు సంభందించినది. మీరు మంచి వక్త (బహిరంగముగా ప్రసంగించటము) అవటము నేర్చు కోవాలి, కాని ఏదో ఒక రకము వక్త కాదు. ఎలాంటి రకము బహిరంగముగా ప్రసంగించటము మీకు తెలియాలంటే, అన్నిసులభముగా ఉపకరించటానికి మరియు నాయకత్వము వహించటానికి కావలసినట్లు. మీరు సమూహము నుండి విశేషములు, నిర్ణయములు, ఎలా రాబట్టాలో నేర్చు కోవాలి. దానికి మీకు మీ లక్ష్యముల పూర్తి అవగాహన మరియు, ప్రజల ముందు ఉన్నప్పుడు సడలించ బడ్డ దైర్యము ఉండాలి. మీరు బోధనలు, ఉపన్యాసములను, గుర్తించ కలగి, వాటి నుండి తప్పించు కోగలగాలి. సమన్వయ కర్తకి కావలిసిన సాంకేతిక నైపుణ్యములు : బహిరంగముగా ప్రసంగించటము, ప్రణాళికలు ఏర్పాటు చేయటము, నిర్వహించుట, గమనించుట, విశ్లేషించుట, మరియు లిఖించుట. అన్నిట్టి కన్నా ఉత్తమమైన నేర్చుకొను విధానము స్వయముగా నేర్పుకొనుటే. మీరు నిజాయితి, ఉత్సాహము, నిశ్చయమైన, సహనము, ఓర్పు, సమన్వయ పరిచే స్వగుణములు కూడ పెంపొందించు కోవాలి. మీరు వేరొకరు మాట్లాడుతు ఉనప్పుడు వాళ్ళు చెప్పేది విని మరియు అర్ధము చేసు కోవటము ఎలాగో తెలుసు కోవాలి . ఆ విశేషములు/సమాచరములు యధార్ధమైనవని నిశ్చయ పరచటము ఎలాగో మీకు తెలియాలి. మీకు ఆలకించేవాడికి విషయము ఆసక్తికరముగా స్పష్ట పరిచటము తెలియాలి. మీరు బోధకుడి లాగ బోధించ కూడదు, మీరు రాజకీయ నాయకుడి లాగ ఉపన్యాసములు ఇవ్వ కూడదు ; మీరు ప్రొఫెసరు లాగ ప్రసంగించ కూడదు. మీరు ఇతరులతో వున్నప్పుడు కాని, చాల మంది ముందు వున్నప్పుడు దైర్యముగా ఉండటము నేర్చు కోవాలి మరియు ఇతరులు మీద శ్రద్ద ఉండాలి. మీరు ప్రజలను ఎలా తెలుసు కోవాలి మరియు, ఎలా ఇష్ట పడాలో తెలుసు కోవాలి . మీరు స్వార్థపరుడు, గర్విష్ఠి, అహంకారి, పొగరుబోతు కాకుండ ఉండటము ఎలాగో తెలుసు కోవాలి. మీకు వ్యంగ్యము, దభాయుంపు, నిరంకుశము లేకుండ చర్చను ఎలా కొనసాగించాలో తెలియలి. ఇవి మీకై మీరు నేర్చు కొనండి. మీరు ఈ నైపుణ్యములు చేయటము ద్వార నేర్చు కొంటారు(టెక్సట పుస్తకము చదవటము మాత్రముననే కాదు ). ఒక వేళ మీరు సమాజ అభివృద్ధి తరగతి లోకి వెళ్ళి కూర్చొని నోట్సు తీసుకొన్నా మీకు ఉత్తమమైన శిక్షణ రాదు. ముందు మీరు మీ తోటి విధ్యార్ధుల ముందు అభ్యాసము చేయ వలెను, ఆ తరువాత సమాజ సమూహము ముందు చేయ వలెను. శిక్షణ విధానములు చూడండి. మీరు సమాజ సమూహములను మరియు సమాజ కార్య నిర్వాహక సమితిలను ఏర్పాటు చేస్తారు కనుక, మీకు కొన్ని సమాజము ఏర్పాటు చేయు నైపుణ్యములు కావాలి. మీరు నిర్వహణ నైపుణ్యములను ఇచ్చి శక్తివంతము చేస్తారు కనుక, మీకు నిర్వహణ నైపుణ్యములు ఉండాలి. మీరు సమాజ సంఘముల కార్య ప్రణాళిక ఏర్పటు చేయటానికి వాళ్ళకు మార్గ దర్శకులు కనుక మీకు కొన్ని కార్య ప్రణాళిక నైపుణ్యములు కావాలి. మీరు ఆర్ధిక దస్తావేజులు మరియు పద్దులు కచ్చితముగా, నిజాయితిగా కాపాడుటలో సమూహములకు సలహాలు మరియు మార్గము చూపుతారు కనుక మీకు కొద్దిగా గణక శాస్తము నైపుణ్యములు ఉండాలి . మీరు సమూహములకు నివేదికలు వ్రాయుటలో తోడ్పుతారు మరియు మీ సొంత నివేదికలు వ్రాస్తారు కనుక మీకు లిఖించుట లేక వ్రాయడములో నైపుణ్యము ఉండాలి. ఇవన్ని మీరు పని చేయటము ద్వారా నేర్చు కొనండి. మీకు భాష తొందరగా ఎలా నేర్చుకోవాలో, (మాట్లాడు భాష నేర్చు కోవటానికి శ్రవణ విధానము చూడండి) మరియు సమాజములోని అనేక భాషల పరిచయము కలిగి ఉండటము ఎలాగో తెలియాలి. సమన్వయ కర్తగా విజయవంతము కావాలి అంటే, మీకు సాంకేతిక నైపుణ్యముల కన్న, కొ్న్ని స్వకీయమైన స్వభావములు అవశ్యము. సమన్వయ కర్తగా ఉండటము మరియు ఉద్యోగ వివరణము శిక్షణ కరపత్రాలు చూడండి. మీ యశస్సు మీకు అన్నిట్టి కన్నా బలమైన ఆస్తి. ఒక వేళ మీరు నిజాయితి వంతులు, రాజ తంత్రజ్ఞులు, న్యాయమైన, కష్టజీవి, నీతియైన, పరిశుద్దమైన జీవనము కలిగిన, ఓర్పు గల, ఉత్సాహమున్న, వినయముగల , మరియు సూటిగా వెళ్ళే బోళా మనిషి అని పేరు ఉంటే అది మీకు సమన్వయ పరిచటానికి తోడ్పడును. ఒక వేళ అది మీరు కాని యెడల మీరు వేరే ఉద్యోగము చూసుకోండి. ––»«––© ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ భర్ట్లె
––»«–– |
మూల పేజి |
సిద్ధము కావటము |