Tweet అనువాదములు:
'العربية / al-ʿarabīyah |
శక్తి కోసం వ్యవస్థీకరించడంవ్యవస్థీకరించడం ద్వారా తాహతు పెంచడంబై ఫిల్ భర్ట్లె, పిహెచ్డిఅనువాదము శంకరతేజస్వి ఉప్పులూరిశిక్షణ కరపత్రముమిగతా కారకాలు సమానముగా ఉన్నప్పుడు, వ్యవస్థీకరణ స్థాయి శక్తిని నిర్ణయిస్తుందిశక్తి, తాహతు, లేదా శక్తి పరుచుటకు చాలా కారకాలు తోడ్పడచ్చు, కానీ ఒక ఉత్తేజ పరిచే నాయకుడికి "వ్యవస్థీకరణ" అతి ముఖ్యమైనది. మిగతా కారకాలు సమానముగా ఉన్నప్పుడు, వ్యవస్థీకరణ స్థాయి మరియు సామర్థ్యము ఒక సమూహం, సంస్థ లేదా సమాజము యొక్క శక్తిని నిర్ణయిస్తాయి. ఒక కాలిబంతి జట్టుని ఉదాహరణగా వాడుకుందాం. సమాన సభ్యుల సంఖ్యతో, సమాన పరిధిలో కళ, జబ్బ సత్తువ, సాంకేతిక స్థాయి ( e.g. జోళ్ళ నాణ్యత) ఉన్న రెండు కాలిబంతి జట్టులు సమానముగా ఉంటాయి. ఒక జట్టు వ్యవస్థీకరించబడి లేదు అనుకోండి; శ్రమ విభజన లేకుండా, సమన్వయం లేకుండా, గుర్తించదగ్గ సంఘ సంవిధానం లేకుండా ఉంది అనుకోండి. అవతల జట్టు వ్యవస్థీకరించబడి, అధికారము గల గురువు కలిగి ఉండి, వేరు వేరు చోట్ల నుంచి ఆడే వాళ్ళకి వివిధమైన పాత్ర కలిగి ఉండి, మరియు ఇతర శ్రమ విభజన కలిగి ఉంది అనుకోండి. మిగతా కారకాలు సమానముగా ఉన్నప్పుడు, వ్యవస్థీకరణ స్థాయి శక్తిని నిర్ణయిస్తుంది. వేర్వేరు జట్టు సభ్యులకు వేర్వేరు పాత్రలు కలిగి ఉంటారు, మరియు ఒక సమైక్య పద్దతిలో ఆడడం ( e.g. బంతిని ఇతరులకు అందించడం) అభ్యాసిస్తారు. ఈ పరిస్థితిలో మిగతా లక్షణాలు సమానముగా ఉన్నా కూడా, మొదటి జట్టు కన్నా రెండవ జట్టు అధిక శక్తివంతము, అధిక బలము మరియు తాహతు కలిగి ఉందని గ్రహించడం చాలా సులువు. మెరుగైన వ్యవస్థీకరణ మెరుగైన తాహతుని ఇస్తుంది. ఇది మొత్తం సమాజానికి వర్తిస్తుంది. ఈ ఉదాహరణ చూడండి (దీని వెనక ఉన్న చరిత్ర కోసం కాకుండా, సామాజిక సూత్రములు కోసం). పశ్చిమ ఆఫ్రికాకు చెందిన అకాన్ జాతి పదహారు మరియు పదిహేడవ శతాబ్దాలలో తీవ్రంగా విస్తరించారు, మరియు వాళ్ళ ముందు వచ్చిన గ్వాన్ జాతిని జయించారు. వాళ్ళ సాంకేతిక జ్ఞానము (ఆయుధాలతో పాటు) యొక్క స్థాయి సమానముగా ఉండేది, చాలా వరకు మిగతా లక్షణాలు కూడా. కానీ గ్వాన్ జాతి పితృ వంశీకులు మరియు చెదురు వంశాలలో ఉండేవారు, అకాన్ జాతి వాళ్ళు మాతృ వంశీకులు, వివిధ గోత్రాల వాళ్ళు ప్రయోజనాత్మక బంధుత్వాలలో వ్యవస్థీకరించ బడి, కేంద్రీకృతమైన స్థావరాలలో ఉంది, ప్రతి ఒక గోత్రానికి యుధ్ధములో (ముందు, ఎడమ, కుడి, వెనుపల, గృహస్థ, మరియు అద్వితీయమైన) మరియు రాష్ట్ర వ్యవస్థీకరణలో అన్య భూమిక కలిగి ఉండే వాళ్ళు. కాలి బంతి జట్టుని వ్యవస్థీకరించడం లాగే, మిగతా కారకాలు (సాంకేతిక జ్ఞానం, సామర్ధ్యం) సమానముగా ఉన్నప్పుడు, మెరుగైన వ్యవస్థీకరణ గల వ్యవస్థ (అకాన్ జాతి నమూనా ఐన అశాంతి జాతి) తక్కువ వ్యవస్థీకరణ గల వ్యవస్థని జయించును. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక ఉత్తేజ పరిచే నాయకుడిగా మీ లక్ష్యం ఒక పేద సమాజాన్ని శక్తి పరచడం, పటుత్వం కోసం మీరు గురి పెట్టిన సమూహం స్పృహతో వ్యవస్థీకరణ సాధించడంలో మీరు సహాయం చేయడం. దాని కోసమే CBO కార్య నిర్వాహక అధికారిని ఏర్పాటు చేయరాదు, లేదా చక్కనైన బిరుదుల పెట్టు కోవడం కోసం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి ఎంపికలో మీరు సహాయ పడరాదు. వాళ్ళని శక్తి పరచడం కోసం మీరు వ్యవస్థీకరణ సాధించడం, వ్యవస్థీకరణ మెరుగు పరచడం, లేదా సఫల చర్య కోసం పున: వ్యవస్థీకరణ చేయడంలో సహాయ పడాలి. మెరుగైన వ్యవస్థీకరణ మెరుగైన శక్తిని ఇస్తుంది. ఇతర విభాగాలు వ్యవస్థీకరిచడంలో మీకు దారి చూపిస్తాయి. మీరు ఎందుకు వ్యవస్థీకరిస్తున్నారు (ఏమీ సాధించడం కోసం?) అన్న దాని గురించి చైతన్యం కలిగి ఉండండి, మరియు ఈ గొప్ప ఉద్యమంలో (తక్కువ ఆదాయం కల సమాజాలను శక్తి పరచడం) భాగస్వాములుగా మీరు గురి పెట్టిన సమూహాన్ని పాల్గొన నివ్వండి. ––»«––సమాజాన్ని వ్యవస్థీకరించడం © ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ భర్ట్లె
––»«–– |
హొమ్ పేజి |
మొదలు పెట్టడం |