Tweet అనువాదములు:
'العربية / al-ʿarabīyah |
మీ లక్ష్యములు తెలుసు కొనండిమీరు ఏమి సాధించ తలిచారు?రచన: ఫిల్ భర్ట్లె, పీ హెచ్ డీఅనువాదకులు: సరస్వతి కాజశిక్షణ కరపత్రంసమన్వయ కర్త ఆశయములు, లక్ష్యములునిర్వహణ శిక్షణలో వాడే ఒక నినాదము, "ఒక వేళ మీరు ఎటు వెళ్ళతున్నది తెలియనిచో, అప్పుడు ఏ దారి అయినా ఒక్కటే." ("నినాదములు" చూడండి.) సమాజము సమన్వయ పరచటానికి సిద్ధము కావటములో, ఇది మీకు కూడ వర్తిస్తుంది. అసలు కార్యమైన సమాజమును శక్తివంతము చేయుటలో ముందుకు సాగకుండ రేకెత్తించే చర్యలు, ఊరికే అటు ఇటు పరుగెత్తటము, తీరిక లేకుండ కనిపించటము, సమావేశములు ఏర్పాటు చేయటము, కక్కసు కట్టించటము, సమాజము యెక్క నాయకులతో మాట్లాడటము, దీని తరుపున వాదించే సమూహములను కదలించటము చాల తేలిక.
మెట్ట మెదట మీ లక్ష్యములు మీకు స్పష్టముగా ఉండాలి, ఆ తరువాత కాగితము పై, ఆ తరువాత మీ చుట్టు ప్రక్కల వారికి. ఇక్కడ మీరు మీ లక్ష్యములు మరియు సిద్దాంతములు కోసము అట్టి పెట్టిన దినచర్య పుస్తక భాగములో వ్రాయటము మెదలు పెట్టాలి. మీరు అవి కేవలము వేరొకరి లక్ష్యములుగా ఆలోచించకుండ, అవి మీ లక్ష్యములుగా పెట్టు కోవాలి. సమాజము అభివృద్ధి చేయటానికి సమన్వయ పరిచే లక్ష్యములు ఒక సమాజము నుండి ఇంకొక సమాజముకు, ఒక మనిషి నుండి ఇంకొక మనిషికి తేడాలుండును.
ఎటు వచ్చి, అన్నిట్టిలోను కొన్నిఅవే సామాన్యమైన విషయాలుంటాయి. అవి: పేదరికము నిర్మూలనము, మంచి ఏలుబడి, సాంఘిక వ్యవస్త మార్పు, సమాజము తాహతు అభివృద్ధి, తక్కవ ఆదాయము మరియు అంచున వున్న ప్రజలను శక్తివంతము చేయటము, మరియు స్త్రీ, పుల్లింగ సమానత్వము. ఇది చదవుతూ, సమన్వయ పరిచటములో నిమగ్నమై ముందుకు సాగుతుంటే, తెలిసిన కొద్దీ ఒక్కొక్క ఈ లక్ష్యము మరింత ఆసక్తికరముగా మరియు సవాలు చేసేటట్లు ఉంటాయి. తరుచు మీ దినచర్య పుస్తకమును మెరుగుదిద్ది, సవరించండి, మీ లక్ష్యముల వివరాలకు మరింత చేర్చండి . ఉదాహరణనకు, పేదరికము తగ్గించడము విషయములో, ఊరికే వ్రాయటానికి, దానితో పని చేయటములో చాలా వ్యత్యాసము కలదు. దానితో పని చేసినప్పుడు బహు క్లిష్టమైనదిగా మరియు సవాలు చేయునటువంటిందిగా ఉండును. మనము "పేదరికము ఉపశమనము" పద్ధతి మాను కొంటాము ఎందు కంటే అది బాధ మరియు అసౌఖ్యము తాత్కలికముగా తగ్గించును కాని, ఒక శాశ్వతమైన, స్థిరమైన, పరిష్కారానికి దారి చూపదు. పేదరికము కేవలము ధనము లేక పోవటము కాదు (అది మీరు తరువాత చూస్తారు) మరియు పేదరికానికి కారణభూతులను ఎదురు కోవటమంటే ఉదాసీనత, అజ్ఞానము, రోగము, మరియు మోసము తో పోరాటము చేయటము.
అనుభవము ద్వార మీ లక్ష్యము యెక్క అవగాహన పెరుగునని చెప్పటానికి, అది ఒక ఉదాహరణము మాత్రమే. అలాగే మంచి ఏలుబడి అంటె, శక్తిగల నాయకత్వము మరియు సమర్ధమైన నిర్వహణము మాత్రమే అని అర్ధము కాదు. స్పష్టత, ప్రజల పాల్గొనటము, నమ్మకము, నిజాయితి, మరియు భావి కాలము యెక్క ముందు చూపు కూడ అని అర్ధము. ఇంకను మీరు ఏమి తెలుసు కొంటారు అంటే, మీరు సమాజము యెక్క కార్యములలో స్పష్టముగా లేనప్పుడు, మీరు సమాజ నాయకుల నుండి కూడ వారి సమాజము యెక్క వనరులు, సాధనములు వినియెగము గురించి ఏ మాత్రము స్పష్టత ఆశించ లేరు. పేదరికము తగ్గించటము, సమాజభివృద్ధి లక్ష్యముల ప్రాథమిక చర్చ కొరకు పద కూసము చూడండి. మీ దినచర్య పుస్తకము లోని నోట్సుతో పోల్చండి. ––»«––© ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ భర్ట్లె
––»«–– |
మూల పేజి |
సిద్ధము కావటము |