Tweet అనువాదములు:
'العربية / al-ʿarabīyah |
సమాజం దాని చర్యని ఎంచుకుంటుంది.ఎంపిక శక్తిపరచటానికి ద్వారబంధముబై ఫిల్ భర్ట్లె పిహెచ్‌డి,అనువాదము శంకరతేజస్వి ఉప్పులూరిశిక్షణ కరపత్రముసమాజానికి తమ సొంత భవిష్యత్తు నిర్ణయించుకొనే హక్కు (మరియు బాధ్యత) ఉందిసభలో మీ సంభాషణ మరియు ఎరుగుదల పెంచే చర్యలు సమాజం యొక్క చర్య ఎంపిక మీద కేంద్రీకృతం అయ్యూంటాయి. మొత్తం సమాజం కలిసి అంతిమ నిర్ణయం తీసుకోవాలి అంతే కానీ సమాజం లో ఒకటి రెండు కక్షిలది కాకూడదు. ఇది మీ సఫలతకి చాలా ప్రధానమైనది. చర్యని పూర్తిచేయడానికి చాలా ఉత్సుకత మరియు ఒత్తిడి ఉంటాయి. ఆ చర్య మూత్రశాల కానీ, వైద్యశాల కానీ, నీటి కాలువ కానీ కట్టడం కావచ్చు, కవ్లుదారు హక్కులు బధ్రపరిచడానికి కొత్త చట్తశాశనం కావచ్చు లేక పోతే సమాజ సేవ కావచ్చు. ఉత్సుకత మరియు ఒత్తిడి ద్వారా మీరు మరలబడకండి. సమాజానికి తమ లక్ష్యం (e.g. మూత్రశాల) ఉంటుంది అలాగే మీకు మీ లక్ష్యం ఉంటుంది (సమాజాన్ని శక్తిపరుచుట). అవి రెండూ ఒకటి కాదు. సమాజం దాని లక్ష్యాలను సరైన మార్గంలో చేరుకొనడానికి, ఎంత సమయము పట్టినా, మీరు సహాయపడుతూ, దారి చూపాలి. రాజకీయవాదులు, పత్రికా విలేకరులు, పాలకులు సమాజం యొక్క లక్ష్యాల (మూత్రశాల కట్టడం) బట్టి మీ మీద అభిప్రాయము ఏర్పరుచు కుంటారు. వీటి వల్ల మీరు మోసపోకండి. మూత్రశాల కట్టడం మీ "ఉపకరణం" మాత్రమే, ఆది మీ లక్ష్యం కాదు. ఒక వేళ ఈ కట్టడం సమాజాన్ని శక్తి పరచకుండా, లింగ సమతూలనం పెంచకుండా, తేటదనం పెంచకుండా, స్వశక్తి పై నమ్మకం పెంచకుండా కనక జరిగితే, మీరు మీ లక్ష్యం సాధించడం లో విఫలమయ్యారు. ఒక భౌతిక నిర్మాణం కట్టడానికి కావాల్సిన సాధనాలు ( డబ్బులు, గొట్టములు, కప్పు కట్టడానికి ఉపయోగబడే సామగ్రి) సమాజానికి సమకూర్చడం చాలా సులువు, ఐతే ఆది సామర్థనీయం కాకపోవచ్చు. ఆ కట్టడం తమ సొంతం అని సమాజ సభ్యులు అనుకోకపోవచ్చు, దానిని సంరక్షించే బాధ్యత తమది కాదు అనుకోవచ్చు. మీరు మూత్రశాల కట్టడంతో ఒక రాజకీయవాది లేదా ఒక పత్రికా విలేకరి యొక్క అల్ప కాలిక లక్ష్యం సాధించవచ్చు, కానీ ఒక ఉత్తేజ పరిచే నాయకుడిగా సమాజాన్ని శక్తి పరిచడం అనే మీ లక్ష్యాన్ని సాధించడంలో మీరు విఫలమవుతారు. సరైన రీతిలో చేయక పోతే, అసలు చేయడమే తగదు. "సౌకర్యం" పద్దతి సమాజాన్ని బలహీనపరుస్తుంది, ఆది సామాజికంగా వినాశకారమైన "పరాధీనాత సిండ్రోమ్" కి తోడ్పడుతుంది. సమాజాన్ని సిధ్ధ పరచిన తర్వాత (ఎరుగుదల పెంచాక, ఐక్యత మెరుగు పరిచాక, సరైన సమాచారం అందజేసిన తర్వాత, ముఖ్యమైన లక్ష్యం ఎంచుకున్న తర్వాత) ఆది చర్య తీసుకోవడానికి తయ్యారుగా ఉంటుంది. అందులో మీ భూమిక తరువాయి విభాగం తెలియజేస్తుంది. ––»«––© ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ భర్ట్లె
––»«–– |
హొమ్ పేజి |
మొదలు పెట్టడం |