Tweet అనువాదములు:
'العربية / al-ʿarabīyah |
మార్గాన్ని తేట పరచడంఅధికారుల దగ్గర నుంచి అనుమతి తీసుకోవడంబై ఫిల్ భర్ట్లె, పిహెచ్డిఅనువాదము శంకరతేజస్వి ఉప్పులూరిశిక్షణ కరపత్రముసమాజాన్ని శక్తి పరచడం ద్వారా ఎలా లబ్ది చెందుతారో స్థానిక అధికారులకు మరియు దాఖలూదారులకు చూపించడం.మీరు గురి పెట్టిన సమాజంలో పని మొదలు పెట్టే ముందు అవసరమైన అనుమతులు మరియు ఆ ప్రాంతానికి బాధ్యులైన స్థానిక అధికారులు మరియు నేతల సహకారము తీసుకోనుండాలి. కొంత మంది ఉత్తేజ పరిచే నాయకులు అధికారులను "శత్రువు" గా లేదా "ప్రతిపక్షము" గా భావించవచ్చు, పేద సమాజాలని వ్యవస్థీకరించి ఆ "హింసాకారులను" ఎదిరి౦చడమే వాళ్ళ పని అని భావించవచ్చు. అది కొన్ని సందర్భములలో ఉచితమైన పద్దతి కూడా అవ్వచ్చు, అది " సమాజము పాల్గొనడం" కన్నా "పౌర నియోగింపు" గా తరచు చూడబడుతుంది. ఆ అధికారులను మీ వైపు తేవడం జీవనము మరియు సంగతమైన జాతీయ విధానము మరియు బీదరికతను దూరం చేసే కార్యక్రమాలకు దారి తీయచ్చు అని ఈ విభాగము (ముఖ్యముగా ఆఫ్రికా లో తయ్యారు చేయబడినవి) లోని పద్ధతులు చూపిస్తాయి. నిజంగా
మీకు రెండు లక్ష్యాలు (లబ్ది చెందే
వారు) ఉన్నాయి అని గుర్తుంచుకోండి,
కేవలం (1) సమాజమే కాకుండా (2) సమాజము
ఉన్న ప్రాంతం వైపు బాధ్యత కలిగిన
అధికారులు కూడా. ప్రతి సమాజం పట్ల మీ ఆశయం ఆ సమాజాన్ని స్వయం-సాయం చర్యల ద్వారా శక్తి పరచడము. సమాజంలో ఒక తోడ్పడే సందర్భం లేదా పరిస్తితి (రాజకీయ మరియు పరిపాలక) ఏర్పాటు చేయడం ద్వారా నిలబెట్టుకోగలగడం కోసం పని చేయడం అధికారుల కోసం మీ ఆశయం. "సమకూరుస్తాం" అనే వారి నుంచి "సమాజాలలో స్వయం-సేవకు ఉపకరించే వాళ్ళుగా" మారడానికి ఒప్పించడమే నేతలు ( రాజకీయ మరియు నిరాడంబర), పరిపాలకులు ("ఉద్యోగస్వాములు"), మరియు సాంకేతిక నిపుణులకు ("సాంకేతికస్వాములు") మీ ఆశయం. ఇది చిన్న పని కాదు. రాజకీయ నేతలు "సమకూరుస్తాము" (e.g సామాజిక వసతి సమకూరుస్తాము) అని చెప్పినప్పుడు వాళ్ళు ప్రచారము మరియు వోట్లు దొరుకుతాయి. అందుకని "సౌకర్యం పద్దతి" లో వాళ్ళకి పరమైన ప్రయోజనాలు ఉండవచ్చు. అలాగే పరిపాలకులు మరియు సాంకేతికస్వాములు "సమకూరుస్తాము" అని చెప్పినప్పుడు, ఆది వాళ్ళ ఉద్యోగ జీవితాలని కొనసాగించి మరియు పదోన్నతులను కలిగిస్తుంది అని నమ్ముతారు. ఉపకరించే వాళ్ళుగా