Tweet అనువాదములు:
'العربية / al-ʿarabīyah |
స్థితి గతుల విశ్లేషణభాగస్వామ్యం విలువ పరిచయంఫిల్ బార్ట్లే పిహెచ్ డి, చే రచింపబడినదిఅనువదించినది రాజేష్ కాల్వశిక్షణ కరపత్రంసంఘ సభ్యులు తమకు ఏమి కావాలో నిర్ణయించుకొని కార్య ప్రణాళికను అమలు చేసుకోనే ముందు సంఘ సభ్యుల ఖచ్చితమైన విలువ తెలుసుకోవాలిసంఘం దీనిని ఎక్కడి నుంచైనా మొదలు పెట్టొచ్చు. కార్య నిర్వహణ విభాగం సంఘంలో ఉన్న స్థితి గతులను అంచనా వేసి వాటిని విశ్లేచించాలి. వాటిని సంఘం ముందు ప్రవేశ పెట్టాలి. దీనినే "స్థితి గతుల విశ్లేషణ" అంటారు. మీరు మీ అంచనాలను తయారు చేసుకొని పటం రూపంలో పొందుపరచుకోవాలి. అలాగే కార్య నిర్వహణ విభాగం తనకు తాను గా అంచనాలను తయారు చేసుకోవాలి. పటం చూడండి. మీరు వారికీ తయారు చేయవద్దు. అలాగే వారు అ పనిని వేరే వారికీ అప్పజెప్ప కుండా చూడాలి. అనుకూలమైన రోజు ఒకటి నిర్ణయించుకొని మీరు మరియు కార్య నిర్వహణ విభాగం సంఘంలో పర్యటించాలి. దీనికి కావాల్సిన సమయం కేటాయించాలి. సంఘంలో అన్ని ప్రాంతాలను సందర్శించండి. ప్రజలతో మాట్లాడండి. గమనించిన అంశాలను పుస్తకములో మరియు పటం లో పొందుపరచండి. PAR చూడండి. ఆ తరువాత కార్య నిర్వహణ విభాగంతో కలసి వారు గమనించిన అంశాలను మరియు మీరు గమనించిన అంశాలను కలిపి చర్చించండి. రెండింటిని జోడించి కార్య నిర్వహణ విభాగంలోని సభ్యునిచే (మీరు కాదు) ఒక నివేదికను తయారు చేయమనాలి. అలా తయారు చేసిన నివేదికను సంఘం ముందు ప్రవేశ పెట్టెల చెయ్యాలి. వారు తయారు చేసిన నివేదికను "స్థితి గతుల విశ్లేషణ" అని అంటారు. మీరు ఆ నివేదికకు(కనీసం పటాలకు) కొన్ని కాపీలు తయారు చేసి, అందరికి పంచి పెడితే బాగుంటుంది. మీరు సంఘంలో పర్యటించినప్పుడు సమస్యలు మరియు పరిష్కారాలు, వనరులు మరియు అడ్డంకులను గమనించండి. మురికి నీటి గుంటలను, పాడైన రోడ్లను చూపించండి. మీకు( కార్యనిర్వహణ అధికారితో సహా) ముసలి వడ్రంగి కనిపిస్తే అతనిని యువకులకు శిక్షణ ఇవ్వమని అడగండి. అతనికి కుటుంబ ఆదరణ వుంటే అతని శక్తిని, అనుభవాన్ని యువకులకు పంచమని అడగండి. దానికి తగు రీతిలో అతనిని సత్కరించండి. ఇతర సహజ మరియు మానవ వనరులను వెతకండి. వాటిని నివేదికలో పొందుపరచండి. కార్య నిర్వహణ విభాగం సమగ్ర నివేదికను తయారు చేసిన తర్వాత దాన్ని ఆమోదించటానికి సంఘం మొత్తం ముందు ప్రవేశపెట్టాలి. దీని కోసం సంఘం మొత్తం ఒక అనుకూలమైన సమయంలో కలిసేలా చూడాలి. సమన్వయ కర్తగా మీరు నివేదిక ప్రవేశ పెట్టడానికి కావాల్సిన వస్తు సామాగ్రి(పటాలు, ముద్రించిన పత్రాలు మొదలగునవి) వారికీ సమకూర్చిపెడితే బావుంటుంది. చివరగా సమన్వయ కర్తగా మీరు కార్య నిర్వహణ అధికారిని కార్య ప్రణాళిక ప్రేవేశ పెట్టటానికి తోడ్పడాలి గాని మీరు ప్రేవేశ పెట్టకూడదు. అంచనా వేయటం అనేది సంఘ కార్య ప్రణాళిక అమలు చేసే ముందు చెయ్యాలి. (CAP) చూడండి. ప్రవేశ పెట్టిన నివేదిక సంఘ సభ్యులకు అర్ధమయ్యేలా ఉండాలి. అలాగే దానిని అమలు చేయాలంటే కలుగు సమస్యలఫై మరియు ఉపయోగాలపై ఒక అభిప్రాయానికి వచ్చారో లేదో చూడాలి. భాగస్వామ్యపు విలువ ఈ శిక్షణ భాగం అంకితం. PAR చూడండి.. ––»«––స్థితి గతుల విశ్లేషణ © ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ బార్ట్లే
––»«–– |
మొదటి పేజీకి |
ఏర్పాటు చెయ్యటం |