Tweet అనువాదములు:
'العربية / al-ʿarabīyah |
ఎరుగుదల పెంచడంఆంచనాలు పెంచకుండాబై ఫిల్ భర్ట్లె పిహెచ్‌డి,అనువాదము శంకరతేజస్వి ఉప్పులూరిశిక్షణ కరపత్రముతప్పుగా ఊహించుకోకుండా ముందు నుంచే జాగ్రత్త చర్య తీసుకోవడంమీరు సరిగ్గా తయ్యారీ చేసుకుని, అధికారుల దగ్గర నుంచి అనుమతి తీసుకున్న తర్వాత, సమాజాన్ని పని చేయడానికి ప్రొత్సహించవచ్చు. ఈ పనిని మీరు సమాజ సభ్యులందరితో ఒక సామూహిక సభను ఏర్పాటు చేయడంతో మొదలు పెట్టచ్చు. దీనితో "ఎరుగుదల పెంచడం" ఘట్టం మొదలవుతుంది కొంత మంది మాత్రమే సభకు హాజరు అవ్వడానికి ఉత్సుకత చూపించవచ్చు. పురుషులు వచ్చి స్త్రీలు రాకూడదు అనుకోవచ్చు. స్త్రీలు హాజరయ్యేటట్టు చూడడం మీ భాధ్యత. ఇదే విధంగా ఇతరులను: యువత, అవిటి వాళ్ళను, కులమత అల్పసంఖ్యాకులను , బిడియస్తులను, చదువురాని వాళ్ళను, పేద వాళ్ళను, ప్రోత్సహించాలి. మీరు సమాజం లోని సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు, ఏది ముఖ్యము అని అడుగుతున్నపుడు, మీరు వాళ్ళ సమస్యలను దూరం చేస్తారని వాళ్ళు అనుకోవచ్చు. వాళ్ళు అలా అనుకోకుండా, వాళ్ళ సమస్యలను వాళ్ళే పరిష్కరించుకోవాలని, మీరు కేవలం సహాయపడుతూ దారి చూపగలరని అర్ధమయ్యేలా చెప్పాలి. అదే విధంగా మీరు సాధనాలు సమకూరుస్తారని వాళ్ళు అనుకోవచ్చు. వాళ్ళు అలా అనుకోకుండా, సాధనాలు వాళ్ళే గుర్తించి వాళ్ళే సమకూర్చుకోవాలని; మీరు కేవలం సహాయపడుతూ దారి చూపగలరని అర్ధమయ్యేలా చెప్పాలి. మీరు కధలు, సామెతలు మరియు ఉదాహరణలు ఉపయోగించి మీరు చెప్పదలుచుకున్నది చెప్పవచ్చు. అందులో ఒకటి: "ఆవుని గుడ్లు పెట్టమని అడగవద్దు, కోడిని పాలివ్వమని అడగవద్దు," మీరు నిర్వాహకము శిక్షణ మరియు ప్రొత్సాహన ఇవ్వగలరు; మీరు డబ్బులు కాని వస్తువులు కాని ఇవ్వలేరు. ప్రజలు ఊహించుకోరని మీరు అనుకోకూడదు. వాళ్ళు ఊహించుకుంటారు. మీరు వాళ్ళ అంచనాలు తప్పుగా పెంచే ఊహలను (మీరు సాధనాలు సమకూరుస్తారని) సభాముఖంగా, కర్మనా ఖండించాలి. అలా చేయకపోతే, తర్వాత ఖండింపదగ్గ ఆశాభంగము మీరే ఎదుర్కోవలసి ఉంటుంది. అది మీరు అంతవరకు చేసిన పనిని వృధా చేస్తుంది. మీరు సాధనాలు సమకూరుస్తారని మాటిచ్చారని, కాని మాట నిలబెట్టుకోలేదని ప్రజలు అంటారు. మీరు ఎరుగుదల పెంచదలుచుకున్నారు, ఐతే ఇప్పుడు ఆ ఎరుగుదల దేని గురించి? మీ ఆశయాలు సమాజం యొక్క ఆశయాలు వేరు అని గుర్తు ఉంచుకోండి. వాళ్ళకి నీటి పారుదల, వైద్యశాల, పాఠశాల, దారులు కావల్శి ఉండచ్చు. సమాజం శక్తివంతముగా, స్వయం శిద్ధిగా ఉండి, పేదరికం తగ్గించి, లింగ సమవర్తకము పెంచి, యేలుబడితనాన్ని అభివ్ఱుద్ధి చెందాలని మీ ఆశయం. సమాజం ఎంత పేదదైనా, తమ సమస్యలను తామే పరిష్కరించుకోగలరని, శక్తివంతమవగలరనే ఎరుగుదలని మీరు పెంచాలి. అలా అవడానికి కేవలం సమ్మితి మరియు మీరు అందించగలిగే నిర్వాహకము శిక్షణ ఉంటే సరిపోతుంది. సరైన సమాచారము అందచేయడం చాలా ముఖ్యము (తప్పుడు అంచనాలు పెంచకూడదు). ––»«––© ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ భర్ట్లె
––»«–– |
హొమ్ పేజి |
మొదలు పెట్టడం |