మారకుండా ఉండడంలో వాళ్ళకి పరమైన ప్రయోజనాలు ఉండచ్చు. "సౌకర్యం" పద్దతిని వదిలి "ఉపకరించడం" పద్దతిలో నడుచుకోవడం ద్వారా వాళ్ళే లబ్ది చెందుతారు అని చూపించి మరియు ఒప్పించడమే మీ వ్యూహం. నిజం ఏమిటి అంటే, ఒకవేళ, వాళ్ళు "సౌకర్యం" పద్దతి నుంచి "ఉపకరించడం" పద్దతికి మారితే, కొంత కాలానికి, వాళ్ళే లబ్ది చెందుతారు. బయటి అధికారులు వనరులు సమకూరుస్తారు అని సమాజం అనుకున్నంత కాలం, సమాజంలో దాగి ఉన్న వనరులని గుర్తించరు మరియు ఉపయోగించరు. సమాజానికి తమ వసతులు మరియు సేవలు తామే ఏర్పాటు చేసుకోవాలి అన్న బాధ్యత ఉండి, అలా చేసుకోవడానికి నిర్వాహకము శిక్షణ ఇవ్వబడితే, ఎన్నో దాగి ఉన్న వనరులు కనబడతాయి మరియు ఉపయోగించబడతాయి. నేతలు మరియు జవాబుదారీ అధికారులు ఉపకరించడం పద్దతికి మారితే, దాని వల్ల సమాజాల శక్తి పరచడం మీద ఆధారపడి వాళ్ళు ప్రచారము, వోట్లు, ఉద్యోగ జీవితంలో ఉన్నతి, పదోన్నతిలు పొందవచ్చు. నేతలు మరియు అధికారులకు సౌకర్యం పద్దతి తక్కువ వ్యవధిలో లాభదాయకం కావచ్చు, కానీ ఆది నిలబడలేదు అని, ఉపకరించడం పద్దతి వాళ్ళకి లాభదాయకంగా అధిక కాల పరిమితిలో స్వచ్ఛమైన అభ్యుదయము మరియు ఏదుగుదలని ఇస్తుంది అని చూపించడమే మీ బాధ్యత. సమాజాలని శక్తి పరచడం వల్ల వాళ్ళకి వచ్చే లాభాల గురించి ఎంత బాగా ఐతే అధికారులని ఒప్పించగలరో, అంత సులువుగా మీరు పని చేయడానికి అనుమతి, వాళ్ళ క్రీయాత్మక తోడ్పాటు పొందవచ్చు, మరియు సమాజాన్ని శక్తి పరచడంలో మరియు స్వావలంబన చేయడంలో అడ్డుపడే పరమైన ప్రయూజనాలను ఎదుర్కొనవచ్చు. అధికారుల నుంచి అనుమతి తీసుకొనేటప్పుడు అధికార విధానాన్ని తెలియచేసే కొన్ని పత్రాలు, ఒప్పందాలు, మరియు అన్వయము నివేదిక (MOU) వాళ్ళకి ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండచ్చు (ఇది మీ పరిస్తితుల మీద ఆధారపడి ఉంటుంది). అలా ఇస్తున్నప్పుడు, వాళ్ళు బాధ్యత కలిగిన చోట్ల శక్తివంతమైన, స్వయం-ఉపాశ్ృత సమాజాలు ఉండడం వల్ల ఎలా లబ్ది చెందుతారో వాళ్ళకి వివరించి చెప్పండి. మీ జమా-ఖర్చుల పట్టిక మరియు కార్య పథకం పరిమితించినట్లైతే, అధికారులకు తెలియజేయడం కోసం ఒక ప్రదర్శన ఏర్పాటు చేయడానికి ఇదే ఒక మంచి అవకాశం. ––»«––© ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ భర్ట్లె
––»«–– |
హొమ్ పేజి |
మొదలు పెట్టడం |