Tweet అనువాదములు:
'العربية / al-ʿarabīyah |
బహిరంగ సంభాషణబహిరంగ సభ జరపడం ఎలా?బై ఫిల్ భర్ట్లె పిహెచ్‌డి,అనువాదము శంకరతేజస్వి ఉప్పులూరిశిక్షణ కరపత్రముప్రజలు మరియు సమాజముతో సంభాషించడానికి ఒక ఉత్తేజ పరిచే నాయకుడికి నైపుణ్యం అవసరము.ఎరుగుదల పెంచడానికి మరియు సమాజాన్ని వ్యవస్థీకరించడానికి చర్చ కేంద్ర అంశంగా ఉండే బహిరంగ సభే మీ ప్రధానమైన ఆయుధం. పైన చూపించిన విధంగా, మీ ఉత్తేజ పరిచే నాయకుల ఆశయాల గురించి మరియు ముఖ్యమైన అంశాలు, అంటే ముఖ్యమైన పదముల గురించి మీరు క్షుణ్నమైన జ్ఞానం కలిగి ఉండి మరియు మాట్లాడ గలిగి ఉండడం చాలా ముఖ్యము. ఇంకా ఎన్నో. నిర్వచనాలు బట్టీ పట్టకండి. ఆ ఊహలన్నింటినీ మీరు అర్ధం చేసుకున్న విధంగా అన్వయించి, మీ దినచర్య పుస్తకములో మరియు మీ సహచరులతో చర్చించండి. పూజారి లాగా ధర్మొపదేశాలు చేయకండి; రాజకీయవాది లాగా ప్రసంగించకండి; ఆచార్యుడు లాగా ఉపదేశించకండి, ఉపదేశము, తీవ్ర ప్రసంగము, ఆజ్ఞాపన పరిహరించాలి. ఉపకరించండి, ప్రశ్నలు అడగండి, దారి చూపండి. ఎల్లప్పుడు ప్రశ్నలు అడుగుతూ, ఎప్పుడూ జవాబులు చెప్పకుండా ఉపదేశించిన సాక్రటెస్, ప్రాచీన గ్రీస్ దేశానికి చెందిన ప్రఖ్యాత గురువు, మీ అత్యుత్తమ ఆదర్శంగా ఉండాలి. ఆయన ఒక గొప్ప ఉపకర్త, ప్రజలను వాళ్ళంతట వాళ్ళుగా ఆలోచించడానికి (విశ్లేషణ, ఉపలక్షణ) దారి చూపించేవారు. సడలుగా, నిబ్బరంగా మరియు అన్ని విషయాలు తెలుసుకున్నట్టు ఉండండి. పాల్గొనేవాళ్ళు ప్రశ్నలు వేసేలా చెయ్యండి. ముఖ్యంగా నెమ్మదస్తులను మరియు బిడియస్తులను వాళ్ళ అభిప్రాయాల గురించి అడగండి. అతినిబ్బరస్తులను మరియు ప్రబలస్తులను చర్చను అదుపులోకి తీసుకోనివ్వకండి. బహిరంగ సభ సమావేశాలలో "గుంపులో ఆలోచించడం" అనే అంశాన్ని ప్రవేశ పెట్టండి, దీన్నే మీరు మళ్ళీ కార్యనిర్వాహక వర్గం యొక్క ప్రణాళిక సమావేశాలలో వాడుతారు. అన్య రకాల సమావేశాలకు వివిధ కట్టడులు ఉంటాయి అని వివరించి చెప్పండి. మీరు ఉపకరించి మరియు దారి చూపే ఈ బహిరంగ సంభాషణ చర్చకు తావిస్తుంది; "గుంపులో ఆలోచించడం" ఇవ్వదు. గుంపులో ఆలోచించినప్పుడు చర్చ, ఆక్షేపన మరియు సభలో అందరితో కాకుండా, పక్కన కొంత మందిలో మాత్రమే మాట్లాడుకోవడం ఉండకూడదు అని మీరు ఉద్ఘాటించి చెప్పండి. మీరు సూచనలను ఆహ్వానించి వాటన్నింటినీ, వెర్రి సూచనలను కూడా, వ్రాత బల్ల మీద రాయండి, తర్వాత ఆ సూచనలను ప్రాధాన్యత ప్రకారం అమర్చండి. "గుంపులో ఆలోచించడం" సంవిధానం మరియు ఏకాగ్రతతో చెయ్యాల్సిన చర్య, పాల్గొనే వాళ్ళు కట్టడులను నేర్చుకోవాలి మరియు పాటించాలి. ఒక సామాజిక సముహానికి ఏది ఆలోచించాలి ఏది చెయ్యాలి అని అసలు ఎప్పుడూ చెప్పకండి. మీరు చెప్పాలి అని అనుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళని శక్తి పరచటానికి, ఉదాసీనత, అజ్ఞానము, పరాధీనాత, జబ్బులు మరియు కుటిలతను ఎదుర్కొనడం అనే ఆశయాలు మీకు ఉంటాయి. కానీ వాళ్ళు సిద్ధి చెందడం మరియు తమ సొంత నిర్ణయం తీసుకోవడంలో మీరు ఉపకరించాలి. వాళ్ళని శక్తి పరచాలి లేదా బల పరచాలి అని మీరు అనుకుంటే మీరు ఈ ఉపకరించడం విధానాన్ని అనుసరించాలి. (ఉపన్యాసము మరియు ఉప దేశము పరిహరించండి.) ––»«––సామాజిక సమూహం © ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ భర్ట్లె
––»«–– |
హొమ్ పేజి |
మొదలు పెట్టడం |