Tweet అనువాదములు:
'العربية / al-ʿarabīyah |
మూల భావనలను తెలుసు కొనండినైపుణ్యము వెనుక వున్న మూల సిద్దాంతములు మరియు ఉద్దేశ్యమురచన: ఫిల్ భర్ట్లె, పీ హెచ్ డీఅనువాదకులు: సరస్వతి కాజశిక్షణ కరపత్రంసమన్వయ కర్త అర్ధము చేసు కొనవలసిన మూల సూత్రములు, సిద్దాంతములుసమాజము ఫాల్గొనుట, పేదరికము, సమాజము, శక్తివంతమవుట, స్పష్టత, సంరక్షణ అంటే ఏమిటి? ఈ పదముల అర్థములు "ముఖ్య పదాలు" పట్టీలో వివరించబడినవి. సమన్వయ కర్తగా వెలుగొందాలి అంటే మీకు బహిరంగములో ప్రసంగిచటము, కార్యసన్నాహానికి సమూహములు ఏర్పాటు చేయటము మించిన నైపుణ్యము కావాలి. మీరు ఆ నైపుణ్యములను ఎందులకు వాడ వలెనో తెలుసు కొనవలయను. మీరు మూల సూత్రములను తెలుసు కొనవలయను. మీ లక్ష్యము సమాజమైన, మీకు ఆ సమాజము యెక్క సాంఘిక స్వభావము మరియు సాంఘిక మార్పు (అంటే అభివృద్ధి కూడ) గురించి తెలియాలి. దీని అర్థము ఏమిటి అంటే మీకు కొద్దిగా సాంఘిక వ్యవస్థాపన గురించి, సమాజ శాస్ర్తము, మానవ శాస్ర్తము, ఆర్ధిక శాస్ర్తము, రాజకీయాల విషయాల పరిజ్ఞానము మరియు ఆ విషయాలకు సంభందించిన శక్తులు, పద్ధతులు యెక్క అవగాహన కొంతైన వుండాలి. ("సంస్కృతి" ని చూడండి) ప్రస్తుతము యూనివరసిటి డిగ్రి అవసరము లేదు, కాని మీకై మీరు ఆ విషయముల జ్ఞానమును, మూల సూత్రములను నేర్చు కోగలగాలి. ఒక వేళ మీరు తక్కవ ఆదయము గల సమాజమును బలపరచాలంటే (శక్తివంతము), మీరు దాని యెక్క శత్రువును, అంటే ఆదారపడే జబ్బును అర్ధము చేసుకొనవలయును.(" ఆదారపడటము" చూడండి"). మీ లక్ష్యము గనుక పేదరికమును నిర్మూలించటము అయితే మీరు పేదరికము యెక్క లక్షణములు, దుష్ఫలితములను మించి తెలుసు కొనవలయను. పేదరికానికి కారణముల విరుగుడు మార్పులను సంరక్షించుట కొరకు, మీరు పేదరికానికి కారణాలను అర్ధము ఛేసుకోవాలి. పేదరిక ఉపశమనము వలన బాధ తాత్కలికముగా తగ్గును, కాని పేదరికము పూర్తిగా నిర్మూలింపపడదు. పేదరికానికి కారణము ఒక్క ధనము మాత్రమే కాదు, పైగా ధనము ఒక్కట్టే పేదరికాన్ని నిర్మూలించదు. ("పేదరికమును తగ్గించటానికి మూల సూత్రములు" చూడండి). మీరు "ముఖ్య పదాలు", లో చూచిన, మీకు "సమాజ కార్మికుడు" విషయముపైన ఒక మాదిరిగా సంపూర్ణ జాబితా లభించును. ఒక్కొక్క దానికి మీకు నిఘంటువు నిర్వచనము దొరకదు; కాని మీకు "సమన్వయ కర్త ఎలా ఉండాలి" అనే ఈ కరపత్రం విషయానికి సంబంధించిన కొద్ది నోట్సు లభించును. తరవాత విభాగము "సమాజమును శక్తివంతము చేయుటకు మూల సూత్రములు", మీకు వివరముగా ఈ సైటులో లభించే మూల సూత్రముల వెనుక వున్న పద్ధతులు, నైపుణ్యములను వివరించును. ఆ నోట్సు కంఠత పట్టనక్కరలేదు. ఒక్కొక్క సిద్దాంతము గురించి ఆలోచించండి. దాని గురించి మీ దినచర్య పుస్తకములో వ్రాయండి. మీ తోటి వారితో సమావేశములలో, సభలలో, కార్ఖానాలలో చర్చించండి. మీ తీరిక సమయములో పని తరువాత, మీ స్నేహితులతో ఫుటబాల స్కోరుల చర్చ సమయము నుండి కొద్ది సమయము ఒకటి రెండు ఈ విషయములను చర్చించటానికి వాడండి. ఒకేసారి అంతా "నేర్చుకోవటానికి చేసే ప్రయత్నము" ఒకేసారి అంతా "తినటానికి చేసే ప్రయత్నము" లాంటిది. సమాజము యెక్క అభివృద్ది గురించి లాంటివి నేర్చుకొనుట ఎప్పట్టికి ఆగకూడదు. నేర్చుకొనుట ఆపినచో మీరు మరణించినట్లు. ––»«––© ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ భర్ట్లె
––»«–– |
మూల పేజి |
సిద్ధము కావటము |