Tweet అనువాదములు:
'العربية / al-ʿarabīyah |
సమాజ నాయకత్వం మరియు అంతర్ సమీకరణస్వయం సమీకరనతో ఉద్ధరణమురచయిత: ఫిల్ బార్ట్లే, పీ ఎచ్ డీఅనువాదకులు: తుంగ మెహెర్ ప్రసూనాశిక్షణ కరపత్రంనిర్వాహకునిగా మీ జోక్యం ఒక బాహ్య కారకం; అభివృద్ధి ఉద్ధరణకు ఆ సమాజమే నిరంతర జోక్యాని అందించాలి.ఒక సమాజాని, ఉద్రిక్త స్వశక్తిపై విశ్వాసము వైపు ఉత్తేజ పరచడంలో, ఆ సమాజమే ఒక మూల భాగం. మీ సంస్థ మిమ్మల్ని మార్చడానికి ఇష్టపడిన లేదా మార్చిన, ఆ సమాజము యెక్క నిరంతర స్వయం సమీకరణే మీ అంతిమ లక్ష్యం. ఇలా చేయడానికి, సమాజములో నివసిస్తూ సమీకరణ నిర్వాహకులు అయ్యే యోగ్యతా, తగిన వైకరి మరియు విలవలు కలిగి ఉన్న వారిని గుర్తించి వారికి మీ నైపుణ్యములలో శిక్షణ ఇవ్వాలి. మీ చోటును తీసుకునేల మీరు వారికి శిక్షణ ఇవ్వాలి. మీరు మీ ఉద్యోగం నుంచి బయటకు రావడానికి పని చేస్తారు. సామాజ అభివృద్ధి ఒక సాంఘికమైన పరివర్తన. మీరు ఒక సమాజాన్ని అభివృద్ధి చెయ్యరు; ఆ సమాజమే తనను తాను అభివృద్ధి చేసుకుంటుంది. ఆ సాంఘిక ప్రక్రియకు మీరు మహా అయితే ఉత్ప్రేరకంగా మరియు ఉత్తేజకరంగా ఉండగలరు. ఇక్కడ మ్వలిము జులిఅస్ నఎరేరే చెప్పిన ఒక ప్రసిద్ధ వచనము తగినైనది, "మనుషులను అభివృద్ధి చెయ్యలేము; వాళ్ళని వాళ్ళు మాత్రమే అభివృద్ధి చెయ్య కలుగుతారు." మీ దగ్గర ఉన్న పరికరాలు మరియు నైపుణ్యాలు సాంఘిక పరివర్తనకి చాల శక్తివంతమయిన ఉత్ప్రేరకాలుగా పని చేస్తాయి. అందుకని, ఇతర పరికరాలు లాగా, ఈ పరికరాలు కూడా దుర్వినియోగం అవ్వచు. మీ చోటు తీసుకునేలా శిక్షణ ఇవ్వడానికి సమాజములోని సభ్యులను మీరు గుర్తించినప్పుడు, వారి వ్యక్తిత్వాన్ని పరిశీలించి సమీకరణ పరికరాలు సొంత ప్రయోజనం కోసం కాకుండా సమాజ ప్రయోజనం కోసమే వినియోగించేలా చూడడం ఆవశ్యకం. కొందరికి రాజకీయ మరియు వృతి గమ్యాలు ఉంటాయి అని తెలుసుకోవాలి. అనుకూలమయిన పాల్గోనే తత్వం మరియు ఉపకరణ నైపుణ్యాలు కలిగిన ఒక వ్యక్తి, సమీకరణను సొంత ప్రయోజనం కోసం దుర్వినియోగం చేయవచ్చు. మీరు మరల మీకు కావలసిన నైపుణ్యాలు తెలుసుకోండి మరియు "తాళం కమ్మరి" సామ్యం చుడండి. సమాజములో ఉండే సంభావ నిర్వాహకులని మీరు గుర్తించినప్పుడు, వాళ్ళని కొంత కాలం జాగ్రత్తగా గమనించండి. మీ స్థానాన్ని తీసుకొనే వాళ్ళని కనిపెట్టడానికి తొందర పడకుండా తగినంత సమయాన్ని తీసుకోండి. మీరు ఒక దళానికి సమయం తీసుకొని, సరి అయిన పని చెయ్యమని చెప్పుతున్నప్పుడు మీరు వాళ్ళకి పశ్చిమ ఆఫ్రికాలోని ఒక పశు సంఘంలో రెండు ఆంబోతుల ఈ చిన్న కథ చెప్పవచ్చు. రెండు ఆంబోతులు ఒక కొండ పైనుంచి వస్తుండగా, కింద లోయలు సుమారుగా ఒక వంద ఆవులను చూసాయి. రెండిటిలో చిన్న అంబోతు "మామా, మనం క్రిందకి దిగి, కొన్నిట్టిని ఖాయం చేద్దాం" అని అన్నది. అప్పుడు పెద్ద ఆంబోతు ఇలా అన్నది, "క్రిందకి నడుచుకుంటూ వెళ్లి, అందరిని ఖాయం చేద్దాం." మీ స్థానాన్ని తీసుకునే వ్యక్తిని వెదకడానికి మరియు శిక్షణ ఇవ్వడానికి తగినంత సమయం తీసుకోండి. మీరు ఒక్కరు లేదా కొందరు మనుషులను కాగల నిర్వాహకులగా గుర్తించినప్పుడు మరియు వారిలో నిజాయితీ, నాయకత్వం, జన అభివృద్ధి కోసం నిజమయిన ఔదార్యం లాంటి గుణాలు కలిగి, వాళ్ళకు ఉపేక్ష ఉంటె, మీరు వాళ్లకు శిక్షణ ఇవ్వాలి. మీరు వాళ్ళని "పని నేర్చుకొనువాడుగా" ఏర్పరిచి, సమయం తీసుకొని మీరు ఏమి ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి వివరించాలి. ఈ కరపత్రంలో, ఉన్న మొదటి కొన్ని అధ్యాయంలోని అన్ని ప్రస్తావనలను వివరించండి. వాళ్ళకి నైపుణ్యాలను నేర్పడం ఎంత ముఖ్యమో మూల సూత్రాలను నేర్పడం కూడ అంతే ముఖ్యం. అప్పుడప్పుడు వారిని ఉపకరణ సమావేశాన్ని నడిపించడానికి ప్రయత్నం చెయ్యనివ్వండి. వాళ్ళ నైపుణ్యాలు పెరిగే కొద్ది, రెండో మూడో సమీకరణ చక్రాలు అయిన తరవాత, మీ అనుపస్తితిలో వాళ్ళు కొనసాగించడానికి తయ్యారై ఉంటారు. మీరు సరిగ్గా సమీకరణను ఉద్ధారణం చేసే మార్గంలో ఉన్నారు. ––»«––© ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ భర్ట్లె
––»«–– |
హొమ్ పేజి |
జోక్య ఉద్ధరణము |