Tweet అనువాదములు:
'العربية / al-ʿarabīyah |
సమన్వయ కర్తను సిద్ధము చేయటముశిక్షకుడు మార్గ దర్శకత్వంరచన: ఫిల్ భర్ట్లె, పీ హెచ్ డీఅనువాదకులు: సరస్వతి కాజశిక్షకుడు నోట్సుఈ విభాగము శిక్షణ సాధనలుగా వాడుటఎవరు సమాజ సమన్వయ కర్తగా అవ్వ గలరు ? ప్రతి ఒక్కరు మంచి సమాజ సమన్వయ కర్తగా అవ్వటము సంభవము కాదు. ప్రత్యేక విషయములో శిక్షణ లేక విద్య ఉన్నంత మాత్రమున సమాజములతో పని చేయటానికి ఆయత్తము సూచించునని అనుకొన వద్దు. తక్కవ ఆదాయము గల సమాజములను శక్తివంతము చేయుటలో సాంఘిక సేవ లేక దానికి సంబంధించన విషయములో యోగ్యతా పత్రిక లేక డిఫ్లమో సఫలత నిశ్చయ పరచదు. ఇంజినీర్లు, వ్యాపారము లేక శాస్త్రములో కాలీజులో యోగ్యతా పత్రికను పొందిన వారు, ఒక సంవత్సరము ప్రాథమిక విద్య పొందిన వారు అంతా సమర్ధమైన సమాజ కార్మికులు అయినారు. వీలైనంత వరకు, సమాజ కార్మికుడు అయ్యే విధానము ఎవ్వరికి వారు ఎంచు కోవాలి. ఒక వేళ మీరు కాగల సమన్వయ కర్తలకు శిక్షణ ఇస్తుంటే, శిక్షణ తీసు కొనే వారికి తేలికగా రెండిటిలో ఏదో ఒక మార్గము ఎంచు కొనేటట్లు, మీ శిక్షణ కార్యక్రమము ఉండాలి. ఈ సిద్ధము కావటము విభాగములో, కాగల సమన్వయ కర్తకి, వారు చేయబోయే పని తత్వము, వాళ్ళకు కావలసిన స్వకీయమైన స్వభావములు, మరియు వారు ఎటువంటి శిక్షణ తీసుకొంటారో వెల్లడి చేసే విషయాలు కలవు. దీనిని కాగల సమన్వయ కర్తలకు బట్ట బయిలు చేయవచ్చు. వాళ్ళు శిక్షణ కొనసాగించాలో లేదో నిర్ణయించు కొనటానికి వీలుగా పరిసరాలు తయారు చేయటానికి వాడండి. ప్రాథమిక శిక్షణ సామగ్రి: ఈ శిక్షణలో, ఈ సైటులోని మెదటి ఐదు విభాగములు ముఖ్యముగా చిన్నకరపత్రములు కలిగి ఉన్నవి. అవి శిక్షణ కార్ఖానాలలో వాడుటకు తగినవి, కావున వాటి గురించి చర్చించి నెమ్మదిగా చిన్న చిన్న ముక్కలుగా జీర్ణించు కోవాలి. అవి ఈ సైటులో ఇంకొక చోట మెత్తముగా వర్ణంచ బడిన మెదటి కరపత్రము ( సమన్వయ కర్తలకు కరపత్రము ) పై ఆధార పడి ఉన్నవి. అవి వేరువేరుగా కార్ఖానాలలో చర్చించుటకు చిన్నకరపత్రములుగా విభజించ బడినవి. విషయమంతా ఉన్న పెద్ద పత్రము చదివి నేర్చు కోవాలి, అని కోరిక ఉన్న ఉన్నత విద్యార్ధులకు మీరు ఆ కరపత్రము చూడమని సలహా ఇవ్వ వచ్చును. తరువాత విభాగములు ఇంకా క్లిష్టమైన విషయములతో ఉన్న పెద్ద పత్రములు కలిగినవి. ఒక్కొక కరపత్రము మెదటి కార్ఖానాలో నలుభై నిమిషముల శిక్షణ సమావేశమునకు (సమావేశమునకు ఒకే పేరు వాడి) వాడ వచ్చును. మీరు శిక్షణ ప్రణాళిక చేసినప్పుడు బిరుదులు వాడ వచ్చును. సైటు
పఠములో ఉన్న మెత్తము జాబితాతో మెదలు పెట్టి మీ శిక్షణ సమావేశముల జాబితా సైటు
పఠము లో ఉన్న మెదటి ఐదు విభాగములలో ఉన్న క్రమములో లేక శిక్షణ తీసుకొనే వాళ్ళు మరియు మీ అవసరాలకు తగ్గట్టుగా సవిరించు కోవచ్చును. ప్రదర్శనములు చేయుటకు, చర్చలు చేయుటకు, ఫాల్గొనుటకు వీలుగా మీరు ప్రతి ఒక్క కరపత్రము లేక మీకు నచ్చిన కొన్నిట్టిని నిర్మలముగా ఉన్న కాగితము పైకి కాఫీ చేయవచ్చను. ఆ తరువాత వాటిని ఎలా వాడు కోవాలి అని నిర్ణయించు కోవటము మీ ఇష్టము. శిక్షణ తీసుకొనే వాళ్ళకు ప్రతి సమావేశములో "పని చేయు" విధానములుపై ప్రాధన్యత ఇచ్చి, ప్రసంగములు, మరియు ఒక వైపు నుండి ఇచ్చే ప్రదర్శనములు చాల తక్కువ చేయమని మేము సిఫారసు చేస్తాము. శిక్షణ తీసుకొనే వారు చురుకుగా ప్రతి సమావేశములో ఫాల్గొనేటట్లు మీరు ఊహించి ఎన్నో పనులు కల్పించ వచ్చును, మరియు వాటి లోని చాల వాటితో పట్టీ తయారు చేసి, తరవాత శిక్షణ సమావేశములలో వాడుటకు నోట్సు అట్టి పెట్టితే మీకు ఉపయేగకరముగా ఉండును. ఏది మీకు పని చేయును మరియు ఎటుల? ఇతర విభాగాములకు సంబంధించన పత్రములు: వేరే విభాగాములో ఉన్న రెండు పత్రములు ఈ విభాగామునకు ఉపభాగముగా వాడ తలచితే అవి ఉపయేగ పడ వచ్చును. "సమన్వయ పరిచే చక్రము" విభాగాములోని "సమన్వయ కర్తగా ఉండటు" పత్రము, ఇక్కడ చాలా ఉపయేగకరము అవ్వవచ్చును. దానిని రెండు కరపత్రములుగా విభజించ వచ్చును. ఒకటి శిక్షణ తీసుకొనే వారు వాళ్ళ స్వకీయమైన స్వభావములను చూసి కరపత్రములో వివరింపబడిన కావలసిన స్వకీయమైన స్వభావముల జాబితా పట్టితో పోల్చి వాళ్ళను వాళ్ళు ప్రశ్నించుటకు. మరి ఒకటి కార్య రంగములో సమన్వయ కర్త చేయవలసిన కార్యముల సులభమైన జాబితా పట్టి. రెండిటిలో ఒకటి లేక రెండు "సిద్ధము కావటము" సమావేశములో కరపత్రముగా వాడ వచ్చును. "సమన్వయ కర్త నిర్వాహకము విభాగము"లోని "ఉద్యోగ వివరణముల" పత్రము, మరింత వివరమైన, మీకు కావలసిన యోగ్యతల వివరములు, మీ వద్ద నుండి ఆశించే పనులు మరియు బాధ్యతలను అందించును. ఆ విభాగము, మరియు "ఫాల్గొనుట నిర్వాహకము " రెండు విభాగములు, నిర్వాహకుడు మరియు సమన్వయ కర్తకి మధ్య సంబంధము ఉమ్మడిగా ఉండాలి, మరియు వాళ్ళు కలిసి సమన్వయ కర్త వారి ఉద్యోగ వివరణము ఉత్పాదించాలి అని ప్రతిపాదించును. (దురదృష్ట వశాత్తు ప్రతి సమన్వయ కర్తకు ఫాల్గొనుట నిర్వాహకము వహించే పై అధికారి ఉన్న ఉద్యోగము దొరకదు –– ఆ రెండు విభాగముల దానిని పెంపొందించును). ఒక వేళ శిక్షణ తీసుకొనే వాళ్ళు "సిద్ధము కావటము" కరపత్రములో ఉన్న దాని కన్న ఇంకా వివరములు అడిగిన యెడల, అప్పుడు వాళ్ళకు ఉద్యోగ వివరణ కరపత్రము తగినది. శిక్షణ విధానములు: ఈ సైటులో శిక్షణలో వాడటానికి నానా విధములైన శిక్షణ విధానములు వివరించుటకు ఒక పూర్తి విభాగము అంకితము చేయబడినది.(శిక్షణ విధానములు) మీరు "సిద్ధము కావటము" లాంటి విషయముల మెదటి శిక్షణ కార్ఖానాలు ఏర్పాటు చేస్తునప్పుడు, శిక్షణ కార్యక్రమము మీరు ఎలా ఏర్పాటు చేయులో ఉపదేశమునకు మరియు చిట్కాల కోసము "శిక్షణ విధానములు" విభాగమును చూడండి. ఈ వెబ్ సైటు అంతటా మరియు దానిలో ఉన్వ శిక్షణ కార్యక్రమములో, అతి ముఖ్యముగా విశేషించినది "పని చేయటము ద్వారా నేర్చు కొనండి". మనమందరము వేరు వేరు విధములుగా, వేరు వేరు వేగములతో, మరియు ఒక సాధనముతో లేక భాషలో వేరే దాని కన్న ఎక్కువగా నేర్చు కొంటాము. అయినప్పటికిన్ని సాధారణముగా మనము ముఖ్యముగా నైపుణ్యములు ఏదైనా పని చేయటము ద్వారా ఎక్కువగా నేర్చు కొంటాము మరియు ఎక్కువగా గుర్తు పట్టు కొంటాము, కాని ఊరికే దాని గురించి విన్నంత మాత్రమున, చూసినంత మాత్రమున రాదు. మేము మిమ్మలిని శిక్షణ కొరకు పాత పద్ధతి విడిచి మీ సొంత బుద్ధి, ఉపఙ్ఞ, కల్పన వాడి అవసరాలు, శిక్షణ తీసుకొనే వారి స్ధితి, స్థానిక పరిసరాలను బట్టి మీ సొంత శిక్షణ యోచన చేయమని ప్రోత్సాహిస్తాము. ఒక వేళ మీరు శిక్షణ కార్యక్రమము నడుపుతుంటే, మాకు వ్రాసి మీ అభిప్రాయములు, పరిశీలనలు చర్చించమని ప్రోత్సాహిస్తాము. ఒక వేళ మీకు ఏమైన సూచనలు, ప్రతిపాదనలు ఉంటె మనము కలిసి క్రొత్త శిక్షణ సామగ్రి, సాధనములు యోచించ వచ్చును. ––»«––© ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ భర్ట్లె
––»«–– |
మూల పేజి |
సిద్ధము కావటము |