Tweet అనువాదములు:
'العربية / al-ʿarabīyah |
సమాజాన్ని సవాలు చేయుటప్రతిఘటన శక్తిని ఉత్పాదిస్తుందిబై ఫిల్ భర్ట్లె పిహెచ్‌డి,అనువాదము శంకరతేజస్వి ఉప్పులూరిశిక్షణ కరపత్రముసమాజం శక్తివంతము అవ్వాలని మీరు ఒక వైపు కోరుకుంటారు, అలా అని నిష్క్రియగా కానీ మీ అంతట మీరుగా కానీ సమాజము యొక్క ముఖ్యమైన ధ్యేయముగా అనిపించే దానితో మొదటి చూపులో మీరు అంగీకరించకూడదుప్రతిఘటన శక్తి ఉత్పాదిస్తుంది; చేతి వ్యాయామము చేస్తేనే చేతి కండరాలు బలపడుతాయి. మీ కండరాలు అసలు ప్రతిఘటన ఎదుర్కోక పోతే, బలహీన పడుతాయి. అలాగే, సమాజానికి మీరు ఎక్కువ సహాయపడితే, ఆది శక్తివంతముగా అవ్వదు. సమాజము యొక్క తొలి సూచన జాగ్రత్తగా ఆలోచించబడి ఉండక పోవచ్చు, మీరు దాన్ని సవాలు చేస్తే, ఏ విధమైన చర్య తీసుకోవాలో అని వాళ్ళు మరి కొంత జాగ్రత్తగా ఆలోచించవచ్చు. ఒక ఊహాజనిత ఉదాహరణను చూద్దాం. ఒక వైద్యశాల కట్టడం వాళ్ళ ముఖ్యమైన ఆశయం అని సమాజసభ్యులు చెప్పవచ్చు. "సమంజశముగానే ఉంది" అని మీరు అనవచ్చు. "కానీ మీరు ఆ ఆశయం ఎందుకు ఎంపిక చేశారు?" "వైద్యశాల కట్టి దాన్ని నిర్వహించగల సత్తువ మీ సమాజానికి ఉందా?" "వైద్యశాల ఏ ఏ సమస్యలను పరిష్కరిస్తుంది? మరియు దాని వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి? వాళ్ళ ఎంపిక కోసం ప్రతివాదించనివ్వండి, దాని ద్వారా వాళ్ళని శక్తివంతం చెయ్యండి. ఒక వేళ ప్రతిపక్ష సమాజానికి వైద్యశాల ఉండడం వలన ఈ సమాజ సభ్యులు వైద్యశాల కోరుకుంటే, వాళ్ళ గర్వమే దీనికి కారణం ఐతే, మీరు వివరించి చెప్పవచ్చు. ఈ వైద్యశాల నిర్మించడానికి మీరు మీ సొంత వనరులని ఉపయోగిస్తారు అని గుర్తుంచుకోండి; ఆ విధంగా మీ డబ్బులు ఖర్చుపెట్టాలని మీరు నిజంగా కోరుకుంటున్నారా?" అని మీరు చెప్పవచ్చు. ఒకవేళ అప్పుడు, చిన్నపిల్లలు మరణిస్తున్నారు, అదే వాళ్ళ ప్రాధమిక సమస్య అని సభలో బయటకి చెప్పవచ్చు. "నివారణ కన్నా ముందు జాగ్రత్త మిన్న" అని, PHC (ప్రాధమిక ఆరోగ్యం) యొక్క ఈ ముఖ్యమైన సూత్రాన్ని వాళ్ళకి చెప్పడానికి ఇది ఒక మంచి అవకాశం. చిన్న పిల్లలు ముఖ్యముగా నీటి జనిత అనారోగ్యాల వల్ల వచ్చే అతిసారము వల్ల మరణిస్తున్నారు. నీరు చూడండి. వైద్యశాల అనారోగ్యాముని నివారించడం లో సహాయపడవచ్చు, కానీ (1) శుచి శుభ్రత నేర్పి ప్రవర్తనలో మార్పు తేవడం, (2) శుభ్రమైన, కుండలో ఉంచుకోగలిగే నీటి పారుదల, (3) పురుష మలం ని త్రాగు నీటి నుంచి దూరంగా ఉంచే సఫల పరిసుధ్ధత, - ఈ మూడు చర్యల సంధి ద్వారా నీటి జనిత అనారోగ్యాలను తగ్గించడం దయారసముగల, చౌకైన, తక్కువ ప్రమాదపూరిత ఉపాయము. నివారణ కన్నా ముందు జాగ్రత్త మిన్న. వాళ్ళ సమస్యలను విశ్లేషణ చేసి ఉపయోగకరమైన, నిర్వహించబడగల ఉపాయములను కనిపెట్టమని సవాలు చేయబడినప్పుడు, సమాజం తమ ముఖ్యమైన సమస్యలను మరల పరిశీలించి, తమ ముఖ్యమైన లక్ష్యాలను మెరుగుపరచగలరు. వాళ్ళ లక్ష్యంగా వాళ్ళ మొదటి ఎంపికనే నిష్క్రియగా అంగీకరించవద్దు ––»«––© ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ భర్ట్లె
––»«–– |
హొమ్ పేజి |
మొదలు పెట్టడం |